వేరే రికార్డు ప్లే చేసి.. నాలుక్కరుచుకున్నారు | Wrong anthem played for Uruguay before Copa America match | Sakshi
Sakshi News home page

వేరే రికార్డు ప్లే చేసి.. నాలుక్కరుచుకున్నారు

Published Mon, Jun 6 2016 9:53 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

వేరే రికార్డు ప్లే చేసి.. నాలుక్కరుచుకున్నారు

వేరే రికార్డు ప్లే చేసి.. నాలుక్కరుచుకున్నారు

లాస్ ఏంజిలెస్: కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్లో ఉరుగ్వే, మెక్సికో మ్యాచ్కు ముందు తప్పిదం దొర్లింది. ఉరుగ్వే జాతీయ గీతానికి బదులు చిలీ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న టోర్నీ అధికారులు నాలుక్కరుచుకున్నారు. పొరపాటు జరిగిందని, క్షమించాల్సిందిగా విన్నవించారు. ఉరుగ్వేకు, ఆ దేశ ఫుట్బాల్ జట్టుకు, ఆ దేశ ప్రజలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇది మానవతప్పిదమని, ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరణ ఇచ్చుకున్నారు.

కాగా పొరపాటున వేరే జాతీయ గీతం రికార్డును ప్లే చేసినా, ఆ సమయంలో ఉరుగ్వే ఆటగాళ్లు నిశ్శబ్ధంగా నించున్నారు. ఆదివారం రాత్రి ఫోనిక్స్ యూనివర్శిటీ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది. మ్యాచ్కు ముందు ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించడం ఆనవాయితీ. ఈ మ్యాచ్లో మెక్సికో 3-1 స్కోరుతో ఉరుగ్వేను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement