విజేందర్ ప్రత్యర్థి ఫ్రాన్సిస్ చెకా
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ తన డబ్ల్యుబీవో సూపర్ మిడిల్‌వెరుుట్ ఆసియా పసిఫిక్ టైటిల్‌ను కాపాడుకునేందుకు వచ్చే నెల 17న బరిలోకి దిగనున్నాడు. మాజీ ప్రపంచ చాంపియన్, ప్రస్తుత ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్ అరుున ఫ్రాన్సిస్ చెకా ఈసారి విజేందర్ ప్రత్యర్థి. ఇప్పటిదాకా విజేందర్ ఎదుర్కొన్న వారిలో ఇతడే అత్యంత అనుభవశాలి.
34 ఏళ్ల ఈ టాంజానియన్ 43 బౌట్లలో 32 సార్లు గెలిచాడు. ఇందులో 17 నాకౌట్ విజయాలున్నారుు. 16 ఏళ్ల కెరీర్‌లో అతడికి 300 రౌండ్ల అనుభవం ఉండగా విజేందర్‌కు కేవలం 27 రౌండ్ల అనుభవం మాత్రమే ఉంది. ఇప్పటిదాకా విజేందర్ బరిలోకి దిగిన ఏడు పోటీల్లోనూ ఓటమి లేకుండా దూసుకెళుతున్నాడు.