మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి | Pitch Invader Nearly Takes Out Lionel Messi UEFA Champions League | Sakshi
Sakshi News home page

Lionel Messi: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి

Published Fri, Mar 10 2023 9:00 AM | Last Updated on Fri, Mar 10 2023 9:02 AM

Pitch Invader Nearly Takes Out Lionel Messi UEFA Champions League - Sakshi

అర్జెంటీనా లియోనల్‌ మెస్సీని ఒక అభిమాని భయపెట్టాడు. ప్రస్తుతం మెస్సీ పారిస్‌ సెయింట్‌ జెర్మెన్‌(పీఎస్‌జీ) తరపున యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్‌ లీగ్‌(UEFA)లో ఆడుతున్నాడు. రౌండ్‌ ఆఫ్‌ 16లో భాగంగా బెయర్న్‌ మ్యునిచ్‌తో మ్యాచ్‌ జరిగింది. 

కాగా లైవ్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించని రీతిలో గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ఒక వ్యక్తి మెస్సీని పట్టుకోబోయాడు. అయితే మెస్సీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ వ్యక్తి పట్టు తప్పి కింద పడిపోయాడు. ఇది గమనించిన సిబ్బంది రంగప్రవేశం చేసి అతన్ని బయటకు తీసుకెళ్లారు. కానీ అజ్ఞాతవ్యక్తి చర్య మెస్సీని భయపెట్టినట్లుగా అతని ఎక్స్‌ప్రెషన్‌ ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో బెయర్న్‌ మ్యునిచ్‌  2-0 తేడాతో పీఎస్‌జీ జట్టుపై విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఎరిక్‌ మాక్సిమ్‌ మోటింగ్‌(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్‌ చేశారు. కాగా బెయర్న్‌ మ్యునిచ్‌ యూఈఎఫ్‌ఏలో క్వార్టర్స్‌ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం.

చదవండి: PSL 2023: ఫఖర్‌ జమాన్‌ వీరవిహారం.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ జోరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement