Francis
-
స్త్రీలోక సంచారం
సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హైస్కూలులో ఆరో తరగతి చదువుతున్న బాలిక.. వార్మింగ్ అప్ (వ్యాయామానికి సిద్ధం చేసే) ఎక్సర్‌సైజ్‌లను సరిగా చేయడం లేదంటూ అందుకు శిక్షగా పి.ఇ.టి. (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) విధించిన 60 ల్యాప్‌లను (గ్రౌండ్లో రౌండ్లు) కొట్టలేక ఛాతీనొప్పితో, శ్వాస ఇబ్బందితో కుప్పకూలి ఆసుపత్రికి చేర్చవలసి వచ్చిన ఘటనకు నివ్వెరపోయిన ‘తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్’ తక్షణం ఆ స్కూలు గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. వ్యాయామ నియమాలను సరిగా పాటించడం లేదని చిన్న పిల్ల చేత అమానుషంగా పరుగులు తీయించినప్పటికీ, ఆ టీచర్‌పై చర్య తీసుకోని యాజమాన్యం.. అందరూ బాలికలే ఉండే పాఠశాలలో మగ టీచర్లు ఉండకూడదన్న నిబంధనను ఉల్లంఘించి, పురుష పి.ఇ.టి.ని నియమించడంపైన కూడా అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో హైదరాబాద్ జిల్లా విద్యాధికారి బి.వెంకట నరసమ్మ ఈ పరిణామాలన్నిటిపై విచారణకు ఆదేశించారు ::: హైదరాబాద్ బాలిక చాందినీ శ్రీనివాసన్.. సెప్టెంబర్‌లో ఖజకిస్తాన్‌లో జరగబోతున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ – ఏసియన్ అండర్ 12 టీమ్ టెన్నిస్ ఫైనల్ పోటీలకు ఎంపికైంది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ అండర్ 12 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నం. 2లో ఉన్న ఎనిమిదేళ్ల చాందినీతో పాటు హరియాణా నుంచి శృతీఅహ్లావత్, ఢిల్లీ నుంచి దుర్గాంశ్ భారత జట్టు తరఫున ఫైనల్స్‌లో తమ సత్తా చూపించేందుకు సిద్ధమౌతున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో 91 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ చేసిన తాజా సర్వేలో వెల్లడయింది. ‘ఫైట్ అనీమియా ఇన్ స్కూల్’ ప్రచారోద్యమంలో భాగంగా ఈ ఏడాది జూన్ 1న ప్రారంభమై ఇటీవలే ముగిసిన తొలి విడత సర్వేలో (మలి విడత జూలై 31కి పూర్తవుతుంది) హైదరాబాద్ కలెక్టరేట్ çపరిధిలోని 156 ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 16,238 మంది బాలికల్లో 70 శాతం మందికి రక్తహీనత, 21 శాతం మందికి తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు ::: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 178 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 22 వేల మంది బాలికలకు రాష్ట్ర విద్యాశాఖ గత మూడు నెలలుగా మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పిస్తున్న శిక్షణ పూర్తి కావచ్చింది. రాణి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో సుశిక్షితులైన పి.ఇ.టి. టీచర్లతో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినులకు ఇప్పిస్తున్న ఈ శిక్షణకు ‘రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్.ఎం.ఎస్.ఎ) కింద కేంద్ర నిధులు అందుతున్నాయి ::: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పాకిస్తాన్లో తొలిసారి ఒక మహిళ పదవీబాధ్యతలు స్వీకరించబోతున్నారు! హైకోర్టు తొలి మహిళా జడ్జిగా, బలూచిస్తాన్‌లో తొలి మహిళా సివిల్ జడ్జిగా, ఇంకా తను చేపట్టిన ప్రతి పదవిలోనూ తొలి మహిళగా ఇప్పటికే గుర్తింపు పొందిన జస్టిస్ సయేదా తహీరా సఫ్దర్.. ఈ ఆగస్టు 31న పదవీ విరమణ పొందుతున్న బలూచిస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో బాధ్యతలు స్వీకరించి, వచ్చే ఏడాది అక్టోబర్ 5 వరకు న్యాయసేవలు అందిస్తారు ::: విషంతో ఔషధాన్ని తయారు చేయడం కోసం ఆన్లైన్లో ఒక సర్పాన్ని తెప్పించుకున్న చైనా యువతి ఆ పాము కాటుకు గురై చనిపోయింది! ఆన్లైన్లో మూగప్రాణుల్ని డెలివరీ చేయడంపై చైనాలో నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి జవాన్జువాన్ అనే ఆన్లైన్ మార్కెట్ నుంచి సర్పాన్ని కొనుగోలు చేసిన ఈ 21 ఏళ్ల మహిళ.. పాము కాటుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల తర్వాత మరణించింది. -
న్యూడ్‌గా కనిపించడం నా ఛాయిస్!
‘‘చుట్టూ సినిమా టీమ్ ఉంది. డైరెక్టర్ ఫ్రాన్సిస్ నా దగ్గరకొచ్చి, నేనప్పుడు చేస్తోన్న సీన్లో నేను మిస్ చేసిన చిన్న కరెక్షన్ చెబుతున్నాడు. అప్పుడు నా ఒంటి మీద బట్టలున్నట్టుగానే ఆయన నన్ను చూశాడు. నేనూ నా ఒంటి మీద బట్టలున్నట్టే భావించా. చుట్టూ ఉన్నవాళ్లంతా ప్రొఫెషనల్స్. నాకేం ఇబ్బంది అనిపించలేదు.’’ జెన్నిఫర్ చెప్పిన మాటలివి. ‘రెడ్ స్పారో’ సినిమాలో సందర్భానుసారం ఒక సన్నివేశంలో జెన్నిఫర్ న్యూడ్‌గా కనిపించింది. ‘‘సినిమా కథ ప్రకారం, ఆ పాత్ర అప్పుడు న్యూడ్‌గా కనిపించడం అవసరం అనుకున్నా. నో చెప్పలేదు. సినిమాల్లో న్యూడ్‌గా కనిపించాలనుకోవడం నా ఛాయిస్. ఇక్కడ ఆ అవసరం ఉందని, చుట్టూ ఉన్నవాళ్లూ కథ గురించే ఆలోచిస్తారనే ఆ సీన్ చేశా..’’ అని చెప్పుకొచ్చిందామె. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. -
విజేందర్ ప్రత్యర్థి ఫ్రాన్సిస్ చెకా
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ తన డబ్ల్యుబీవో సూపర్ మిడిల్వెరుుట్ ఆసియా పసిఫిక్ టైటిల్‌ను కాపాడుకునేందుకు వచ్చే నెల 17న బరిలోకి దిగనున్నాడు. మాజీ ప్రపంచ చాంపియన్, ప్రస్తుత ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్ అరుున ఫ్రాన్సిస్ చెకా ఈసారి విజేందర్ ప్రత్యర్థి. ఇప్పటిదాకా విజేందర్ ఎదుర్కొన్న వారిలో ఇతడే అత్యంత అనుభవశాలి. 34 ఏళ్ల ఈ టాంజానియన్ 43 బౌట్లలో 32 సార్లు గెలిచాడు. ఇందులో 17 నాకౌట్ విజయాలున్నారుు. 16 ఏళ్ల కెరీర్లో అతడికి 300 రౌండ్ల అనుభవం ఉండగా విజేందర్కు కేవలం 27 రౌండ్ల అనుభవం మాత్రమే ఉంది. ఇప్పటిదాకా విజేందర్ బరిలోకి దిగిన ఏడు పోటీల్లోనూ ఓటమి లేకుండా దూసుకెళుతున్నాడు. -
లారీ బోల్తా.. ఇద్దరి మృతి
వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా చాట్రాయి మండలం మార్లపాలెం వద్ద బుధవారం సాయత్రం చోటుచేసుకుంది. చింతలపుడి మండలానికి చెందిన 10 మంది కూలీలు మార్లపాలెం నుంచి మొక్కజొన్నల లోడుతో లారీలో వెళ్తుండగా.. మూల మలుపు వద్ద అదుపుతప్పిన లారీ బోల్తా కొట్టింది. దీంతో లారీ పై కూర్చొని ఉన్న భార్యభర్తలు ఫ్రాన్సిస్(39), లక్ష్మీ(34) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం . -
‘క్రైస్తవులు గేలకు క్షమాపణ చెప్పాలి’
రోమ్: క్రైస్తవులు, రోమన్ కేథలిక్ చర్చిలు గేలకు క్షమాపణ చెప్పాలని పోప్ ఫ్రానిన్స్ ఆదివారం పేర్కొన్నారు. గేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జర్మన్ కార్డినల్ రీన్హార్డ్ మార్క్ వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. జర్మనీ చర్చి గే లతో పాటు పేదలకు స్త్రీలకు, పిల్లలకు క్షమాపణ చెప్పాలన్నారారు. అమెరికాలో నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయన నేపథ్యంలో రిన్హార్డ్ మార్క్ గేల పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
ఇరవై రెండు
మాధవ్ శింగరాజు ఇరవయ్యీ ఇరవై రెండేళ్ల వయసులో అమ్మాయిలు ఎలా ఉంటారు? చీర కడితే దేవకన్యలా ఉంటారు. కత్తి పడితే రుద్రమదేవిలా ఉంటారు. ఒళ్లంతా మెరుపు, వయ్యారాల విరుపు. ఆ వయసులో ప్రతి అమ్మాయీ తన దేశపు యువరాణే. నింగీ తనదే, నేలా తనదే. బయట పడీ పడక కొట్టుకు చచ్చే వేల గుండెకాయల శ్రుతిలయలన్నీ తనవే. ఇరవైకి అంత ‘ఛార్మ్’ ఉంది. ‘‘అబ్బా..స్! ఇప్పుడే ఇలా ఉందంటే, ఇక ట్వంటీస్‌లో..’ అంటూ అబ్బాయిలు అప్పుడప్పుడు స్త్రీల ‘శిల్ప’యుగంలోకి ప్రయాణిస్తుండేది ఇందుకే. బహుశా స్త్రీలు కూడా వీలుంటే మళ్లీ ఆ ఏజ్‌లోకి వెళ్లిపోవాలని కోరుకుంటారేమో. కానీ లెవిన్స్కీ (41) తన ట్వంటీస్ అంటేనే ఉలిక్కిపడుతున్నారు! ‘‘వద్దు బాబోయ్, ఆ ఇరవై రెండేళ్ల వయసులోకి తిరిగి వెళ్లడం ఊహల్లోనైనా నాకు ఇష్టం లేదు’’ అంటున్నారు! ట్వంటీస్‌లో లెవిన్స్కీ అమెరికన్ దేవకన్యలా ఉండేవారు. కన్నీరు పెట్టకుండా, కత్తి పట్టి ఉంటే ఆమె కూడా అమెరికా అంతర్యుద్ధ రుద్రమదేవి ఫ్రాన్సిస్ క్లాలిన్ లానే కనిపించేవారు. ఎవరీ లెవిన్స్కీ? మోనికా లెవిన్స్కీ అంటే కొంత గుర్తుకు రావచ్చు. పూర్తిగా గుర్తుకు రావాలంటే మాత్రం అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని ఆయన పాలనా సౌధంలోనే పాదాక్రాంతం చేసుకున్న అమ్మాయి అని చెప్పాలి. ఇదిగో ఈ మాటకే లెవిన్స్కీకి కళ్లమ్మట నీళ్లొచ్చేస్తాయి. ‘‘నేను చేసింది తప్పే. ఒక దేశాధ్యక్షుణ్ని ప్రేమించడం నా జీవితంలోని అతి పెద్ద మిస్టేక్. ఈ రోజుకీ ఏడుస్తుంటాను ఇంట్లో కూర్చుని. నన్నెంత పొడుచుకుతిందీ లోకం! ట్రాంప్ అంది. టార్ట్ అంది. స్లట్ అంది. హోర్ అంది. బింబో అంది’’ అని తలచుకుని తలచుకుని విలపిస్తున్నారు లెవిన్స్కీ. పదిహేడేళ్ల తర్వాత తొలిసారిగా ఆమె తన తెలివితక్కువ ప్రేమ గురించి బయట ఫ్రెండ్స్ మధ్య మాట్లాడారు.. ఓ ‘జ్ఞానోదయ కూటమి’లో. పదిహేడేళ్ల క్రితం అంటే... కొత్తగా అప్పుడే ఇంటర్నెట్ వల పన్నుతున్న కాలం. తొలి బలి లెవిన్స్కీ! క్లింటన్‌తో లెవిన్స్కీ ప్రేమపై నెట్లో భారీ దుమారం రేగింది. బాగా దుష్ర్పచారం జరిగింది. ఒక వైట్‌హౌస్ ట్రెయినీ ఉద్యోగి ప్రేమలో అమెరికా ప్రెసిడెంట్ పడిపోవడం ఆ దేశ ప్రజలకు నచ్చలేదు. ఆ కోపాన్ని ఆమెపై నెట్లో నిర్దయగా ప్రదర్శించారు. ‘‘ఆ వయసులో మీరేం తప్పు చేయలేదా? చేయకపోతే చేతులెత్తండి. మీలో కొందరైనా మీ బాస్‌ను ప్రేమించే ఉంటారు. అయితే నా బాస్‌లా మీ బాస్ అమెరికా అధ్యక్షుడు కాదు. అంతే తేడా’’ అని లెవిన్స్కీ చిరునవ్వుతో అన్నప్పటికీ, ఆ తర్వాత ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఆమె ఫ్రెండ్స్ హృదయాలను బరువెక్కించాయి. ‘‘ఒకరి బాధ ఇంకొకరి సంతోషం అయింది. ఒకరి పర్సనల్ విషయాలు ఇంకొకరి మార్కెట్ వ్యవహారాలు అయ్యాయి. జీవితాలను నెట్‌కి ఎక్కించి ఎందుకింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు. ఈమధ్య టేలర్ అనే అబ్బాయి ఇంకో అబ్బాయిని కిస్ చేస్తుండగా రహస్యంగా తీసిన వీడియోను టేలర్ రూమ్మేట్ ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. టేలర్ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంగతి తెలిసి, మా అమ్మ నాకు ఫోన్ చేసి ఎంతో బాధపడింది. నా ఇరవై రెండేళ్ల వయసులోనూ అమ్మ ఇలాగే బాధపడింది. నెట్లో నాపై ఏవేవో వస్తున్నాయని అమ్మతో అన్నప్పుడు, వాటిని పట్టించుకోవద్దని చెప్పడానికైతే చెప్పింది కానీ, అవన్నీ భరించలేక నేనెక్కడ ఆత్మహత్య చేసుకుంటానోనని అమ్మ ఎప్పుడూ నన్ను కనిపెట్టుకునే ఉండేది. ఆఖరికి నేను స్నానం చేస్తున్నా కూడా తలుపులు తెరిచే ఉంచమని చెప్పేది’’ అని తన ఇరవైల నాటి నెట్ ‘అల్లిక ’లను నెర్వస్‌గా గుర్తుచేసుకున్నారు లెవిన్స్కీ. ప్రస్తుతం ఓ యువ పిపాసి (27) లెవిన్స్కీ వెంటపడుతున్నాడట.. ప్రేమిస్తున్నానని! ‘‘ఈవయసులోనా?’’ అని లెవిన్స్కీ ఆశ్చర్యం. ‘‘మీరొప్పుకుంటే మిమ్మల్ని మళ్లీ మీ ఇరవై రెండులోకి తీసుకెళ్లగలను’’ అని ఆ యువకుడి ఉబలాటం! లెవిన్స్కీ భయపడుతున్నదీ అందుకే. మగవాళ్లు ఎక్కడికైనా తీసుకెళ్లగలరు.. గతంలోకి, భవిష్యత్తులోకీ! వర్తమానంలో తమకు కావలసిన ప్రేమను దక్కించుకోడానికి వెనక్కీ, ముందుకీ ఎన్ని యుగాల దూరమైనా తీసుకెళ్లగలరు.