Viral Video: గోల్‌ కీపర్‌ తడబాటు.. పాపం! | Spain Goal Keeper Unai Simon Self Goal Against Croatia In Euro 2020 Viral | Sakshi
Sakshi News home page

Euro 2020: గోల్‌ కీపర్‌ సెల్ఫ్‌ గోల్‌.. మీమ్స్‌తో ట్రోల్‌.. వైరల్‌

Published Tue, Jun 29 2021 8:31 AM | Last Updated on Tue, Jun 29 2021 10:17 AM

Spain Goal Keeper Unai Simon Self Goal Against Croatia In Euro 2020 Viral - Sakshi

ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో విజయం దక్కినప్పటికీ.. ఆ గోల్‌కీపర్‌కి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోల్‌ కీపర్‌ కంగారుతో ..  ప్రత్యర్థి ఖాతాలో పాయింట్‌ జమ అయ్యింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్‌ ఆడియెన్స్‌లో టెన్షన్‌ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.

స్పెయిన్‌, క్రోయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(​‍స్పెయిన్‌ క్లబ్‌) మిడ్‌ ఫీల్డర్‌ పెడ్రి బంతిని పాస్‌  చేయగా.. అది గోల్‌కీపర్‌ ఉనయ్‌ సైమన్‌ ముందుకొచ్చింది. అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్‌ నెట్‌ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని .. అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు.

ఇక ఆ తర్వాత మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు సైమన్‌ ముఖంలో ఆందోళనతో నిండిపోయింది. చివరికి ఎక్స్‌ట్రా టైం కలిసి రావడంతో 5-3 తేడాతో స్పెయిన్‌.. క్రొయేషియాపై విజయం సాధించింది. ఇక ఆ సెల్ఫ్‌ గోల్‌ తర్వాత సైమన్‌ చాలాసేపు స్థిమితంగా ఉండలేకపోయాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇదే వెరైటీ గోల్‌ అంటూ కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో.. అందుకు సంబంధించిన మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: విజేత నుంచి అబద్ధాలకోరు.. తప్పక చదవాల్సిన కథ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement