యూరో కప్-2024ను రొమేనియా ఘనంగా ఆరంభించింది. సోమవారం మ్యూనిచ్ వేదికగా గ్రూపు-ఈలో భాగంగా ఉక్రెయిన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 3-0 తేడాతో రొమేనియా ఘన విజయం సాధించింది. కాగా 24 ఏళ్ల యూరో ఛాంపియన్ షిప్ చరిత్రలో రొమేనియాకు ఇదే తొలి విజయం కావడం విశేషం.
కళ్లుచెదిరే గోల్..
ఈ మ్యాచ్ ఫస్ట్‌హాఫ్ హోరాహోరీగా సాగింది. తొలి 20 నిమిషాల పాటు ఇరు జట్ల గోల్ కీపర్స్ ఎటువంటి గోల్స్ సాధించేందుకు అవకాశమివ్వలేదు. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్‌లో 29వ నిమిషాన రొమేనియా కెప్టెన్ నికోలే స్టాన్సియు అద్బుతమైన గోల్‌తో మెరిశాడు.
రజ్వాన్ మారిన్ నుంచి పాస్ అందుకున్న స్టాన్సియు రైట్ కార్నర్ వైపు నుంచి కళ్లుచెదిరే రీతిలో గోల్ కొట్టాడు. స్టాన్సియు పవర్ ఫుల్ కెనాన్ షాట్‌ను ఉక్రెయిన్ గోల్ కీపర్ ఆండ్రీ లునిన్ ఆపలేకపోయాడు.
దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి రొమినేయా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సెకెండ్ హాఫ్‌లో రజ్వాన్ మారిన్, డెన్నిస్ మాన్ చెరో గోల్ సాధించి రొమేనియాకు చారిత్రత్మక విజయాన్ని అందించారు.
🇷🇴🚀 This goal from Nicolae Stanciu (31) vs Ukraine is absolutely incredible! 😍
Hit with sweet perfection. 🤌 pic.twitter.com/LJGDwsHAJS— EuroFoot (@eurofootcom) June 17, 2024
Comments
Please login to add a commentAdd a comment