Self Goal
-
సూపర్ సీఎం సెల్ఫ్ గోల్స్.. టీడీపీ ఫుల్ హ్యాపీ!
రాజకీయాలలో ఓర్పు,నేర్పు అవసరం. వ్యూహం కూడా ముఖ్యమే. ఏపీలో జరుగుతున్న కూటమి రాజకీయాలను పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు అభాసుపాలు అవుతున్నారు. అది ఆయనకు అర్దం కావడం లేదేమో కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగానే అవగతమవుతోంది. రాజకీయాలలో కలిసి ఉంటూనే బోల్తా కొట్టించడం ఒక ప్లాన్ గా ఉంటుంది.ఈపాటికే పవన్ కళ్యాణ్ కు ఆ విషయం బోధపడవలసి ఉంది.కాని అలా జరగడం లేదు. దానికి కారణం.... ఆయనకు అనూహ్యమైన రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ,దానిని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండడం ఒకటైతే.. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో తొందరపడుతున్న వైనం మరో కారణంగా కనిపిస్తుంది. రాజకీయాలలో ఎల్లకాలం అబద్దాలు ఆడితే అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు!. ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శైలి అలవరచుకుని నిత్యం అబద్దాలు చెప్పడం ద్వారా ప్రజలలో పలుకుబడి పెంచుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. జనంలో అవసరం ఉన్నా,లేకపోయినా తిరుగుతూ తానేదో సూపర్ సీఎంనని అనుకుంటే అది అంత తెలివైన పని కాదని ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆ క్రమంలో పవన్ ఇటీవల పలు ఘట్టాలలో చేసిన ప్రకటనలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయనే చెప్పాలి.రాజమండ్రి వద్ద గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన ప్రసంగం చాలా అభ్యంతరకరంగా ఉంది. యువకులకు మంచి మాటలు చెప్పవలసిన బాధ్యతలో ఉన్న పవన్.. అల్లరి ,చిల్లర పనులు చేయండని సలహా ఇవ్వడం పై విమర్శలు తలెత్తాయి.యువకులకు ఉద్యోగాలు రావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ,ఇలాంటి సినిమా ఉత్సవాలలో పాల్గొనాలని, సినిమాలు చూస్తూ చొక్కాలు చించుకోవాలని, స్టంట్ లు నేర్చుకోవాలని, మోటారు సైకిళ్ల సైలెన్సర్ లు తొలగించి విపరీతమైన ధ్వని సృష్టిస్తూ గోల చేయాలని చెప్పడం చూస్తే పవన్ కు అసలు మెచ్యూరిటీ ఉందా అన్న సందేహం కలుగుతుంది.ఒక వైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువత,పేద వర్గాలు మంచి విద్య అభ్యసించాలని, చదువే సంపద అని హితబోధ చేస్తూ వచ్చారు. కానీ, పవన్ మాత్రం అల్లరి చేయండని చెబుతున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.గేమ్ చేంజర్ సినిమా కార్యక్రమానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడం విషాదం. ఇందుకు ఎవరైనా బాధ పడతారు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తప్పు చేసినట్లు చెప్పరు. కాని హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఉదంతంలో ఆయనకు బంధువు, మరో నటుడు అయిన అల్లు అర్జున్ పట్ల వ్యవహరించిన తీరు .. చేసిన వ్యాఖ్యలు మెడకు చుట్టుకున్నాయి. అల్లు అర్జున్ కు తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా తెలంగాణ పోలీసులు కేసు పట్టారని సినిమా ప్రముఖులంతా భావించి ఆయనను పరామర్శించారు. చివరికి ఆయన పార్టనర్ చంద్రబాబు కూడా ఫోన్ చేసి పలకరించారు. కానీ, ఫోన్ పలకరింపు కూడా చేయలేదు పవన్?!.పైగా..రేవంత్ కు మద్దతుగా ప్రసంగించారు.అల్లు అర్జున్ మానవత్వంతో వ్యవహరించలేదని అనుచిత వ్యాఖ్య చేశారు.తొక్కిసలాట లో మరణించిన రేవతి కుటుంబానికి సుమారు రెండు కోట్ల మేర వివిధ రూపాలలో సాయం అందింది. అయినా రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి అనేట్లు పవన్ కామెంట్లు చేశారు.పోనీ అదే సమయంలో బెనిఫిట్ షో లు, టిక్కెట్ల దరలు పెంచుకోవడానికి , తొక్కిసలాటకు ఏమి సంబంధం అని పవన్ ప్రశ్నించలేదు.సినిమా టిక్కెట్ల రేట్లతో ప్రభుత్వానికి ఏమి సంబంధం అని గతంలో జగన్ ప్రభుత్వంపై పెద్దపెట్టున అరచిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో మాత్రం ధైర్యం చేయలేకపోయారు. రాజమండ్రి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు, మెగా కుటుంబ వీరాభిమానులు మరణిస్తే జనసేన తరపున చెరో ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.ఇది మానవత్వమేనా? అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. పవన్ కళ్యాణ్ కాని, రామ్ చరణ్ తేజ కాని, గేమ్ చేంజర్ సినిమా బృందం కాని ఎవరూ బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదన్న ప్రశ్నకు జవాబు దొరకదు.అర్జున్ విషయంలో ఒక నీతి, తన వరకు వచ్చేసరికి మరో రీతా అనే విమర్శ వచ్చింది.పైగా జగన్ టైమ్ లో రోడ్డు బాగు చేయలేదు కనుక ప్రమాదం జరిగిందని దిక్కుమాలిన ఆరోపణ చేశారు.తీరా చూస్తే ఆయన అబద్దం ఆడారని తేలిపోయింది. ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై ఎక్కడా ఒక్కగొయ్యి కూడా లేదు.అయినా ప్రమాదం జరిగింది. తమ అభిమానులు మరణించిన విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం పవన్ ఈ ప్రయత్నం చేశారని అనుకోవాలి.మరణించిన యువకుల కుటుంబ సభ్యులు రోదిస్తూ మెగా కుటుంబం పట్ల వారికి ఎంత అభిమానమో వివరించారు. ఈ సినిమా పిచ్చి తోనే వారు మరణించారని వాపోయారు. దాని గురించి పవన్ నోరెత్తడం లేదు. రోడ్డు బాగోలేదని చెబుతున్నారు. నిజానికి ఆ ఏడీబీ రోడ్డు దశాబ్దాల తరబడి రకరకాల సమస్యలను ఎదుర్కుంటోంది. దాంతో రోడ్డు పాడవుతోంది. అయినా తాము రాగానే అన్నీ చేసేస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఈ ఏడు నెలలు ఏమి చేసినట్లు అన్న ప్రశ్న కూడా వస్తుంది.తాజాగా కూటమి ఎమ్మెల్యే ఒకరు తనకు కమిషన్ ఇవ్వకుండా మెటల్ గ్రావెల్ తొలనివ్వడం లేదని ఆరోపణ వచ్చింది.ఇలా ఏది పడితే అది మాట్లాడితే పవన్ కు ఏమి ఉపయోగం?. అది టీడీపీకే ప్రయోజనం అవుతుంది. పవన్‌కు సీఎం అవ్వాలనే కోరిక ఉన్నా, ఆయన తీరు ఆ స్థాయిలో లేదని , లోకేష్ సీఎం అయితేనే బెటర్ అని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తాయి.నిజానికి అబద్దాలు చెప్పడం పవన్‌కు కొత్త కాదు.ఆయన ఈ విషయంలో చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.కాని అబద్దాలు ఆడడంలో చాకచక్యం కూడా అవసరమే అని అంటారు. అందులో చంద్రబాబు సిద్దహస్తులనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలియక చంద్రబాబు చెప్పినట్లే చెబుతూ, ఆయన చేసినట్లే చేస్తూ పవన్ పరువు పోగొట్టుకుంటున్నారు. గతంలో పవన్ ఏపీఅంతటా 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ తప్పుడు ఆరోపణ చేసి.. దానికి వలంటీర్లను బాధ్యులు చేసి అప్రతిష్ట మూట కట్టుకున్నారు.చంద్రబాబుతో పాటు అనేక వాగ్దానాలను చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా ఇప్పుడు ప్రజలు భావించే పరిస్తితి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయంటూ ,హోం మంత్రి బాధ్యతలు చేపడతానంటూ వ్యాఖ్యానించి , ఆ తర్వాత జారిపోయి,దానిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సూచించినట్లు సోషల్ మీడియాపై దాడి చేశారు. ఆ విషయం జనానికి అర్ధం అయింది.పవన్ తాను ఎక్కడకు వెళితే అక్కడే పుట్టానని చెప్పడం,చదువుపై ఒక్కోసారి ఒకరకంగా మాట్లాడడం వంటివాటిని ఆయన అభిమానులు కూడా సరిపెట్టుకున్నారు.కాని అధికారం వచ్చిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. అది చంద్రబాబు మెప్పుదల కోసమో లేక, తాను సూపర్ సీఎం అని పరోక్షంగా ప్రజలు అనుకోవాలన్న లక్ష్యంతోనో ఇలా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు👉 తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అసత్య ఆరోపణ చేశారు. వెంటనే పవన్ సనాతని అవతారం ఎత్తి అంతకన్నా గట్టిగా ప్రచారం చేసి బోల్తా పడ్డారు.👉తన పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన రేప్ బాధితులను ,జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ-ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలకు గురైన బాధితులను పరామర్శించకుండా.. కడపలో జరిగిన ఒక చిన్న ఘటనపై ఆవేశంగా స్పందిస్తూ అక్కడకు వెళ్లిన తీరుతో అపహాస్యం పాలయ్యారు.👉 వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కంపెనీ భూముల వద్దకు అవసరం లేకపోయినా సందర్శించి ఏదో చేయాలని అనుకున్నారు. కాని అధికారులు అక్కడ ఏమీ లేదని చెప్పడంతో తుస్సుమన్నారు.👉కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లి తనకు అధికారం లేకపోయినా ‘‘సీజ్ ద షిప్’’ అంటూ ఆదేశించి ఈయనేం ఉప ముఖ్యమంత్రి? అని అధికారులు తల పట్టుకునేలా చేసుకున్నారు.ఇవన్నీ చూస్తే తాను లోకేష్ కన్నా సమర్ధుడనని, అన్ని వ్యవహారాలలో తను జోక్యం చేసుకోగలనని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నట్లుగా ఉంది. బీజేపీతో కలిసి భవిష్యత్తులో వేరు కుంపటి పెట్టవచ్చని పవన్ పై ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాయడం ఆరంభించింది. పవన్ వేస్తున్న తప్పటడుగులతో జనసేన కార్యకర్తలు నెత్తి,నోరు కొట్టుకుంటుంటే.. టీడీపీ నేతలు, శ్రేణులు మాత్రం లోలోపల సంతోషిస్తున్నాయి. ఇలాంటి పిచ్చి చేష్టలు, ప్రకటనల ద్వారా పవన్ కల్యాణ్ భ్రష్టు పడితే అది తమకే మరింత ఉపయోగమన్నది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పైకి ఏదో పవన్ కు బాగా మర్యాద ఇస్తున్నట్లు కనిపిస్తూ.. మరోవైపు ఆయా సందర్భాలలో పవన్ సెల్ఫ్ గోల్ వేసుకునేలా టిడిపి నాయకత్వం ,ముఖ్యంగా లోకేష్ అనుచర వర్గం ప్రయత్నిస్తున్నట్లు కొందరి భావనగా ఉంది. ఎందుకంటే లోకేష్ సీఎం కాకుండా పవన్ అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడడమే!.ఈ టరమ్ మాత్రమే కాకుండా ఆ పై పదేళ్లు కూడా చంద్రబాబు సీఎంగా ఉండాలని చెప్పి సంతోషపెడుతున్నానని పవన్ భావిస్తుండవచ్చు.కాని ఇది లోకేష్ కు మంట పుట్టించే అంశమే అవుతుంది. వైఎస్సార్సీపీ చేసే విమర్శల వల్ల జరిగే నష్టం కన్నా.. టీడీపీ నేతలు అమలు చేసే వ్యూహాల వల్లే పవన్ కు అధికనష్టం కలుగుతోంది. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకు సరెండర్ అయినట్లు కాకుండా.. తనకంటూ ఒక మంచి టీమ్ ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. సరైన రీతిలో రాజకీయం చేయకపోతే నష్టపోయేది పవనే అవుతారు. ఏపీలో గత ఏడు నెలల పరిస్థితులు చూస్తే.. ఏదో రకంగా వచ్చిన రాజకీయవకాశాన్ని పవన్ తనకు తాను చేజార్చుకుంటున్నారన్న భావన ఏర్పడుతోంది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రాహుల్ గాంధీ తన వేలితో తన కంటినే పొడుచుకున్నారా?
భారతదేశంలో 1980లో దళితులు ఎదుర్కొన్న పరిస్థితులను ఇప్పుడు ముస్లింలు ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ‘మోహబ్బత్ కీ దుకాన్’ పేరుతో జరిగిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1980లో దళితులు ఎంతటి దీనావస్థలో ఉండేవారో ఇప్పుడు ముస్లింలు అదే దీనావస్థలో ఉన్నారని అన్నారు. కానీ 80వ దశకంలో అధికారంలో ఉంది తన నాయనమ్మ ఇందిరా గాంధీ, ఆమె తర్వాత తన తండ్రి రాజీవ్ గాంధీనే. ఈ విషయాన్ని మరచి రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు బూస్టింగ్ ఇచ్చినట్లయింది. రాహుల్ గాంధీ ఏమన్నారంటే.. ఈరోజు భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వారి పరిస్థితి దయనీయం. ఇదే పరిస్థితిని సిక్కులు, క్రైస్తవులు,దళితులు, గిరిజనులు కూడా ఎదుర్కొంటున్నారు. చాలాకాలం క్రితం 1980ల్లో యూపీ వంటి రాష్ట్రాలకు వెళ్లి చూస్తే ఆనాడు దళితులు ఇటువంటి విపరీతమైన పరిస్థితులనే ఎదుర్కొనేవారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో సామరస్యం నెలకొల్పాలంటే అది ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. ప్రజల్లో వారు నింపిన ద్వేషపూరితమైన స్వభావాన్ని నిర్మూలించాలంటే ఒక్కటే మార్గం.. ప్రేమ. ద్వేషాన్ని ఎన్నటికీ ద్వేషంతో దూరం చేయలేము. కేవలం ప్రేమతోనే అది సాధ్యమవుతుందని అన్నారు. లవ్ ఫార్ములా.. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ప్రేమతోనే మనుషుల మధ్య దూరాన్ని తగ్గించవచ్చన్న మంత్రాన్ని జపించారు. ఇదే సూత్రంతో కర్ణాటకలో కాంగ్రెస్ విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ పాచికపారడంతో గ్లోబల్‌గా ఇదే సిద్ధాంతానికి ప్రచారం కల్పిస్తున్నారు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే సాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్’ ను వేదికగా చేసుకున్నారు రాహుల్ గాంధీ. లవ్ ని ప్రమోట్ చేయడం వరకు అంతా బాగానే ఉంది కానీ పీరియాడిక్ పోలికతో రాహుల్ సెల్ఫ్ గోల్ వేసుకోవడమే కాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడటం లేదు. అసలే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ ఇలాంటి వాక్కు దోషాలు చేస్తే బీజేపీ వాటిని గెలుపుకి సాధనాలుగా వాడుకున్నా వాడుకుంటుంది. చదవండి : మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్ -
FIFA WC: సెల్ఫ్ గోల్ ఆటగాడి ప్రాణం తీసింది..
ఫుట్‌బాల్‌లో సెల్ఫ్ గోల్ అంటే సొంతజట్టు గోల్బాక్స్లో కొట్టడం. ఇలా చేస్తే ప్రత్యర్థి జట్టు ఖాతాలోకి గోల్ వెళ్లిపోతుంది. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. అయితే అదే సెల్ఫ్ గోల్ ఒక ఫుట్‌బాల్ ఆటగాడి ప్రాణం తీసిందంటే నమ్ముతారా. కానీ నమ్మి తీరాల్సిందే. విషయంలోకి వెళితే.. 