
న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ అరంగేట్రం ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 12వ తేదీన విజేందర్ బౌట్ జరగాల్సింది. అయితే ఈ బౌట్ కోసం సిద్ధమవుతున్న సందర్భంగా ప్రాక్టీస్ సెషన్‌లో విజేందర్ ఎడమ కంటికి గాయమైంది. గాయం తీవ్రతదృష్ట్యా అతని కంటికి ఆరు కుట్లు వేశారు. ‘స్పారింగ్ సెషన్‌లో నా సహచరుని మోచేయి నా కంటికి బలంగా తాకింది. వైద్యుల సూచనతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నాను.
గాయం నుంచి కోలుకున్నాకే బౌట్ తదుపరి తేదీని నిర్ణయిస్తాం. దేవుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడని నేను విశ్వసిస్తాను. ఈ గాయం కూడా నా మంచి కోసమే జరిగిందని భావిస్తున్నాను’ అని 33 ఏళ్ల విజేందర్ వ్యాఖ్యానించాడు. 2015లో ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఇప్పటివరకు 10 బౌట్‌లలో పోటీపడి అన్నింట్లోనూ విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment