
మరిన్ని విజయాలు సాధిస్తా: విజేందర్
డబ్లిన్: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించిన భారత అగ్రశ్రేణి బాక్సర్ విజేందర్ సింగ్ ఇదే ఉత్సాహంతో దూసుకెళ్తానని చెప్పాడు. ‘ప్రొఫెషనల్ కెరీర్‌లో ఒక్కో మెట్టెక్కుతున్నాను. నిలకడతో మరిన్ని విజయాలు సాధిస్తాను. నా తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ అనంతరం మెరుగవుతానని చెప్పాను.
రెండో పోటీలో అనుకున్నట్లే పరిణతి సాధించాను’ అని విజేందర్ అన్నాడు. శనివారం జరిగిన బౌట్‌లో ప్రత్యర్థి డీన్ జిలెన్‌ను విజేందర్ కేవలం తొలి రౌండ్లోనే ఓడించిన సంగతి తెలిసిందే.