FIFA World Cup 2022: Uruguay and South Korea play out a pulsating 0-0 draw - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: ఉరుగ్వేకు చుక్కలు చూపించిన దక్షిణ కొరియా

Published Fri, Nov 25 2022 7:50 AM | Last Updated on Fri, Nov 25 2022 11:53 AM

FIFA WC 2022:Uruguay And South Korea Play Out A Pulsating 0 0 Draw - Sakshi

FIFA World Cup 2022- FIFA World Cup 2022- South Korea Vs Uruguay- దోహా: ఈ ప్రపంచకప్‌లో ఆసియా జట్లు తమకెదురైన గట్టి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నా యి. వరుసగా మూడో రోజు మరో ఏషియన్‌ టీమ్‌ దక్షిణ కొరియా మ్యాచ్‌లో గెలవకపోయినా... పటిష్ట మైన ఉరుగ్వేని నిలువరించింది. దీంతో గ్రూప్‌ ‘హెచ్‌’లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఒక్క గోల్‌ నమోదు కాకుండానే 0–0తో డ్రాగా ముగిసింది.

ఉరుగ్వేకు తొలి, రెండో అర్ధ భాగంలో దాదాపు గోల్‌ చేసే అవకాశమొచ్చింది. 43వ నిమిషంలో గోల్‌పోస్ట్‌కు అత్యంత చేరువ లో తలపై నుంచి  వచ్చిన బంతిని డీగో గాడిన్‌ ‘హెడర్‌’గా మలిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో సువర్ణావకాశం చేజారింది. మళ్లీ రెండో అర్ధభాగంలోనూ మ్యాచ్‌ నిలిచే దశలో 89వ నిమిషంలో ఫెడెరికో వాల్వెర్డ్‌కు కూడా ఇలాంటి ఛాన్సే వచ్చినా ఖాతా మాత్రం తెరవలేకపోయింది.  

కాగా ఈ మ్యాచ్‌లో కొరియా కెప్టెన్‌ సన్‌ హ్యుంగ్‌ మిన్‌ ప్రత్యేకమైన ఫేస్‌మాస్క్‌తో దిగాడు. ఇటీవల చాంపియన్స్‌ లీగ్‌ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాడు చాన్సెల్‌ ఎంబెంబా బలంగా తగలడంతో హ్యుంగ్‌ మిన్‌ ఎడమ కంటికి గాయమైంది. దీంతో గాయం తీవ్రత దృష్ట్యా శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది.

అయితే దానికి సిద్ధమైతే ప్రపంచకప్‌కు దూరమయ్యేవాడు. దాంతో ఈ మెగా టోర్నీలో అతను ముందు జాగ్రత్తగా ఫేస్‌మాస్క్‌ పెట్టుకునే ఆడాడు. ఇతనికి సంఘీభావంగా కొరియా అభిమానులు కూడా ‘బ్యాట్‌మన్‌’లాంటి మాస్క్‌లతో మైదానంలోకి వచ్చారు.
చదవండిIND vs NZ 1st ODI:తొలుత బ్యాటింగ్‌ చేయనున్న భారత్‌.. యువ బౌలర్లు ఎంట్రీ! సంజూకి ఛాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement