సావోపాలో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఉరుగ్వే స్టార్ ఆటగాడు లూయీస్ సారెజ్ చెలరేగాడు. అతని సంచలన ప్రదర్శనతో గురువారం అర్ధ రాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఉరుగ్వే 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడిన 2 మ్యాచ్‌లూ ఓడింది.
39వ నిమిషంలో హెడర్ ద్వారా గోల్ చేసి సారెజ్ ఉరుగ్వేకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 75వ నిమిషంలో వేన్ రూనీ గోల్‌తో ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రూనీకి ప్రపంచకప్‌లో ఇదే తొలి గోల్. అయితే మళ్లీ అద్భుతంగా ఆడిన సారెజ్ 85వ నిమిషంలో మరో గోల్ చేసి తన జట్టును గెలిపించాడు.
సారెజ్ సంచలనం: ఇంగ్లండ్‌పై ఉరుగ్వే విజయం
Published Fri, Jun 20 2014 9:06 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
Advertisement
Advertisement