1994 ఫిఫా వరల్డ్‌కప్‌లో కొలంబియా తన తొలి మ్యాచ్‌లో రొమేనియాతో తలపడింది. ఆ మ్యాచ్‌లో కొలంబియా 1-3 తేడాతో రొమేనియా చేతిలో ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్ అమెరికాతో జరిగింది. నాకౌట్ దశ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిందే. కొన్ని కారణాల రిత్యా జట్టులో కీలక ఆటగాడైన గాబ్రియెల్ గోమెజ్‌ను ఆఖరి నిమిషంలో జట్టు నుంచి తప్పించారు. కీలక ఆటగాడు లేకుండానే బరిలోకి దిగిన కొలంబియా తొలి అర్థగంట మంచి ఆటను ప్రదర్శించింది. అయితే ఆట 35వ నిమిషంలో కొలంబియా ఆటగాడు ఎస్కోబార్ పెద్ద తప్పిదం చేశాడు. అమెరికా ఆటగాడు హర్కీస్ బంతిని కొలంబియా గోల్‌పోస్టు సమీపంలో ఉన్న స్టెవార్ట్ దిశగా కొట్టాడు. కానీ ఆండ్రెస్ ఎస్కోబార్ స్టెవార్ట్కు బంతిని అందకుండా చేసే ప్రయత్నంలో అతడి కాలుకి తాకిన బంతి అనూహ్యంగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఎస్కోబార్ సెల్ఫ్‌గోల్ కారణంగా అమెరికాకు 1-0 ఆధిక్యం లభించింది. ఇది కొలంబియాకు పెద్ద షాక్. ఆ తర్వాత ఆట 52వ నిమిషంలో యూఎస్ఏ ప్లేయర్ స్టెవార్ట్ మరో గోల్ కొట్టడంతో అమెరికా 2-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట చివర్లో కొలంబియా ఆటగాడు వాల్సేనియా గోల్ చేసినప్పటికి లాభం లేకపోయింది. దీంతో కొలంబియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ తర్వాత స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ను కొలంబియా 2-0 తేడాతో ఓడించింది. కానీ అమెరికాతో మ్యాచ్‌లో ఓటమి కొలంబియాను ఇంటిబాట పట్టేలా చేసింది. దీనికి ప్రధాన కారణం ఎస్కోబార్ సెల్ఫ్‌గోల్ చేయడమే. అమెరికాతో మ్యాచ్‌లో ఎస్కోబార్ ఆ గోల్ చేయకపోయుంటే మ్యాచ్ డ్రా అయ్యి కొలంబియాకు నాకౌట్ చాన్సులు ఉండేవి. ఇక కొలంబియా గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో ఎస్కోబార్ స్వదేశానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి నైట్‌క్లబ్‌కు వెళ్లిన ఎస్కోబార్ అక్కడే చాలాసేపు గడిపాడు. ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి బయలుదేరిన ఎస్కోబార్‌తో కొందరు వ్యక్తులు గొడవకు దిగారు. ఆ తర్వాత తుపాకీ తీసి ఎస్కోబార్‌పై కాల్పులు జరిపారు. కాల్చిన ప్రతీసారి 'గో.. గో' అని అరిచారు. దక్షిణ అమెరికాలో ఆటగాళ్లు గోల్ చేసిన ప్రతీసారి అక్కడి వ్యాఖ్యతలు గో అనే అంటారు. అరగంట పాటు రోడ్డుపైనే రక్తపు మడుగులో పడి ఉన్న ఎస్కోబార్‌ను కొందరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలా ఒక సెల్ఫ్ గోల్ ఒక ఫుట్‌బాల్ ఆటగాడి ప్రాణం పోవడానికి కారణమైంది. ఆ మరునాడు ఎస్కోబార్ అంతిమయాత్రలో దాదాపు లక్షా 20వేల మంది పాల్గొన్నట్లు అంచనా. -
41 సొంత గోల్స్.. ఫుట్‌బాల్ క్లబ్‌పై జీవితకాల నిషేధం
41 సొంత గోల్స్ కొట్టి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఒక ఫుట్‌బాల్ క్లబ్‌పై జీవితకాల నిషేధం పడింది. ఆ క్లబ్లో ఉన్న నాలుగు టీమ్‌లకు ఈ నిషేధం వర్తించనుంది. వాస్తవానికి ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పొరపాటున సొంత గోల్ చేయడం సహజమే. ఒక్కోసారి ఫన్నీగానూ ఇలాంటి సొంత గోల్స్ నమోదవుతాయి. ఒకటి.. రెండు అంటే పర్వాలేదు గానీ.. అదే పనిగా సొంత గోల్‌పోస్ట్‌పై దాడి చేయడం మ్యాచ్ ఫిక్సింగ్ కిందకు వస్తుంది. దీంతో ఆయా జట్టుపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా సౌతాఫ్రికా ఫుట్‌బాల్ క్లబ్ సామీ మైటీబర్డ్స్ విషయంలో అదే జరిగింది. మతియాసితో జరిగిన మ్యాచ్‌లో సామీ మైటీబర్డ్స్ 59-1 రికార్డు గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఇందులో 41 గోల్స్ సామీ మైటీబర్డ్స్ సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. నిబంధనల