
విజేందర్(vs)జుల్పికర్
‘డబుల్’ టైటిల్ కోసం నేడు అమీతుమీ
ముంబై: డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ కోసం భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు చైనాకు చెందిన జుల్పికర్ మైమైటియాలితో తలపడనున్నాడు. ఇప్పటిదాకా ఓటమి లేకుండా ఎనిమిది నాకౌట్ విజయాలతో దూసుకెళుతున్న విజేందర్ ఈ బౌట్‌పై కూడా ధీమాగా ఉన్నాడు. ‘ఇది భారత్, చైనా మధ్య పోరు. దేశం మొత్తం నా వెనకాలే ఉందని తెలుసు. ఈ బౌట్‌పై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కచ్చితంగా నాదే గెలుపు.
పూర్తి ఫిట్‌నెస్ కోసం ఒక్క రోజులోనే రెండు కిలోలు తగ్గాను. బౌట్‌లో అతడు ఆడే విధానాన్ని బట్టి నా ప్రణాళికలు ఉంటాయి. నా టెక్నిక్ కూడా మార్చుకున్నాను’ అని డబ్లు్యబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్ విజేందర్ తెలిపాడు. జుల్పికర్ ప్రస్తుతం డబ్లు్యబీవో ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ విజేతగా ఉండగా నేటి బౌట్‌లో గెలిచిన విజేతకు ప్రత్యర్థి టైటిల్ కూడా దక్కుతుంది.
రాత్రి గం. 7.00 నుంచి సోనీ టెన్–1లో ప్రత్యక్ష ప్రసారం