లండన్: ఆదివారం జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్‌పై ఇటలీ విజయం సాధించి విజేతగా నిలిచింది. లండన్‌లోని విఖ్యాత వెంబ్లీ స్టేడియంలో టైటిల్ పోరులో ఇంగ్లండ్, ఇటలీ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లండ్ ఆటగాడు ల్యూక్ షా 2వ నిమిషానికే గోల్ కొట్టడంతో ఆధిపత్యంలో కొనసాగింది. అయితే ఇటలీ ఆటగాడు లియోనార్డో బోనుసి 67వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు.
దీంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు 1-1తో నిలవగా.. అదనపు సమయంతో ఆటను పొడిగించారు. అయితే, అప్పుడు ఇరు జట్లు గోల్ చేయలేకపోయకపోవడంతో.. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఈ క్రమంలో... గోల్ కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకొని ఇటలీ గెలుపును ఖాయం చేశాడు. దీంతో 55 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌కు నిరాశే మిగిలింది. అంతకుముందు 1968లో ఇటలీ యూరో కప్ విజేతగా నిలిచింది.
Uefa Euro 2020: ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఇటలీ
Published Mon, Jul 12 2021 4:03 AM | Last Updated on Mon, Jul 12 2021 11:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment