యూరో క‌ప్‌లో ఓట‌మి.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఫుట్‌బాల్ దిగ్గ‌జం | Thomas Muller announces retirement from International football after Euro Cup | Sakshi
Sakshi News home page

యూరో క‌ప్‌లో ఓట‌మి.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఫుట్‌బాల్ దిగ్గ‌జం

Jul 16 2024 1:39 PM | Updated on Jul 16 2024 2:56 PM

Thomas Muller announces retirement from International football after Euro Cup

జ‌ర్మ‌నీ ఫుట్‌బాల్ దిగ్గ‌జం థామ‌స్ ముల్లెర్ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. తమ సొంత గడ్డపై జరిగిన యూరో కప్‌-2024లో జర్మనీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ మెగా టోర్నీ క్వార్ట‌ర్ ఫైన‌ల్లోనే జర్మనీ కథ ముగిసింది.

ఈ టోర్నీలో మిల్ల‌ర్ కూడా త‌న స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు. ఈ క్ర‌మంలో త‌మ జ‌ట్టు ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయిన ముల్లెర్.. త‌న ఫుట్‌బాల్ కెరీర్‌కు ముగింపు ప‌లకాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

"దేశం త‌ర‌పున అత్యున్న‌త‌స్ధాయిలో ఆడ‌టం ఎల్ల‌ప్పుడూ గ‌ర్వ‌కార‌ణ‌మే. నా కెరీర్‌లో ఎన్నో విజ‌యాల‌ను చూశాను. కొన్నిసార్లు క‌న్నీళ్ల పెట్టున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. నేను జ‌ర్మ‌నీ త‌ర‌పున అరంగేట్రం చేసిన‌ప్పుడు ఇవ‌న్నీ సాధిస్తాని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. 

ఇన్నేళ్ల‌గా నాకు మ‌ద్దతుగా నిలిచిన నా స‌హ‌చ‌రుల‌కు,  అభిమానుల‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాన‌ని" త‌న రిటైర్మెంట్ నోట్‌లో ముల్ల‌ర్ పేర్కొన్నాడు. కాగా అటాకింగ్ మిడ్‌ఫీల్డ‌ర్‌గా ముల్లెర్ జ‌ర్మ‌నీకి ఎన్నో అద్భుత విజ‌యాల‌ను అందించాడు. 

2014లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుపొందిన జ‌ర్మ‌నీ జ‌ట్టుకు ముల్లెరె కెప్టెన్ కావ‌డం గ‌మ‌నార్హం. త‌న కెరీర్‌లో 131 మ్యాచ్‌లు ఆడిన ముల్లెర్‌.. 45 గోల్స్, 41 అసిస్ట్‌లు త‌న పేరిట లిఖించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. యూరోకప్‌ విజేతగా స్పెయిన్‌ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించి టైటిల్‌ను స్పెయిన్‌ సొంతం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement