ఫిలాడెల్ఫియా: దాదాపు గత పది సంవత్సరాలుగా వెనుజులా చేతిలో ఓటమి ఎరుగని ఉరుగ్వేకు కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో తొలిసారి షాక్ తగలింది. భారత కాల మాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో వెనుజులా 1-0 తేడాతో ఉరుగ్వేను ఓడించింది. ఆట 36వ నిమిషంలో సలోమాన్ రాండాన్స్ గోల్ చేసి వెనుజులాను ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఉరుగ్వే దూకుడుగా ఆడిన వెనుజులా డిఫెన్స్ను ఛేదించలేక ఓటమి పాలైంది. దీంతో వెనుజులా క్వార్టర్స్ లో కి చేరింది.
ఇది 2006 తరువాత ఉరుగ్వేకు తొలి ఓటమి కాగా, కోపా అమెరికా కప్లో వెనుజులా వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. గత మ్యాచ్ల్లో మెక్సికో చేతిలో ఉరుగ్వే ఓటమి పాలుకాగా, మెక్సికోపై వెనుజులా విజయం సాధించిన సంగతి తెలిసిందే.