మ్యూనిక్: సొంత ప్రేక్షకుల మధ్య మాజీ చాంపియన్ జర్మనీకి చుక్కెదురైంది. సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థి ఫ్రాన్స్‌ను గెలిపించింది. యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 0–1 తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. ఆట 20వ నిమిషంలో జర్మనీ ‘డి’ బాక్స్‌కు కొన్ని అడుగుల దూరం నుంచి ఫ్రాన్స్ ఆటగాడు పోగ్బా ప్రత్యర్థి డిఫెండర్లపై నుంచి తన టీమ్ ప్లేయర్ లుకాస్ హెర్నాండెజ్‌కు చక్కటి పాస్‌తో బంతిని అందించాడు.
బంతిని అందుకున్న లుకాస్ గోల్ పోస్ట్‌కు ఎదురుగా ఉన్న ఎంబాపేకు పాస్ చేశాడు. అయితే బంతి ఎంబాపేకు దొరక్కుండా క్లియర్ చేయాలనుకున్న జర్మనీ డిఫెండర్ హముల్స్ అనుకోకుండా తన గోల్ పోస్ట్‌లోకే బాల్‌ను కొట్టి సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత బంతిని ఎక్కువ సేపు తమ నియంత్రణలోనే ఉంచుకుంటూ గోల్ కోసం జర్మనీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రష్యా 1–0తో ఫిన్లాండ్‌పై గెలుపొందింది. రష్యా ప్లేయర్ అలెక్సీ మిరాన్‌చుక్ (45+2వ నిమిషంలో) గోల్ చేశాడు. గ్రూప్ ‘ఎ’లో జరిగిన మరో మ్యాచ్‌లో వేల్స్ 2–0తో టర్కీపై గెలుపొందింది. వేల్స్ తరఫున రామ్సీ (42వ నిమిషంలో), రాబర్ట్స్ (90+5వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment