
UEFA Champions League 2021-22.. యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్‌లో భాగంగా అర్జెంటీనా గోల్ కీపర్ జువాన్ ముస్సో పాయింట్ బ్లాక్‌లో గోల్ అడ్డుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గోల్ కీపర్ తాను అడ్డుకొని తన జట్టును ఓటమి నుంచి రక్షించాడు. అట్లాంటా, విల్లారియల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆటలో ఫస్ట్‌హాఫ్ కాసేపట్లో ముగుస్తుందనగా.. ప్రత్యర్థి మిడ్‌ఫీల్డర్ వేగంగా దూసుకొచ్చి గోల్‌పోస్ట్ వైపు బంతిని తన్నాడు.
అయితే అప్పటికే అప్రమత్తమైన జువాన్ ముస్సో గాల్లోకి ఎగిరి పాయింట్ బ్లాక్ తేడాతో తన చేతితో బంతిని గోల్‌పోస్ట్ పై నుంచి వెళ్లేలా చేశాడు. దీంతో అట్లాంటా బతికిపోయింది. ఆ తర్వాత ఇరు జట్లు చెరో గోల్ చేయడం.. ఓవరాల్‌గా 2-2తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అట్లాంటా తరపున రెమో ఫ్రూలర్ ఆట 6వ నిమిషంలో.. రాబిన్ గోసెన్స్ 83వ నిమిషంలో గోల్ చేయగా.. విల్లారియల్ తరపున మనూ ట్రిగురస్ ఆట 39వ నిమిషంలో.. ఆర్నాట్ డంజూమా 73వ నిమిషంలో గోల్ చేశాడు.
చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు
Cristiano Ronaldo: రొనాల్డో సంచలనం.. ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర