Euro Cup 2024: సెల్ఫ్‌ గోల్‌తో ఓడిన ఇటలీ | Euro Cup 2024: Spain Beat Italy Advances To Knock Out Round | Sakshi
Sakshi News home page

Euro Cup 2024: సెల్ఫ్‌ గోల్‌తో ఓడిన ఇటలీ

Published Sat, Jun 22 2024 9:16 AM | Last Updated on Sat, Jun 22 2024 11:13 AM

Euro Cup 2024: Spain Beat Italy Advances To Knock Out Round

గెల్‌సెన్‌కిర్చెన్‌ (జర్మనీ): యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోరీ్నలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇటలీ జట్టుకు చుక్కెదురైంది. మాజీ విజేత స్పెయిన్‌తో శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో ఇటలీ 0–1 గోల్‌ తేడాతో ఓడిపోయింది.

మరోవైపు.. వరుసగా రెండో విజయంతో స్పెయిన్‌ జట్టు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించింది. ఆట 55వ నిమిషంలో స్పెయిన్‌ ఫార్వర్డ్‌ అల్వారో మొరాటో హెడర్‌ షాట్‌ను ఇటలీ గోల్‌కీపర్‌ గియాన్లుగి డొనారుమా నిలువరించాడు.

అయితే ఇటలీ గోల్‌కీపర్‌ నిలువరించిన బంతి ఇటలీ డిఫెండర్‌ రికార్డో కాలాఫియోరి కాలికి తగిలి తిరిగి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. దాంతో ఇటలీ సెల్ఫ్‌ గోల్‌తో స్పెయిన్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–1తో పోలాండ్‌ జట్టుపై, ఉక్రెయిన్‌ 2–1తో స్లొవేకియాపై గెలిచాయి.  

చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్‌...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement