UEFA Champions League
-
మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు
యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో మెస్సీ సారధ్యంలోని పీఎస్జీ కథ ముగిసింది. గురువారం తెల్లవారుజామున డిఫెండింగ్ ఛాంపియన్ బెయర్న్ మ్యునిచ్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పీఎస్జీ 2-0 తేడాతో ఓటమి పాలై నాకౌట్ అయింది. బెయర్న్ మ్యునిచ్ తరపున ఎరిక్ మాక్సిమ్ మోటింగ్(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్ చేశారు. కాగా బెయర్న్ మ్యునిచ్ యూఈఎఫ్ఏ లీగ్‌లో క్వార్టర్స్ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం. కాగా 2020లో ఇదే బెయర్న్ మ్యునిజ్.. అప్పటి పీఎస్జీని ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం బెయర్న్ మ్యునిచ్ కెప్టెన్.. జర్మనీ స్టార్ ఫుట్‌బాలర్ థామస్ ముల్లర్ మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెస్సీని ఒకవైపు మెచ్చుకుంటేనే మరోవైపు అవమానించాడు. ''మెస్సీ ఒక రియలిస్టిక్ ఆటగాడు.. మ్యాచ్ గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అర్జెంటీనా స్టార్‌గా అతను ఎన్నో ఘనతలు సాధించాడు. అతనంటే నాకు గౌరవం.. కానీ పారిస్ జెయింట్స్ లాంటి ఫుట్‌బాల్ క్లబ్స్ తరపున మాత్రం మెస్సీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. క్లబ్స్‌లో తన రియలిస్టిక్ ఆటను చూడలేకపోతున్నాం. దేశం తరపున మాత్రమే మెస్సీ కెప్టెన్‌గా పనికొస్తాడు.. క్లబ్స్ తరపున కెప్టెన్‌గా పనికిరాడు. ఈ ఒక్క విషయంలో క్రిస్టియానో రొనాల్డోతో మెస్సీని పోల్చవచ్చని.. మెస్సీ లాగే రొనాల్డో కూడా ఇటీవలే కాలంలో కెప్టెన్‌గా విఫలమవుతున్నాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి.'' అంటూ తెలిపాడు. Thomas Müller: "Against Messi, things always go well at all levels in terms of results. At club level, Cristiano Ronaldo was our problem when he was at Real Madrid. But I have the greatest respect for Messi's World Cup performance" [@georg_holzner] pic.twitter.com/duZ94DgZxw — Bayern & Germany (@iMiaSanMia) March 9, 2023 చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి -
మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి
అర్జెంటీనా లియోనల్ మెస్సీని ఒక అభిమాని భయపెట్టాడు. ప్రస్తుతం మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) తరపున యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్(UEFA)లో ఆడుతున్నాడు. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా బెయర్న్ మ్యునిచ్‌తో మ్యాచ్ జరిగింది. కాగా లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించని రీతిలో గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఒక వ్యక్తి మెస్సీని పట్టుకోబోయాడు. అయితే మెస్సీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ వ్యక్తి పట్టు తప్పి కింద పడిపోయాడు. ఇది గమనించిన సిబ్బంది రంగప్రవేశం చేసి అతన్ని బయటకు తీసుకెళ్లారు. కానీ అజ్ఞాతవ్యక్తి చర్య మెస్సీని భయపెట్టినట్లుగా అతని ఎక్స్ప్రెషన్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో బెయర్న్ మ్యునిచ్ 2-0 తేడాతో పీఎస్జీ జట్టుపై విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఎరిక్ మాక్సిమ్ మోటింగ్(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్ చేశారు. కాగా బెయర్న్ మ్యునిచ్ యూఈఎఫ్ఏలో క్వార్టర్స్ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం. A pitch invader tried to slide tackle Messi after the game yesterday 😳 But Messi just side-stepped the tackle and kept walking on 😂 This man used to dribble past Ramos, Pepe, Vidic and Van Dijk. What was the fan thinking 😭😭💀pic.twitter.com/FsBySjTJBO — IG: TheFootballRealm (@theftblrealm) March 9, 2023 చదవండి: PSL 2023: ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు -
మనీషా కిక్ కొడితే...
పంజాబ్ రాష్ట్రం హొషియార్పూర్ జిల్లాలోని ముగొవాల్ గ్రామం...ఆ ఊర్లో ఒక రోజు ఒక టీనేజ్ అమ్మాయి ఫుట్‌బాల్‌తో డ్రిబ్లింగ్ చేస్తూ మైదానంలో కనిపించింది. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఆ గ్రామానికి ఇది కూడా ఒక వార్తగా మారింది! అమ్మాయిలు ఆటలు ఆడటమే ఎక్కువ అనుకుంటే అందులోనూ ఫుట్‌బాల్ ఆడటం వారిని సహజంగానే ఆశ్చర్యానికి గురి చేసింది. ఊహించినట్లుగానే అందరినుంచీ విమర్శలూ వచ్చాయి. అయితే ఆ అమ్మాయి ఎవ్వరీ మాటా వినలేదు, తన ఆటనూ మార్చుకోలేదు. ఆ తర్వాత మైదానంలోనే సత్తా చాటి అనూహ్య వేగంతో దూసుకుపోయింది. ఇప్పుడు భారత్ తరఫున చాంపియన్స్ లీగ్ బరిలోకి దిగిన తొలి మహిళగా ఘనతకెక్కింది. 21 ఏళ్ల ఆ ప్లేయర్ పేరే మనీషా కల్యాణ్. పాఠశాలలో ఉన్నప్పుడు చాలా మందిలాగే మనీషా రన్నింగ్ రేస్‌లలో పాల్గొంది. స్కూల్లోనే కాబట్టి ఆ విషయంలో ఎప్పుడూ పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ ఒక రోజు మనీషాలోని వేగాన్ని, ఆమె కాళ్ల కదలికలను గుర్తించిన కోచ్ ఆమె ఫుట్బాల్కైతే సరిగ్గా సరిపోతుందని భావించాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. మనీషాకు కూడా వ్యక్తిగత క్రీడలకంటే టీమ్ గేమ్‌లంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో వెంటనే ఓకే అనేసింది. అయితే వీరిద్దరు కూడా ఊర్లో వచ్చే అభ్యంతరాల గురించి అసలు ఆలోచించలేకపోయారు. చిన్నపాటి దుకాణం నడుపుకునే తండ్రికి ఆటలపై ఎలాంటి అవగాహన లేకపోగా, అసలు మనకెందుకీ తంటా అన్నట్లుగా పెద్దగా ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే కోచ్ అన్ని విషయాల్లో సరైన మార్గదర్శిగా నిలవడం మనీషాను ముందుకు వెళ్లేలా చేయగలిగింది. అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ / ఫార్వర్డ్‌గా మైదానంలో మనీషా తన ముద్ర చూపించగలిగింది. 2021–22లో భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎమర్జింగ్ ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఆమెకే దక్కింది. వేగంగా దూసుకెళ్లి... 13 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ వైపు మళ్లిన ఈ అమ్మాయి నాలుగేళ్లు తిరిగే సరికే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. వేర్వేరు వయో విభాగాల సెలక్షన్స్‌లో రాణించడంతో మనీషాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన ‘బ్రిక్స్’ దేశాల అండర్–17 ఫుట్‌బాల్ కప్‌తో తొలిసారి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే మనీషా కల నెరవేరింది. ఆ తర్వాత 2019 ఏఎఫ్సీ అండర్–19 చాంపియన్‌షిప్ ఆమె కెరీర్లో మరో మలుపు. భారత జట్టు పాకిస్తాన్‌ను 18–0తో చిత్తు చేసిన మ్యాచ్‌లో ‘హ్యాట్రిక్’తో చెలరేగిన మనీషా థాయిలాండ్‌పై భారత్ విజయం సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే సీనియర్ టీమ్‌కు కూడా ఎంపికై మనీషా సంచలనం సృష్టించింది. 2019 ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీషా అరంగేట్రం చేసింది. గత ఏడాది ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బ్రెజిల్‌పై సాధించిన గోల్ ఆమెను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. క్లబ్ తరఫున ఆడుతూ... ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు లీగ్‌లలో క్లబ్‌లకు ఆడే అవకాశం రావడం కూడా ఆటగాళ్లకు వరంలాంటిదే. మనీషా ప్రతిభను గుర్తించిన ఇండియన్ ఉమెన్స్ లీగ్ క్లబ్ ‘గోకులమ్ కేరళ’ ఆమెను జట్టులోకి తీసుకుంది. ఆ జట్టు వరుస విజయాలతో టైటిల్ గెలవడంలో భాగం కావడంతో పాటు ప్రతిష్టాత్మక ఏఎఫ్సీ ఉమెన్స్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో గోకులమ్ టీమ్ తరఫున ఆడుతూ ఉజ్బెకిస్తాన్ క్లబ్ బున్యోడ్కర్ ఎఫ్‌సీపై చేసిన గోల్‌తో మనీషా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ టోర్నీలో ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడే అదే ఆమెకు యూఈఎఫ్ఏ మహిళల చాంపియన్స్ లీగ్‌లో ఆడే అవకాశం కల్పించింది. భారత మహిళల ఫుట్‌బాల్‌లో దిగ్గజంలాంటి బాలాదేవిని అభిమానించే మనీషా ఆమె తరహాలో మరింత పైకి ఎదగాలని పట్టుదలగా ఉంది. యూఈఎఫ్ఏ మహిళల చాంపియన్స్ లీగ్‌లో ఆడిన తొలి భారత మహిళగా మనీషా నిలిచింది. ‘అపోలాన్ లేడీస్ ఎఫ్‌సీ’ టీమ్ తరఫున గురువారం ఆమె అరంగేట్రం చేసింది. ఎస్‌ఎఫ్‌కే రిగాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 60వ నిమిషంలో మరిలెనా జార్జియాకు సబ్‌స్టిట్యూట్‌గా మనీషా మైదానంలోకి దిగింది. అపోలాన్ టీమ్‌తో ఆమె రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. –సాక్షి క్రీడా విభాగం -
‘పది హ్యాట్రిక్కుల’ మొనగాడు.. అదిరిపోయే డీల్
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం. కనివిని ఎరుగని రీతిలో పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి సంచలనానికి తెర తీశాడు ఈ ఫుట్‌బాల్ మొనగాడు. యూరోపియన్ క్వాలిఫైయర్స్(UEFA Champions League) టోర్నీలో భాగంగా.. మంగళవారం పోర్చుగల్ తరపున రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో లగ్జెంబర్గ్ 5-0 తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్తోనూ వార్తల్లోకెక్కాడు మరి. సింగపూర్ వ్యాపారదిగ్గజం, వాలెన్షియా(స్పెయిన్) ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్ పీటర్ లీమ్కి రొనాల్డోకి చాలాకాలంగా దోస్తీ ఉంది. గతంలో లిమ్‌కు చెందిన మింట్ మీడియా ద్వారా రొనాల్డో చిత్రాల వ్యాపారం కూడా జోరుగా సాగించింది. ఈ తరుణంలో జూజూజీపీ అనే అనే ప్లాట్‌ఫామ్ కోసం వీళ్లిద్దరూ మళ్లీ చేతులు కలిపారు. ఫుట్‌బాల్, టెక్నాలజీ, కమ్యూనికేషన్.. ఈ మూడింటి ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్ పని చేస్తుండడం విశేషం. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ (తన ఏడాది సంపాదనలో 30 శాతం విలువ చేసే రెమ్యునరేషన్!) తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇకపై ఫుట్బాల్ని జనాలు చూసే విధానం మారుతుంది’ అంటూ ఓ స్టేట్మెంట్ను జాయింట్‌గా రిలీజ్ చేశారు రొనాల్డో-లీమ్. పోర్చ్‌గల్ కెప్టెన్ అయిన 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో.. ఈమధ్య కాలంలో వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. కెరీర్ మొత్తంగా యాభై ఎనిమిదిసార్లు హ్యాట్రిక్ గోల్స్, పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఫిఫా లెక్కల ప్రకారం.. 182 మ్యాచ్‌ల్లో 115 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు సంపాదనలోనూ సమవుజ్జీగా భావించే అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీని దాటేసి.. 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫుట్‌బాలర్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. ఏడాదికి రొనాల్డో 922 కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు ఫోర్బ్స్ గణాంకాలు చెప్తున్నాయి. Unlucky 😢 What a bicycle kick 😭#CristianoRonaldo #CR7 #bicyclekick pic.twitter.com/18EVZ34BWo — Habibulla Sonet (@HabibullaSonet) October 12, 2021 చదవండి: ఐస్‌బాత్‌లో రొనాల్డొ చిందులు.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! -
పాయింట్ బ్లాక్‌లో గోల్ ఆపాడు.. మ్యాచ్‌ను కాపాడాడు
UEFA Champions League 2021-22.. యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్‌లో భాగంగా అర్జెంటీనా గోల్ కీపర్ జువాన్ ముస్సో పాయింట్ బ్లాక్‌లో గోల్ అడ్డుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గోల్ కీపర్ తాను అడ్డుకొని తన జట్టును ఓటమి నుంచి రక్షించాడు. అట్లాంటా, విల్లారియల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆటలో ఫస్ట్‌హాఫ్ కాసేపట్లో ముగుస్తుందనగా.. ప్రత్యర్థి మిడ్‌ఫీల్డర్ వేగంగా దూసుకొచ్చి గోల్‌పోస్ట్ వైపు బంతిని తన్నాడు. అయితే అప్పటికే అప్రమత్తమైన జువాన్ ముస్సో గాల్లోకి ఎగిరి పాయింట్ బ్లాక్ తేడాతో తన చేతితో బంతిని గోల్‌పోస్ట్ పై నుంచి వెళ్లేలా చేశాడు. దీంతో అట్లాంటా బతికిపోయింది. ఆ తర్వాత ఇరు జట్లు చెరో గోల్ చేయడం.. ఓవరాల్‌గా 2-2తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అట్లాంటా తరపున రెమో ఫ్రూలర్ ఆట 6వ నిమిషంలో.. రాబిన్ గోసెన్స్ 83వ నిమిషంలో గోల్ చేయగా.. విల్లారియల్ తరపున మనూ ట్రిగురస్ ఆట 39వ నిమిషంలో.. ఆర్నాట్ డంజూమా 73వ నిమిషంలో గోల్ చేశాడు. చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు Cristiano Ronaldo: రొనాల్డో సంచలనం.. ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర View this post on Instagram A post shared by UEFA Champions League (@championsleague) -
వర్ణ వివక్ష: మీలాంటి అభిమానులు మాకొద్దు
లండన్: ఈ మధ్యన క్రీడల్లో వర్ణ వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానుల్లో కొంతమంది తమ ఫేవరెట్ జట్టు ఓడిపోతే జట్టులోని కొందరు ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూరోకప్ 2020లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆదివారం జరిగిన యూరోకప్ ఫైనల్లో ఇటలీ ఇంగ్లండ్‌ను ఫెనాల్టీ షూటౌట్లో ఓడించి 53 ఏళ్ల తర్వాత యూరోకప్ను గెలుచుకుంది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉండడంతో ఫెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. అయితే ఫెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ తమ స్వయంకృత తప్పిదాలతో ఓడిపోవాల్సి వచ్చింది. అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యారీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం కూడా పెద్ద తప్పే. ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్‌ఫోర్డ్ మూడు పెనాల్టీలు వృథా చేశారు. అయితే మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యరీ కేన్ ఆటగాళ్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలను తప్పుబడుతూ ఘాటుగా స్పందించాడు. '' మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఈరోజు ఫైనల్లో మేం ఓడిపోయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్ఫోర్డ్లను టార్గెట్ చేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. నిజానికి ఆ ముగ్గురికి అనుభవం లేకపోవచ్చు.. కానీ ఒక చారిత్రక ఫైనల్ మ్యాచ్‌ను వారు ఆడారంటే.. వారిలో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇక్కడి వరకు రారు. ఫెనాల్టీ షూటౌట్లో వారిపై నమ్మకముంచి అవకాశమిచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ మేము ఫలితాన్ని అందుకోలేకపోయాం. అంత మాత్రానికే మీలో కొందరు ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగుతారా.. జట్టుకు అవసరం లేదని వారిపై కామెంట్లు చేశారు. ఇప్పుడు నేను చెబుతున్నా.. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన మీలాంటి అభిమానులు మాకొద్దు'' అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. మరోవైపు ఓటమి అనంతరం ఇంగ్లండ్ వీధుల్లో కూడా అభిమానులు వీరంగం సృష్టించారు. లీసెస్టర్ స్క్వేర్ వద్ద చెత్త పోసి బాటిల్స్ తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగియగానే పలువురు ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేయడం బాధాకరం. ఇక మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఇటలీ నవ్వింది
‘ఇట్స్ కమింగ్ హోమ్... యూరో కప్ ప్రారంభమైన రోజు నుంచి ఇంగ్లండ్ అభిమానులు ఎప్పటిలాగే ఆశలు, అంచనాలతో హోరెత్తించారు. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మేజర్ టోర్నీలో ఫైనల్ చేరడంతో వారి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. సొంతగడ్డపై జరిగే తుది పోరులో కచ్చితంగా తమ జట్టే గెలుస్తుందని భావించి ముందస్తు సంబరాలకు సిద్ధమైపోయారు. కానీ యూరో కప్ ఇంగ్లండ్ ఇంటికి రాలేదు. లండన్ నుంచి సుమారు వేయి మైళ్ల దూరంలోని రోమ్ నగరానికి తరలి పోయింది. పెనాల్టీ షూటౌట్ వరకు చేరిన సమరంలో సత్తా చాటిన ఇటలీ యూరప్ చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టు యూరో గెలవడం ఇది రెండోసారి కాగా... ఇంగ్లండ్ తొలి టైటిల్ విజయానికి మరోసారి దూరంగా నిలిచిపోయింది. లండన్: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ యూరో కప్ –2020ని ఇటలీ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్లో 3–2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం కూడా ముగిసిన తర్వాత ఇరు జట్లు 1–1 గోల్స్ స్కోరుతో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అంతకుముందు తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ తరఫున 2వ నిమిషంలో ల్యూక్ పాల్ షా గోల్ సాధించగా... రెండో అర్ధభాగంలో లియోనార్డో బొనుసి 67వ నిమిషంలో ఇటలీకి గోల్ అందించి స్కోరు సమం చేశాడు. తాజా విజయంతో వరుసగా 34 మ్యాచ్‌ల పాటు ఓటమి ఎరుగని ఘనతను సాధించిన ఇటలీ 1968 తర్వాత మళ్లీ యూరో ట్రోఫీని గెలుచుకుంది. మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. హోరాహోరీ... 90 వేల సామర్థ్యం గల వెంబ్లీ స్టేడియం... కరోనా కారణంగా అధికారికంగా 67 వేల మందికే అనుమతి. అయితేనేం... తమ జట్టు ఆడుతోంది కాబట్టి టికెట్ లేని వీరాభిమానులు కూడా గేట్లు బద్దలు కొట్టి పెద్ద సంఖ్యలో స్టేడియంలోకి దూసుకొచ్చారు. ఫైనల్లో తొలి 30 నిమిషాల ఆట చూస్తే స్థానిక అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసేలా కనిపించింది. ఆట ఆరంభంలోనే ట్రిప్పియర్ ఇచ్చిన హాఫ్ వాలీ క్రాస్ పాస్‌ను నేరుగా ఇటలీ గోల్ పోస్ట్‌లోకి షా పంపడంతో స్టేడియం దద్దరిల్లింది. 1 నిమిషం 57వ సెకన్లో షా చేసిన ఈ గోల్ ఒక యూరో ఫైనల్లో అత్యంత వేగవంతమైన గోల్‌గా గుర్తింపు పొందింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇటలీ మెల్లగా కోలుకునే ప్రయత్నం చేసింది. జట్టు మిడ్ ఫీల్డర్లు చక్కటి పాస్‌లతో బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఆధిక్యం అందుకున్న తర్వాత కూడా ఇంగ్లండ్ ఆశ్చర్యకరంగా డిఫెన్స్‌కే పరిమితమైంది. ముఖ్యంగా కెప్టెన్ హ్యరీ కేన్ కనీసం ఒక్క గోల్ స్కోరింగ్ అవకాశం కూడా సృష్టించకుండా పేలవ ప్రదర్శన కనబర్చడం జట్టును దెబ్బ తీసింది. రెండో అర్ధ భాగంలో ఇటలీ శ్రమకు తగిన ఫలితం లభించింది. వెరాటీ కొట్టిన హెడర్‌ను ఇంగ్లండ్ కీపర్ పిక్‌ఫోర్డ్ అడ్డుకున్నా... సమీపంలోనే ఉన్న బొనుసి గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో సఫల మయ్యాడు. అదనపు సమయంలో మాత్రం ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలమమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందకు షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో ఇటలీ 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో సాకా గోల్ చేసి ఉంటే మ్యాచ్ సడెన్డెత్కు వెళ్లేది. అయితే తొలిసారి జాతీయ జట్టు తరఫున పెనాల్టీ తీసుకున్న సాకా కొట్టిన కిక్‌ను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డొనరుమా ఎలాంటి ఆందోళన లేకుండా ఎడమ వైపునకు డైవ్ చేస్తూ కూల్‌గా ఆపడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. ఇంగ్లండ్ ప్లేయర్ సాకా కొట్టిన చివరి షాట్‌ను నిలువరిస్తున్న ఇటలీ గోల్‌కీపర్ డొనరుమా పునరుజ్జీవం... నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్... 2018లో జరిగిన ప్రపంచకప్‌కు కనీసం అర్హత సాధించలేకపోయింది. ఇటలీ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విచారకర క్షణాలవి. ప్రదర్శన పాతాళానికి పడిపోయిన జట్టును తీర్చిదిద్దే బాధ్యతను కొత్త కోచ్ రాబర్టో మన్సినీ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇటలీ ‘పునరుజ్జీవం’ పొందింది. ‘యూరో’ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడిన పది మ్యాచ్‌లలో పది కూడా గెలిచి అజేయంగా, అందరికంటే ముందుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాదే జరగాల్సిన ఈ మెగా టోర్నీ కోవిడ్ కారణంగా ఏడాది వాయిదా పడింది. ఆ సమయంలో ఇటలీ దేశం తీవ్ర క్షోభను అనుభవించింది. కరోనా కారణంగా ఆ దేశంలో ఏకంగా 1 లక్షా 27 వేల మరణాలు నమోదయ్యాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌లో ఇదే పెద్ద సంఖ్య. గత 16 నెలల్లో వివిధ రూపాల్లో లాక్డౌన్లను ఎదుర్కొన్న ఇటలీకి ‘యూరో’ కొత్త ఆరంభాన్నిచ్చింది. ఈ టోర్నీలో సొంతగడ్డ రోమ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఫైనల్‌తో కలిపి ఇటలీకి వరుసగా 34 మ్యాచ్‌లలో ఓటమి అనేదే లేదు. అసాధారణ పరిస్థితులను అధిగమించి, తమకు ఊరటనందిస్తూ సాధించిన ఈ విజయానికి యావత్ ఇటలీ పులకించిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆ ముగ్గురిపై ఆగ్రహం... 19, 21, 23... ఇంగ్లండ్ తరఫున మూడు పెనాల్టీలు వృథా చేసిన బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్ఫోర్డ్ల వయసులు ఇవి. చెప్పుకోదగ్గ అంతర్జాతీయ అనుభవం లేని కుర్రాళ్లు. అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యరీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం కూడా పెద్ద తప్పే. మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఓటమి అనంతరం ఇంగ్లండ్ వీధుల్లో కూడా అభిమానులు వీరంగం సృష్టించారు. లీసెస్టర్ స్క్వేర్ వద్ద చెత్త పోసి బాటిల్స్ తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగియగానే పలువురు ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేయడం విషాదం! అవార్డులు గోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్) క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–5 గోల్స్) గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్ ప్లేయర్) డొనరుమా (ఇటలీ) -
Euro 2020: ఇంగ్లండ్‌కు తగిన శాస్తే జరిగిందా?
55 ఏళ్ల తర్వాత దక్కిన ఛాన్స్, ఐదేళ్ల క్రితం ప్రపంచ కప్ క్వాలిఫై కాకుండా పోయిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం.. ఈ రెండింటికీ ఒకేసారి సమాధానం, అదీ సొంతగడ్డపై చెప్పే వీలు దొరికింది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకి. అలాంటిది కాలిదాకా వచ్చిన అవకాశాన్ని.. చేజేతులారా పొగొట్టుకుంది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీం. యూరో 2020 ఫైనల్లో ఇటలీ చేతిలో అదీ షూట్అవుట్(మ్యాచ్ 1-1 డ్రా అయ్యింది) ఓటమి ద్వారా బాధాకరమైన నిట్టూర్పును విడిచింది. వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన Euro 2020 కప్ సందర్భంగా చర్చించుకోదగ్గ పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. ఐదు దశాబ్ధాల తర్వాత గెలుపు అంచుదాకా చేరిన సొంత జట్టును ప్రోత్సహించేందుకు రాజకుటుంబం సైతం వెంబ్లేకి కదిలింది. సెలబ్రిటీలు, సగటు సాకర్ అభిమానులంతా స్టేడియం బయట, లండన్ వీధుల్లో గుంపులుగా చేరారు. భారీ అంచనాల నడుమ జరిగిన మ్యాచ్ డ్రా కావడం, పెనాల్టీ షూట్అవుట్ వీరుడిగా పేరున్న బుకాయ సకా అతితెలివి ప్రదర్శించి చేయాలనుకున్న గోల్ సైతం మిస్ కావడం, వెరసి.. ఇంగ్లండ్ ఓటమి పాలవ్వడాన్ని ఇంగ్లీష్ సాకర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ 1996 వరల్డ్ కప్ తర్వాత ఒక మేజర్ టైటిల్ ఇంత చేరువలో రావడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అయితే అతి ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సాకర్ నిపుణులు. 2018 ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఫర్ఫార్మెన్స్ మెరుగైందనే అంచనాకి వచ్చేశారు. ఇక ఈ ఏడాది సొంతగడ్డ మీద వరుస విజయాలు.. యూరో 2020 ఫైనల్ దాకా చేరుకోవడంతో అభిమానుల్లోనే కాదు.. ఆటగాళ్లలోనూ ఆత్మ విశ్వాసం నింపింది. ఈ క్రమంలో ఇటలీని చాలా చిన్నచూపు చూసింది ఇంగ్లండ్. రాబర్టో మన్సినీ ఆధ్వర్యంలో వరుసగా 33 మ్యాచ్‌లు గెలిచి యూరప్‌లోనే బెస్ట్ టీంగా ఉన్న ఇటలీ బలాబలాలను తక్కువ అంచనా వేసి ఘోర తప్పిదం చేసింది. వెరసి బెస్ట్ ప్లేయర్లు ఉండి కూడా కప్ కొట్టలేకపోయింది ఇంగ్లండ్. అచ్చీరాని షూట్అవుట్లు ఇంగ్లండ్‌కు ఇలా షూట్అవుట్లతో ఝలక్‌లు తగలడం కొత్తేంకాదు. 1990, 1996, 1998, 2004, 2006, 2012లలో మెగా టోర్నీలలో ఇంగ్లండ్ షూట్అవుట్ పెనాల్టీల ద్వారానే నిష్క్రమించాల్సి వచ్చింది. అభిమానుల అతి.. వ్యతిరేకత ఇంగ్లండ్ ఓటమికి ఇది ఒక కారణం కాకపోవచ్చు. కానీ, ఇటలీని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఇవే కారణాలు అయ్యాయి. ఇంగ్లండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, మద్దతు ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ నింపింది. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసుకునే అవకాశం ఇవ్వలేకపోయింది. పైగా సెమీ ఫైనల్లో డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ కళ్లలో అభిమానులు లేజర్ లైట్లు కొట్టడం, అభిమానులపై దాడులు చేయడం ఘటనలు విపరీతమైన చర్చకు దారితీసింది. ఇక ఫైనల్‌కు ముందు ఇటలీ పట్ల ప్రదర్శించిన వివక్ష కూడా ఓ కారణంగా మారింది. అంతెందుకు ఫైనల్లో షూట్అవుట్ పెనాల్టీ మిస్ చేసినందుకు బుకాయో సకాపై సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు, మిగతా ఇద్దరిపై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారంటే.. అక్కడి అభిమానుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రియల్ విన్నర్ జార్జియో చియెల్లిని సారథ్యంలోని ఇటలీ ఫుట్‌బాల్ టీం 2020 యూరో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. సుమారు మూడువందల కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ గెల్చుకుంది. ఇటలీకి ఇది రెండో యూరోపియన్ ఛాంపియన్షిప్ టైటిల్. 2006 ఫిఫా వరల్డ్ కప్ విజయం తర్వాత గెలిచిన మేజర్ టోర్నీ. కానీ, 2018లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్(ఫిఫా)కు కనీసం అర్హత సాధించలేకపోయింది. దీంతో అరవై ఏళ్ల ఇటలీ ఫుట్‌బాల్ చరిత్ర ఒక్కసారిగా మసకబారింది. అయితే ఆ అవమానం నుంచి కోలుకోవడానికి ఇటలీకి ఎంతో టైం పట్టలేదు. ఆరు నెలల తర్వాత రాబర్టో మన్సినీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి మొదలైన వరుస క్లీన్ విక్టరీలు, హుందాగా వ్యవహరించే జట్టు, వాళ్ల ఫ్యాన్స్.. ఇదీ ఇటలీ టీం పట్ల ఫాలోయింగ్ పెరగడానికి కారణం అయ్యాయి. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల రెండు పెనాల్టీ షూట్ అవుట్లను అడ్డుకోవడంతో(మూడోది గోల్ రాడ్‌కి తగిలి మిస్ అయ్యింది) రియల్‌హీరోగా మారిపోయాడు గియాన్లుయిగి డొన్నారుమ్మ. Euro 2020 Final లో ఇంగ్లండ్ ఓటమిపై స్పందిస్తూ.. ‘ఇటలీ మిమ్మల్ని ఓడించలేదు. కానీ, మీరే వాళ్లకు తలొగ్గారు’ అంటూ డచ్ సాకర్ దిగ్గజం జోహన్ క్రుయఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటలీది భయంకరమైన డిఫెన్స్ ఆట, ఆ మంత్రం సింపుల్ది. అది అందరికీ తెలుసు. అయినా ఇంగ్లండ్ ఓడిందంటే అది వాళ్ల నిర్లక్క్ష్యమేనని పేర్కొన్నాడు ఆయన. ఇక యూరో 2020 రన్నర్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు 267 కోట్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంగ్లండ్ ఆశలు ఆవిరి.. ఇటలీ ఘన విజయం
లండన్: ఆదివారం జరిగిన యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్‌పై ఇటలీ విజయం సాధించి విజేతగా నిలిచింది. లండన్‌లోని విఖ్యాత వెంబ్లీ స్టేడియంలో టైటిల్ పోరులో ఇంగ్లండ్, ఇటలీ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లండ్ ఆటగాడు ల్యూక్ షా 2వ నిమిషానికే గోల్ కొట్టడంతో ఆధిపత్యంలో కొనసాగింది. అయితే ఇటలీ ఆటగాడు లియోనార్డో బోనుసి 67వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. దీంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు 1-1తో నిలవగా.. అదనపు సమయంతో ఆటను పొడిగించారు. అయితే, అప్పుడు ఇరు జట్లు గోల్ చేయలేకపోయకపోవడంతో.. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఈ క్రమంలో... గోల్ కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకొని ఇటలీ గెలుపును ఖాయం చేశాడు. దీంతో 55 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌కు నిరాశే మిగిలింది. అంతకుముందు 1968లో ఇటలీ యూరో కప్ విజేతగా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అభిమానానికి గుర్తుగా గిఫ్ట్; గుక్కపట్టి ఏడ్చేసిన అమ్మాయి
లండన్: యూఈఎఫ్ఏ చాంపియన్‌షిప్ యూరోకప్ 2020లో ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ మాసన్ మౌంట్ మ్యాచ్ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించి 55 ఏళ్ల తర్వాత మరో మెగాటోర్నీలో ఫైనల్‌కు అడుగుపెట్టింది. ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది. ఇదంతా చూసిన మిగతావాళ్లు.. '' మీ తండ్రీ కూతుళ్లు అదృష్టవంతులు.. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం'' అంటూ కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఈ వీడియోనూ రెమ్ విలియ్స్ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయగా ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ దాదాపు 6.7 మిలియన్ వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మెగాటోర్నీలో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జూలై 11న ఇటలీతో టైటిల్ పోరుకు తలపడనుంది. This moment had me 🥺 @masonmount_10 👏🏾 pic.twitter.com/tzWWlPijW6 — Rem Williams (@remmiewilliams) July 8, 2021 -
55 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఇంగ్లండ్
లండన్: యూఈఎఫ్ఏ చాంపియన్‌షిప్ యూరోకప్ 2020లో ఇంగ్లండ్ జట్టు 55 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. డెన్మార్క్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించింది. 1966 ప్రపంచకప్ తర్వాత ఒక మేజర్ టోర్నీలో ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆట 30వ నిమిషంలో డెన్మార్క్ ఆటగాడు మిక్కెల్ డ్యామ్స్‌గార్డ్ ఫెనాల్టీ కిక్‌ను అద్బుతమైన గోల్‌గా మలిచాడు. అయితే డెన్మార్క్ ఆటగాళ్ల తప్పిదంతో ఇంగ్లండ్ కూడా కాసేపటికే ఖాతా తెరిచింది. మ్యాచ్ ముగిసేసమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో ఆట అదనపు సమయానికి వెళ్లింది. అయితే అదనపు సమయం అవకాశాన్ని ఇంగ్లండ్ అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆ జట్టు ఆటగాడు హారీ కేన్ ఫెనాల్టీ కిక్‌ను అద్బుత గోల్‌గా మలవడంతో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి వెళ్లగా.. అదనపు సమయం ముగిసేలోపు డెన్మార్క్ మరో గోల్ చేయడంలో విఫలమైంది. దీంతో ఇంగ్లండ్ యూరోకప్‌లో ఫైనల్ చేరింది. -
EURO CUP 2020: ఫైనల్ చేరిన ఇటలీ
లండన్: యూఈఎఫ్ఏ చాంపియన్‌షిప్ యూరోకప్ 2020 కప్‌లో ఇటలీ ఫైనల్లో అడుగుపెట్టింది. స్పెయిన్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఫెనాల్టీ షూటౌట్ ద్వారా ఇటలీ విజయం సాధించింది. మ్యాచ్‌లో భాగంగా ఇటలీ తరపున 60వ నిమిషంలో ఫెడెరికో చిసా గోల్ చేయగా.. స్పెయిన్ తరపున అల్వారో మొరాటా 80వ నిమిషంలో గోల్ చేశాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 1-1తో సమంగా నిలిచిన ఇటలీ, స్పెయిన్లు తమకు కేటాయించిన ఎక్స్ట్రా టైమ్‌లోనూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేల్చాల్సి వచ్చింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫెనాల్టీ షూట్ట్లో ఇటలీ 4-2 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఇక రెండో సెమీస్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 12.30 గంటలకు ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య జరగనుంది. బ్రెజిల్ 21వసారి ఫైనల్లోకి... రియో డి జనీరో: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బ్రెజిల్ జట్టు 21వసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. పెరూ జట్టుతో జరిగిన తొలి సెమీఫైనల్లో బ్రెజిల్ 1–0తో నెగ్గింది. ఆట 34వ నిమిషంలో నేమార్ అందించిన పాస్‌ను లుకాస్ పక్వెటా గోల్ పోస్ట్‌లోనికి పంపించాడు. అర్జెంటీనా, కొలంబియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బ్రెజిల్ తలపడుతుంది. వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ టోర్నీలో బ్రెజిల్ తొమ్మిదిసార్లు విజేతగా, 11 సార్లు రన్నరప్‌గా నిలిచింది. -
ఏం యాక్టింగ్‌రా బాబు; నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు
యూరోకప్ 2020 చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఇటలీ, బెల్జియం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీ జట్టు స్ట్రైకర్ సిరో ఇమ్మొబైల్ చేసిన పని అభిమానులను ఆశ్చర్యం కలిగించింది. ఆట 31వ నిమిషంలో ఇమ్మొబైల్ తనకు బంతిని పాస్ చేయాలని మిడ్ ఫీల్డర్‌కు సైన్ ఇచ్చాడు. బంతి తన వద్దకు చేరడంతో ఇమ్మొబైల్ గోల్ కొట్టేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో బెల్జియం డిఫెండర్ బంతిని తన్నే ప్రయత్నంలో ఇమ్మొబైల్ కాలికి తగిలింది. దాంతో అతను కింద పడిపోయి నొప్పితో విలవిలలాడాడు. అయితే ఉద్దేశపూర్వకంగా ఇది జరగకపోవడంతో మ్యాచ్ రిఫరీ దీన్ని పట్టించుకోలేదు. అయితే ఆ వెంటనే ఇటలీ మిడ్‌ఫీల్డర్ నికోలో బారెల్లా గోల్‌తో మెరిశాడు. దీంతో హాఫ్‌టైమ్ ముగిసేలోపే ఇటలీ భోణీ కొట్టడంతో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. అప్పటివరకు నొప్పితో విలవిలలాడుతున్నట్లు కనిపించిన ఇమ్మొబైల్ పైకిలేచి చిరునవ్వుతో జట్టు దగ్గరికి చేరుకొని చీర్ చెప్పాడు. ఇదంతా చూసిన అభిమానులు ఇమ్మొబైల్ చేసిన పనికి నోరెళ్లబెట్టారు. ' ఏం యాక్టింగ్‌రా బాబు.. నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు' అని కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇమ్మొబైల్ చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. '' రగ్బీ గేమ్ ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఇలాంటి ట్రిక్స్ నేర్పించి ఉంటారు. ఈ పనికి రగ్బీ వారికి ఎక్కువ మొత్తం చెల్లించాలి'' అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్‌లో బెల్జియంను 2-1 తేడాతో ఓడించిన ఇటలీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్ సాధించారు. కాగా సెమీస్ పోరులో ఇటలీ స్పెయిన్లు వెంబ్లే స్టేడియం(లండన్)లో తలపడనున్నాయి. 🚨⚽️ | NEW: Injured Italian player suddenly recovers when Italy scores #Euro2021 pic.twitter.com/bdEWYMCFAw — News For All (@NewsForAllUK) July 2, 2021 -
యూరో కప్ 2020: సెమీస్ పోరులో తలపడేది వీళ్లే!
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మూడు సార్లు చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్విట్జర్లాండ్‌పై గెలుపొందింది. ఆట 8వ నిమిషంలో డేనిస్ జకారియా సెల్ఫ్ గోల్‌తో స్పెయిన్‌కు గోల్ అందించాడు. 68వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ షాకిరి గోల్ చేయడంతో స్కోర్ 1–1తో సమమైంది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఇరు జట్లు కూడా ఒక్కో గోల్ సాధించడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్ (అదనపు సమయం)కు దారి తీసింది. 30 నిమిషాల అదనపు సమయంలో ఇరు జట్లు మరో గోల్ సాధించడంలో విఫలమవ్వడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక పెనాల్టీ షూటౌట్లో ఎటువంటి తడబాటుకు గురవని స్పెయిన్ విజేతగా నిలిచింది. మరో పోరులో బెల్జియం, ఇటలీ మధ్య జరిగిన క్వార్టర్ఫైనల్లో ఇటలీ పైచేయి సాధించింది. బెల్జియంను 2-1 తేడాతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్ సాధించారు. ఇక సెమీస్ పోరులో ఇటలీ స్పెయిన్లు వెంబ్లే స్టేడియం(లండన్)లో తలపడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు చెక్ రిపబ్లిక్ డెన్మార్క్‌లు తలపడనున్నాయి. చదవండి: ఆడకుంటే జీతం లేదు.. మెస్సీకి షాకిచ్చిన ఆ క్లబ్ -
Viral Video: గోల్ కీపర్ తడబాటు.. పాపం!
ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విజయం దక్కినప్పటికీ.. ఆ గోల్కీపర్కి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోల్ కీపర్ కంగారుతో .. ప్రత్యర్థి ఖాతాలో పాయింట్ జమ అయ్యింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్ ఆడియెన్స్‌లో టెన్షన్ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్పెయిన్, క్రోయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(స్పెయిన్ క్లబ్) మిడ్ ఫీల్డర్ పెడ్రి బంతిని పాస్ చేయగా.. అది గోల్‌కీపర్ ఉనయ్ సైమన్ ముందుకొచ్చింది. అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్ నెట్ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని .. అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు. ఇక ఆ తర్వాత మ్యాచ్ జరుగుతున్నంత సేపు సైమన్ ముఖంలో ఆందోళనతో నిండిపోయింది. చివరికి ఎక్స్ట్రా టైం కలిసి రావడంతో 5-3 తేడాతో స్పెయిన్.. క్రొయేషియాపై విజయం సాధించింది. ఇక ఆ సెల్ఫ్ గోల్ తర్వాత సైమన్ చాలాసేపు స్థిమితంగా ఉండలేకపోయాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇదే వెరైటీ గోల్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో.. అందుకు సంబంధించిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. Kepa watching from the bench as Unai Simon concedes from a 30 yard backpass#CROSPA #EURO2020 pic.twitter.com/XBDZq2DtRC — Kiran T-ierney (@mopeygooner) June 28, 2021 “Dubravka scored the most bizarre own goal you’ll see at #EURO2020” Unai Simon: #ESP pic.twitter.com/eYxQWAHMzB — SportPesa Kenya (@SportPesa) June 28, 2021 చదవండి: విజేత నుంచి అబద్ధాలకోరు.. తప్పక చదవాల్సిన కథ -
రొనాల్డో ఎఫెక్ట్: ఇకపై బాటిల్స్ ముట్టుకుంటే..
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కోకా కోలా బాటిల్ వ్యవహారం ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ రొనాల్డ్ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే రొనాల్డో చర్య తర్వాత మరికొందరు ఆటగాళ్లు.. అతన్నే అనుకరిస్తూ, అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఫుట్‌బాల్ అసోషియేషన్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ఆటగాళ్లు బాటిళ్లను జరపడం, పక్కనపెట్టడం చాలా చేష్టలకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కేవలం బాటిళ్లలోనే కాదు.. స్పానర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీల ప్రొడక్టుల విషయంలోనూ ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘టోర్నమెంట్ నిర్వాహణ కోసం ఆయా బ్రాండ్లతో ఒప్పందాలు జరిగాయని ఆటగాళ్లు గమనించాలి. వాళ్ల భాగస్వామ్యంతోనే యూరప్ దేశాల్లో ఫుట్‌బాల్ పురోగతికి కృషి జరుగుతోందని గుర్తించాలి’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యూఈఎఫ్ఏ. ఇక పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చర్యను పరోక్షంగా తప్పుబట్టిన టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కల్లెన్.. ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా చేసిన పనిని కూడా పరోక్షంగానే సమర్థించాడు. మత విశ్వాసానికి ముడిపడిన అంశం కావడంతో ఆ విషయంలో అతన్ని(పోగ్బా) తప్పుబట్టలేమని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు జరిమానా విధించే విషయంలో యూఈఎఫ్ఏ నేరుగా జోక్యం చేసుకోదని, ఆయా ఆటగాళ్ల ఫుట్‌బాల్ ఫెడరేషన్లే చూసుకుంటాయని మార్టిన్ స్పష్టం చేశాడు. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు-రొనాల్డో -
చాంపియన్స్ లీగ్ విజేత జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు
పోర్టో (పోర్చుగల్): ప్రతిష్టాత్మక యూరోపియన్ చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చెల్సీ క్లబ్ (ఇంగ్లండ్) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సెసర్ అప్లిక్వెటా కెప్టెన్సీలోని చెల్సీ క్లబ్ జట్టు 1–0తో మాంచెస్టర్ సిటీ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది. ఆట 42వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ ఏకైక గోల్ చేసి చెల్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజేత చెల్సీ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 167 కోట్లు)... రన్నరప్ మాంచెస్టర్ సిటీ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 132 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’
ఆమ్స్టర్డామ్: మహమ్మారి కరోనా కోరలు చాస్తున్న వేళ డచ్ లీగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్న ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్ణయం పట్ల ఏఎఫ్సీ అజాక్స్(ఆమ్స్టర్డామ్ ఫుట్‌బాల్ క్లబ్) టెక్నికల్ డైరెక్టర్ మార్క్ ఓవర్‌మార్స్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రాణాల కంటే ఆట ముఖ్యం కాదని... డబ్బే పరమావధిగా భావించడం సరికాదని హితవు పలికారు. యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ యూనియన్(యూఈఎఫ్ఏ)ఒత్తిడి మూలంగానే డచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్(కేఎన్‌వీబీ) ఈవిధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా ప్రాణాంతక కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ లీగ్‌ను నిలిపివేస్తూ తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం జూన్ నెల మూడోవారం నుంచి లీగ్ ప్రారంభించి.. ఆగస్టు 3నాటికి ముగించాలని కేఎన్‌వీబీ భావిస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మార్క్ ఓవర్‌మార్స్ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. కేఎన్‌వీబీ, యూఈఎఫ్ఏ తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో పోల్చారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ట్రంప్ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించి కాలాయాపన చేశారని.. ఇప్పుడు ఈ రెండు అసోసియేషన్లు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘ఈ సమయంలో ప్రజల జీవితాల కంటే డబ్బే ఎందుకు ముఖ్యమని భావిస్తున్నారు? కేఎన్‌వీబీకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు గురించి ఆలోచించకుండా యూఈఎఫ్ఏ చెప్పినట్లు నడుచుకుంటోంది. అసలు వాళ్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అదే విదంగా స్పెయిన్, ఇంగ్లండ్, ఇటలీ, జర్మనీ మాదిరి నెదర్లాండ్స్ టెలివిజన్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం గురించి ఆలోచించదు. ఇదంతా యూఈఎఫ్ఏ ఒత్తిడి కారణంగానే జరుగుతోంది. కరోనా నియంత్రణ కంటే ఆర్థిక వ్యవస్థే ముఖ్యమన్నట్లు ట్రంప్ భావించారు. నెదర్లాండ్స్‌లో కరోనాతో రోజుకు 100 మంది చనిపోతున్నారు. ఈ లీగ్‌ను చంపేయండి. ముగిసిందని ప్రకటించండి. జీవితాలే ముఖ్యమని గ్రహించండి’’ అని పేర్కొన్నారు. కాగా యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ గత సీజన్లో అజాక్స్ టీం ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
దీపికా పదుకునేకు అరుదైన అవకాశం
ముంబై: బాలీవుడ్ తార దీపికా పదుకునేకు అరుదైన అవకాశం దక్కింది. యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ ఫైనల్‌కు ఆమె హాజరుకానుంది. స్సెయిన్లోని లిస్బన్లో జరిగే శనివారం ఫైనల్ మ్యాచ్‌కు అతిథిగా ఆమెకు ఆహ్వానం అందింది. ఇది తనకు దక్కిన గౌరవమని, రెండు గొప్ప యూరోపియన్ ఫుట్‌బాల్ జట్ల మధ్య ఆట చూడడం చెప్పలేని అనుభూతి అని దీపిక పేర్కొంది. రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ జట్ల చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.