live match
-
మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి
అర్జెంటీనా లియోనల్ మెస్సీని ఒక అభిమాని భయపెట్టాడు. ప్రస్తుతం మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) తరపున యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్(UEFA)లో ఆడుతున్నాడు. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా బెయర్న్ మ్యునిచ్‌తో మ్యాచ్ జరిగింది. కాగా లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించని రీతిలో గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఒక వ్యక్తి మెస్సీని పట్టుకోబోయాడు. అయితే మెస్సీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ వ్యక్తి పట్టు తప్పి కింద పడిపోయాడు. ఇది గమనించిన సిబ్బంది రంగప్రవేశం చేసి అతన్ని బయటకు తీసుకెళ్లారు. కానీ అజ్ఞాతవ్యక్తి చర్య మెస్సీని భయపెట్టినట్లుగా అతని ఎక్స్ప్రెషన్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో బెయర్న్ మ్యునిచ్ 2-0 తేడాతో పీఎస్జీ జట్టుపై విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఎరిక్ మాక్సిమ్ మోటింగ్(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్ చేశారు. కాగా బెయర్న్ మ్యునిచ్ యూఈఎఫ్ఏలో క్వార్టర్స్ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం. A pitch invader tried to slide tackle Messi after the game yesterday 😳 But Messi just side-stepped the tackle and kept walking on 😂 This man used to dribble past Ramos, Pepe, Vidic and Van Dijk. What was the fan thinking 😭😭💀pic.twitter.com/FsBySjTJBO — IG: TheFootballRealm (@theftblrealm) March 9, 2023 చదవండి: PSL 2023: ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు -
సినిమా థియేటర్లలో భారత్-పాక్ లైవ్ మ్యాచ్!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ఉందంటే ఇక క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్సే. ఇరుదేశాల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు అటు పాక్‌లోనూ, ఇటు భారత్‌లోనూ ఎడతెగని ఉత్కంఠంతో ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు క్రికెట్ ప్రియులు. శనివారం కోల్‌కతాలో టి20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్- పాక్ ల మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు పాకిస్తాన్‌లోని పేషావార్ నగరంలో ఏకంగా సినిమా థియేటర్లలో శనివారం లైవ్ మ్యాచ్(ప్రత్యక్ష ప్రసారం)కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు అక్కడి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు.. 100 (పాకిస్తాన్ కరెన్సీలో) చొప్పున సినిమా థియేటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేస్తున్నట్టు డాన్ ఆన్లైన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా యువకులను ఆకర్షించేందుకు సినిమా థియేటర్ల వద్ద పెద్ద సైజులో పోస్టర్లు, బ్యానర్లు పెట్టినట్టు పాక్ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వేతర సంస్థలు కూడా ప్రజలందరూ భారత్, పాక్ లైవ్ మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్, పాక్ ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో కూడా ఈ తరహా ఏర్పాట్లే చేసినట్టు ఓ క్రికెట్ అభిమాని తెలిపాడు. భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ఆయా సినిమా థియేటర్లలో అంతరాయం లేకుండా విద్యుత్ తప్పనిసరిగా సరఫరా చేయాలని క్రికెట్ అభిమానులు పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.