ఫుట్‌బాల్ సాకర్ సమరానికి సమయం అసన్నమైంది. ఖాతార్ వేదికగా ఆదివారం (నవంబర్ 20) ఫిఫా వరల్డ్‌కప్-2022 ప్రారంభం కానుంది. ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం ఒక్కటి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు వచ్చిన అర్జెంటీనా, ఉరుగ్వే జట్లు ఏకంగా 4,000 పౌండ్ల(1800) కిలోల మాంసం తీసుకువచ్చాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఈ రెండు ఫుట్‌బాల్ పవర్‌హౌస్‌లు తమ హోం ఫుడ్ రుచిని కోల్పోకుండా ఉండడానికి ఇంత మొత్తంలో మంసాన్ని తీసుకువచ్చాయి.
అయితే ఈ ఫుడ్‌ను ఖతార్‌కు తరలించేందుకు రెండు దేశాల ఫుట్‌బాల్ అసోసియేషన్లు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా ఉరుగ్వే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీట్ ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని మాంసాన్ని సరఫరా చేస్తుంది. ఇక ఈ విషయంపైఉరుగ్వే ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇగ్నాసియో అలెన్సో స్పందించారు.
"మా జట్టుతో పాటు అత్యధిక పోషణ గల ఆహారాన్ని కూడా తీసుకువెళ్లాము. ప్రపంచంలోనే ఉరుగ్వే మాంసం అత్యుత్తమైనది" అని ఇగ్నాసియో అలెన్సో ఈస్పీఎన్‌తో పేర్కొన్నారు. కాగా దక్షిణ అమెరికా దేశాలలో మాంసంతో తయారుచేసే అత్యంత ప్రసిద్ద వంటకాల్లో 'అసాడో' ఒకటి. యూఏఈతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 5-0 తో గెలిచిన తర్వాత ఈ అసాడోను అర్జెంటీనా జట్టు టెస్టు చేసింది. ఉరుగ్వే కూడా కూడా అబుదాబి స్టేడియంలో అసాడోను రుచి చూసింది.
చదవండి: FIFA WC 2022: ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు
Comments
Please login to add a commentAdd a comment