2023 వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ నిన్న (జూన్ 27) విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తొలి దశ మ్యాచ్‌లు నవంబర్ 12 వరకు జరుగుతాయి. అనంతరం రెండు సెమీఫైనల్స్, నవంబర్ 19 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ టోర్నీలో తొలి దశ మ్యాచ్‌లు జరిగే విధానాన్ని రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటారు. అంటే టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు (10) మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన తొలి దశలో 10 జట్లు 9 మ్యాచ్‌ల్లో పోటీపడతాయి. తొలి దశ ముగింపు సమయానికి టాప్-4లో ఉండే నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి. ఇక్కడి నుంచి నాకౌట్ దశ (ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది) మొదలవుతుంది.
నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో (ముంబై) తొలి దశ అనంతరం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. ఆ మరుసటి రోజు (నవంబర్ 16) జరిగే రెండో సెమీస్‌లో తొలి దశ అనంతరం రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో ప్లేస్‌లో ఉన్న జట్టును ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. కాగా, 2019 వన్డే వరల్డ్‌కప్ కూడా ఇదే ఫార్మాట్‌లో జరిగిన విషయం తెలిసిందే.
భారత్ వార్మప్ మ్యాచ్‌లు..
సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి)
అక్టోబర్ 3: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (తిరువనంతపురం)
భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..
అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై)
నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు)
నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు..
నవంబర్ 15: సెమీఫైనల్-1 ఏ1 వర్సెస్ ఏ4 (ముంబై)
నవంబర్ 16: సెమీఫైనల్-2 ఏ2 వర్సెస్ ఏ3 (కోల్‌కతా)
నవంబర్ 19: ఫైనల్ సెమీస్-1 విజేత వర్సెస్ సెమీస్-2 విజేత (అహ్మదాబాద్)
Comments
Please login to add a commentAdd a comment