ప్రకారం సెల్ఫ్ గోల్ చేసే అది ప్రత్యర్థి ఖాతాలోకి వెళుతుంది. ఈ నేపథ్యంలో సామీ మైటీబర్డ్స్ జట్టులో ప్లేయర్ నెం-2 10 గోల్స్, ప్లేయర్ నెంబర్-5 20 గోల్స్, మరొక ప్లేయర్ 11 గోల్స్.. సెల్ఫ్ గోల్స్ కొట్టినట్లు మ్యాచ్ రిఫరీ వెల్లడించాడు. దీంతో ఉద్దేశ పూర్వకంగానే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో సౌతాఫ్రికా లోయర్ డివిజన్లోని నాలుగు క్లబ్స్పై జీవితకాలం నిషేధం పడింది. South African lower division side Matiyasi FC 🇿🇦 have been BANNED for life after beating Nsami Mighty Birds 59-1, with 41 of the goals scored as own-goals. Matiyasi were vying for promotion to the Provincial ABC Motsepe League. pic.twitter.com/6D59M0dmy0 — Nuhu Adams ™️ (@NuhuAdams_) June 1, 2022 చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్ -
ప్రతిపక్షాలది ‘సెల్ఫ్ గోల్’ : ప్రధాని మోదీ
లక్నో: ప్రజాసంక్షేమమే పరమావధిగా కొనసాగే పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ విపక్షాలు ‘సెల్ఫ్ గోల్’ చేసుకుంటున్నాయని ప్రధాని మోదీ విపక్షాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒకవైపు, పలు రంగాల్లో విజయపరంపరలో ‘గోల్’ తర్వాత గోల్ కొడుతూ దేశం ముందుకు సాగుతుంటే, మరో పక్క స్వీయ ప్రయోజనాలు చూసుకుని విపక్షాలు ‘సెల్ఫ్ గోల్స్’ చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్న సందర్భంగా గురువారం కేంద్రప్రభుత్వ ఆహార భద్రతా పథకం లబ్దిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది అయోధ్య రామమందిరం కోసం ‘భూమి పూజ’ కార్యక్రమాన్నీ ఘనంగా చేసుకున్నాం. ఈసారి ప్రఖ్యాత ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు విజయకేతనం ఎగరేసింది. 50 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయ పెరుగుదల, విక్రాంత్ యుద్ధవిమాన వాహక నౌక తయారీ.. ఇలా దేశం ఎంతగా పురోగతిని కోరుకుంటోంది.. ఎంతటి ఘన విజయాలను సాధిస్తోంది. ఎంతగా దేశం పురోగమిస్తుందనేవి ఏవీ విపక్షాలకు పట్టవు. స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా పెగసస్ అంశంపై పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి ’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీ సీఎంను ఉద్దేశిస్తూ.. ‘ ఆయన సీఎం యోగి మాత్రమే కాదు. కర్మయోగి’ అని కొనియాడారు. మానవాళికి సవాలుగా పరిణమించిన మహా విపత్తును ఎలా ఎదుర్కోవాలా అని ప్రతీ పౌరుడు శ్రమిస్తుంటే.. వీరు( విపక్ష సభ్యులు) జాతి ప్రయోజనాలకోసం చట్టాలు చేసే పార్లమెంట్ సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ వీరు దేశ ప్రగతిని ఆపే పనిలో ఉన్నారు. కానీ 130 కోట్ల భారతీయులు దేశం ముందుకు సాగడం కోసం పాటుపడుతున్నారు. భారత్ ముందడుగు వేస్తోంది(భారత్ చల్ పఢా హై)’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ దేశ ప్రగతి పథం ఢిల్లీకి యూపీ మీదుగా వెళ్తోంది. యూపీని వాడుకుని కొన్ని ‘కుటుంబాలు’ మాత్రమే బాగుపడ్డాయి. ఆ కుటుంబాల వారు యూపీ అభివృద్ధికి చేసింది శూన్యం ’ అని మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. -
Viral Video: గోల్ కీపర్ తడబాటు.. పాపం!
ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విజయం దక్కినప్పటికీ.. ఆ గోల్కీపర్కి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోల్ కీపర్ కంగారుతో .. ప్రత్యర్థి ఖాతాలో పాయింట్ జమ అయ్యింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్ ఆడియెన్స్‌లో టెన్షన్ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్పెయిన్, క్రోయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(స్పెయిన్ క్లబ్) మిడ్ ఫీల్డర్ పెడ్రి బంతిని పాస్ చేయగా.. అది గోల్‌కీపర్ ఉనయ్ సైమన్ ముందుకొచ్చింది. అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్ నెట్ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని .. అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు. ఇక ఆ తర్వాత మ్యాచ్ జరుగుతున్నంత సేపు సైమన్ ముఖంలో ఆందోళనతో నిండిపోయింది. చివరికి ఎక్స్ట్రా టైం కలిసి రావడంతో 5-3 తేడాతో స్పెయిన్.. క్రొయేషియాపై విజయం సాధించింది. ఇక ఆ సెల్ఫ్ గోల్ తర్వాత సైమన్ చాలాసేపు స్థిమితంగా ఉండలేకపోయాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇదే వెరైటీ గోల్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో.. అందుకు సంబంధించిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. Kepa watching from the bench as Unai Simon concedes from a 30 yard backpass#CROSPA #EURO2020 pic.twitter.com/XBDZq2DtRC — Kiran T-ierney (@mopeygooner) June 28, 2021 “Dubravka scored the most bizarre own goal you’ll see at #EURO2020” Unai Simon: #ESP pic.twitter.com/eYxQWAHMzB — SportPesa Kenya (@SportPesa) June 28, 2021 చదవండి: విజేత నుంచి అబద్ధాలకోరు.. తప్పక చదవాల్సిన కథ -
జర్మనీ ‘సెల్ఫ్ గోల్’
మ్యూనిక్: సొంత ప్రేక్షకుల మధ్య మాజీ చాంపియన్ జర్మనీకి చుక్కెదురైంది. సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థి ఫ్రాన్స్‌ను గెలిపించింది. యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 0–1 తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. ఆట 20వ నిమిషంలో జర్మనీ ‘డి’ బాక్స్‌కు కొన్ని అడుగుల దూరం నుంచి ఫ్రాన్స్ ఆటగాడు పోగ్బా ప్రత్యర్థి డిఫెండర్లపై నుంచి తన టీమ్ ప్లేయర్ లుకాస్ హెర్నాండెజ్‌కు చక్కటి పాస్‌తో బంతిని అందించాడు. బంతిని అందుకున్న లుకాస్ గోల్ పోస్ట్‌కు ఎదురుగా ఉన్న ఎంబాపేకు పాస్ చేశాడు. అయితే బంతి ఎంబాపేకు దొరక్కుండా క్లియర్ చేయాలనుకున్న జర్మనీ డిఫెండర్ హముల్స్ అనుకోకుండా తన గోల్ పోస్ట్లోకే బాల్‌ను కొట్టి సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత బంతిని ఎక్కువ సేపు తమ నియంత్రణలోనే ఉంచుకుంటూ గోల్ కోసం జర్మనీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రష్యా 1–0తో ఫిన్లాండ్పై గెలుపొందింది. రష్యా ప్లేయర్ అలెక్సీ మిరాన్చుక్ (45+2వ నిమిషంలో) గోల్ చేశాడు. గ్రూప్ ‘ఎ’లో జరిగిన మరో మ్యాచ్‌లో వేల్స్ 2–0తో టర్కీపై గెలుపొందింది. వేల్స్ తరఫున రామ్సీ (42వ నిమిషంలో), రాబర్ట్స్ (90+5వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. -
రాజస్తాన్‌లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్
విస్తరణవాద పాలక బీజేపీకి వ్యతిరేకంగా అస్తిత్వ పోరా టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి–రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కూ, అతని డిప్యూటీ సచిన్ పైలట్‌కూ మధ్య వైరం దాపురించాల్సిన సమయం అయితే కాదు. కొద్ది వారాల క్రితమే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ విధేయుడు, జనాకర్షణ కలిగిన నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుచేసి బీజేపీలో చేరి, తనకు విధేయులైన ఎమ్మెల్యేల సహాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేశారు.రాజస్తాన్‌లో ఆయన మిత్రుడు, చిరకాల పార్టీ సహచరుడు సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటాను లేవనెత్తి, 19 మంది దాకా సహచర ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ పాలనలో ఉన్న హరియాణాలోని ఒక హోటల్లో ఉంచారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్‌గా, ఉప ముఖ్యమంత్రిగా అధికార పదవులు నిర్వహించిన ఈ వారసత్వ నాయకుడు కూడా గెహ్లోత్ ప్రభుత్వాన్ని దించడానికి బీజేపీ సహాయాన్ని తీసుకోవటానికి విముఖత చూపబోరని తెలుస్తోంది. గోవా, మణిపూర్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రజాదరణ పొంది ఓట్లు, సీట్లు గెలిచిన తరువాత కూడా ఆయా రాష్ట్రాలను బీజేపీకి కోల్పోయిన కాంగ్రెస్, ఇప్పుడు రాజస్తాన్‌ను కూడా చేజార్చుకునే పరిస్థితిలో ఉంది. ఇది రెండు నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగానే జరిగివుండేది కానీ, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అప్రమత్తత వలన, ఆయనకున్న ప్రాంతీయ రాజకీయ బలం వలన ఆ ప్రమాదం తప్పిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ, జాతీయ నాయకత్వపు పరస్పర విరుద్ధమైన దృక్పథంతో నడిచే సంఘటనలు ఇలా మలుపు తిరగటం దీర్ఘకాలంగా పరిస్థితులను గమనిస్తోన్న కాంగ్రెస్ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించలేదు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే, కాంగ్రెస్ నాయకత్వానికి తన ప్రతిభను కలిపివుంచడానికి ఏదైనా వ్యూహం ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యప్రదేశ్‌లో, నెలల తరబడి సంకేతాలు అందుతూవున్నప్పటికీ, దాని అత్యంత ప్రజాకర్షణ కలిగిన జ్యోతిరాదిత్య సింధియా నుండి సూచనలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ సింధియా ఎప్పటికీ బీజేపీతో చేతులు కలపగలరని నమ్మలేదు. తననెంత ఊపిరాడకుండా చేసి, పక్కకు నెట్టివేశారో సింధియా కాంగ్రెస్ నాయకత్వానికి తెలిసేలా చేశారు. అప్రమత్తమైన బీజేపీ ఈ పగుళ్లను మరింత పెద్దవి చేసి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. రాజస్తాన్‌లో కూడా ఇదే విధమైన అవకాశాన్ని పళ్ళెంలో పెట్టి మరీ బీజేపీకి అందించింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చేదు సంఘటనలను గమనిస్తే ఇలాంటిదేదో జరుగబోతోందని తెలుస్తూనే వుంది. తన డిప్యూటీ ఇలాంటి మురికిచర్యకు పాల్పడతాడని తానెప్పుడో అనుమానించినా, దాన్ని ఎప్పుడూ బహిరంగపరచలేదని ఇప్పుడు గెహ్లోత్ అంటున్నారు. 2018లో ప్రభుత్వం ఏర్పడేనాటికే వీరిద్దరి మధ్యా కనీసం మాట్లాడుకునేపాటి సంబంధాలు కూడా లేవు. ఇప్పుడు యుద్ధం బట్టబయలుగానే ఉంది. పైలట్, బీజేపీలపై అందరినీ దిగ్భ్రాంతిపరిచే భాషలో గెహ్లోత్ మెరుపుదాడి చేశారు. వాస్తవానికి, ప్రభుత్వాన్ని కాపాడటానికి గెహ్లోత్ ముందుండి పోరాడుతున్నారు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, పైలట్‌తో సున్నితంగా వ్యవహరించాలనే కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలను కూడా ఆయన విస్మరిస్తున్నారు. హైకమాండ్ ఇప్పటికీ పైలట్‌ను నిలుపుకోవాలనుకుంటోంది గానీ గెహ్లోత్ దాన్ని అంగీకరించే మానసిక స్థితిలో లేరు. అందువల్ల, పైలట్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం కష్టమయ్యేలా చేస్తున్నారు గెహ్లోత్. పార్టీ మీద హై కమాండ్ ప్రాబల్యం తగ్గిందేమోననే సంకేతాన్నిస్తున్నట్టుగా.. పైలట్ బీజేపీతో రాసుకుపూసుకు తిరిగాడనీ, అతడు ‘పనికిమాలినవాడ‘ని తనకెప్పుడో తెలుసుననీ చెలరేగిపోయారు. ఇప్పటికైతే గెహ్లోత్‌కు సంఖ్యాబలం ఉన్నట్టే కనబడుతోంది; విశ్వాస పరీక్షలో నెగ్గుతాననే నమ్మకమూ ఉన్నట్టుంది. పైలట్ మీద, ఇతర తిరుగుబాటుదారుల మీద అనర్హత వేటు వేసి, మ్యాజిక్ నంబ రును తగ్గించేదాకా ఆయన విశ్రమించరు. ఇప్పటికైతే తిరుగుబాటుదారులకు స్పీకర్ కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారు. వీటికి స్పందించే అనుకూల పరిస్థితి లేదని పైలట్ వాటిని సవాల్ చేస్తున్నారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు జూలై 24 వరకు వేచి చూడమని స్పీకర్‌ను కోరింది. పైలట్ పిటి షన్ మీద ఆరోజు ఆదేశం వెలువడే అవకాశం ఉంది. వ్యాసకర్త లక్ష్మణ వెంకట్ కూచి , సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : kvlakshman@gmail.com -
చంద్రబాబు మరోసారి సెల్ఫ్ గోల్
-
అడ్డంగా బుక్కైన టీడీపీ