జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ పేట్రియాట్స్ జట్టు బౌలర్ షాదాబ్ (5/36) ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పేట్రియాట్స్ జట్టు 14 పరుగుల తేడాతో హైదరాబాద్ వాండరర్స్ జట్టుపై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అజిత్ సింగ్ (75) అర్ధ సెంచరీతో రాణించగా... అక్రమ్ అలీ 35, షాబాద్ 30 పరుగులు చేశారు. హైదరాబాద్ వాండరర్స్ బౌలర్లు అజయ్, త్రిషంక్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ వాండరర్స్ 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సయ్యద్ అస్కారి (51) అర్ధ సెంచరీతో చెలరేగగా... అజయ్ 35 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో బౌలర్ రాహుల్ (4/10) శ్రమించినప్పటికీ చీర్‌ఫుల్ చమ్స్‌కు విజయం చేకూరలేదు. హెచ్‌జీసీ జట్టు రెండు వికెట్ల తేడాతో చీర్‌ఫుల్ చమ్స్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చే సిన చీర్‌ఫుల్ చమ్స్ 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. వినీత్ (49), రవితేజ (34) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన హెచ్‌జీసీ 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. ఉమా మహేశ్వర్ (51) అర్ధ సెంచరీతో రాణించాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
డెక్కన్ వాండరర్స్: 121 (యాది రెడ్డి 3/23); విజయానంద్: 94.
శాంతి ఎలెవన్: 98 (ప్రసాద్ 50; రోహిత్ 3/3);రోహిత్ ఎలెవన్: 99/1(రంజీత్ 62).
రెడ్ హిల్స్: 161 (మీసుమ్ అబు 51; తాహ 4/38); ఇన్‌కమ్ టాక్స్: 164/6 (శివచరణ్ 62, మహ్మద్ 3/21).
షాదాబ్‌కు 5 వికెట్లు
Published Sun, Dec 29 2013 1:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement