
విజేందర్ సింగ్
ఢిల్లీ: బాక్సింగ్ తన రక్తంలోనే ఉందని, బాక్సింగ్, రాజకీయాలను సమాంతరంగా కొనసాగిస్తానని, గెలిచినా ఓడినా రాజకీయాల్లో కచ్చితంగా కొనసాగుతున్నానని ఒలంపిక్ కాంస్య విజేత, దక్షిణ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజేందర్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో విజేందర్ సింగ్ సాక్షిటీవీతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆప్‌తో పొత్తు పెట్టుకోపోవడమే మంచిదైందన్నారు.
రాజకీయాలు , క్రీడలు వేర్వేరు రంగాలని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బాగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ధనవంతులకే బీజేపీలో స్థానం ఉంటుందన్నారు. తాను ఒక మామూలు డ్రైవర్ కుమారుడినని, తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. దక్షిణ ఢిల్లీ అభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాననితీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment