Euro Championship
-
యూరో ఛాంపియన్స్‌కు గ్రాండ్ వెల్కమ్.. జనసంద్రంలా మారిన మాడ్రిడ్ (ఫొటోలు)
-
39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్
అండర్-21 యూరోపియన్ చాంపియన్‌షిప్ విజేతగా ఇంగ్లండ్ అవతరించింది. 1984 తర్వాత ఇంగ్లండ్ మళ్లీ చాంపియన్‌గా నిలవడం ఇదే. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్పెయిన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్ తరపున వచ్చిన ఏకైక గోల్ కర్టిస్ జోన్స్ ఆట 45+4వ నిమిషం(అదనపు)లో గోల్ అందించాడు. ఇక రెండో అర్థభాగంలో స్పెయిన్ అదే పనిగా గోల్ పోస్టులపై దాడులు చేసింది. అయితే ఇంగ్లండ్ గోల్‌కీపర్ జేమ్స్ ట్రాఫర్డ్ రెండుసార్లు స్పెయిన్ పెనాల్టీ కిక్‌లు గోల్ చేయకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో టోర్నీలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ యూరో అండర్-21 విజేతగా నిలవడం విశేషం. 🏴 Trafford at the death! 😱#LastMinuteMoments | #U21EURO | @Hublot pic.twitter.com/YJNCJBJyV5 — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 England's crowning moment 🏆🎉#U21EURO pic.twitter.com/DnsTcDdihc — #U21EURO (@UEFAUnder21) July 8, 2023 చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు! -
'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్
జార్జియాకు చెందిన అనస్తాసియా గుబనోవా యూరోపియన్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్(EURO 2023) విజేతగా నిలిచింది. అయితే ఆమె బ్లాక్బాస్టర్ సినిమా.. ఆస్కార్ విజేత స్లమ్‌డాగ్ మిలియనీర్ మ్యూజిక్‌తో దాదాపు నాలుగు నిమిషాల 30 సెకన్ల పాటు స్కేటింగ్ చేయడం విశేషం. మధ్యలో బాలీవుడ్ సినిమా గలియోంకీ రాస్లీలా రామ్లీలాలోని సూపర్‌హిట్ సాంగ్ డోల్ బాజే పాట కూడా వినిపించడం విశేషం. భారతీయ సంప్రదాయమైన చీరకట్టుతో అనస్తాసియా గుబనోవా స్కేటింగ్ చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక అనస్తాసియా గుబనోవా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే శనివారం జరిగిన యూరో స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో 199.1 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ అందుకుంది. ఇక బెల్జియంకు చెందిన లియోనా హెండ్రిక్స్ 193.2 పాయింట్లో రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కిమ్మి 192.5 పాయింట్లతో కాంస్యం సాధించింది. ⛸️Avrupa Artistik Patinaj Şampiyonası'nda kadınlarda altın madalya aşağıdaki enerjik ve harika serbest program performansıyla Anastasiia Gubanova'ya gitti. Kısa programı da zirvede tamamlayan Gubanova kariyerinin ilk Avrupa Şampiyonluğu'nu yaşadı. #EuroFigure pic.twitter.com/LlJCtc2SWu — Murat Taşkolu (@murattaskolu) January 28, 2023 చదవండి: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు కొట్టించుకుంది -
యూరోకప్ టోర్నమెంట్ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.10 కోట్లు
లండన్: సాధరణంగా చాలా వరకు భార్యాభర్తల్లో ఒకరికి నచ్చినది మరోకరికి నచ్చదు. చాలా మంది భర్తలు స్పోర్ట్స్ చానెల్ చూడ్డానికి ఇష్టపడతారు.. కానీ భార్యలకేమో ఎంటర్టైన్మెంట్ చానెల్స్ చూడాలని ఉంటుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయి. అది వేరే విషయం. కానీ ఇప్పుడు మీరు మేం చెప్పబోయే విషయం వింటే.. అబ్బా మాకు ఇలానే జరిగితే ఎంత బాగుటుంది.. అటు గొడవలు ఉండవు.. ఇటు డబ్బులు వస్తాయి అనుకుంటారు. ఇంతకు ఏంటా విషయం అంటే కొద్ది రోజుల క్రితం యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2020 జరిగిన సంగతి తెలిసిందే. ఇక మన దగ్గర క్రికెట్‌కు ఎంత క్రేజో.. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు అంతకు మించి అభిమానులున్నారు. ఈ క్రమంలో భర్త అస్తమానం ఫుట్‌బాల్ మ్యాచ్ పెడుతుండటంతో బోర్ కొట్టి ఓ మహిళ సరదాకు 1 మిలియన్ పౌండ్లు విలువ చేసే లాటరీ టికెట్ కొన్నది. అదృష్టం కొద్ది ఆమెనే లాటరీ వరించడంతో ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా గెలుచుకుంది. ఈ సంఘటన యూకేలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బేసింగ్స్టోక్కు చెందిన 33 ఏళ్ల సమంతా యంగ్ చార్టెడ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. ఇక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2020 ప్రారంభమైన నాటి నుంచి భర్త అస్తమానం ఫుట్‌బాల్ మ్యాచ్ పెడుతుండటంతో బోర్‌గా ఫీలయ్యేది. ఈ క్రమంలో జూలై 3న ఆమె టీవీలో మ్యాచ్ చూడటం ఇష్టం లేక ఆన్లైన్లో బ్రౌజ్ చేయసాగింది. దానిలో భాగంగా ఆమెకు ఓ కంపెనీ లాటరీ టికెట్ కంటపడింది. ఊరికే టైం పాస్‌కి 20 పౌండ్లు(2,067.69 రూపాయలు) చెల్లించి 1 మిలియన్ పౌండ్స్ (10,34,97,400 రూపాయలు)విలువ చేసే లాటరీ టికెట్ కొన్నది. కొద్ది రోజుల తర్వాత యంగ్‌కు ఓ ఈమెయిల్ వచ్చింది. ఆమె కొన్న లాటరీ టికెట్‌కే ప్రైజ్‌మనీ వచ్చిందని మెయిల్ సారాంశం. ఇది చూసి యంగ్ తనకు మహా అయితే 1,000 పౌండ్లు లాటరీ వచ్చాయేమో అని భావించింది. కానీ సరిగా చూస్తే.. దాని విలువ 1 మిలియన్ పౌండ్స్‌గా ఉంది. దాంతో భర్తను పిలిచి చూపించింది. అతడు కూడా తన భార్య కొన్న లాటరీ టికెట్‌కు 1 మిలియన్ పౌండ్స్ ప్రైజ్‌మనీ దక్కిందని తెలిపాడు. టైం పాస్ కాక కొన్న లాటరీ టికెట్‌కు ఇంత భారీ మొత్తం తగలడంతో యంగ్ దంపతులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తనకు వచ్చిన మొత్తంతో వారి కలల సౌధం, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు కొనడతో పాటు కుటుంబం కోసం కొంత పొదుపు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. -
Euro 2020: ఇంగ్లండ్‌కు తగిన శాస్తే జరిగిందా?
55 ఏళ్ల తర్వాత దక్కిన ఛాన్స్, ఐదేళ్ల క్రితం ప్రపంచ కప్ క్వాలిఫై కాకుండా పోయిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం.. ఈ రెండింటికీ ఒకేసారి సమాధానం, అదీ సొంతగడ్డపై చెప్పే వీలు దొరికింది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకి. అలాంటిది కాలిదాకా వచ్చిన అవకాశాన్ని.. చేజేతులారా పొగొట్టుకుంది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీం. యూరో 2020 ఫైనల్లో ఇటలీ చేతిలో అదీ షూట్అవుట్(మ్యాచ్ 1-1 డ్రా అయ్యింది) ఓటమి ద్వారా బాధాకరమైన నిట్టూర్పును విడిచింది. వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన Euro 2020 కప్ సందర్భంగా చర్చించుకోదగ్గ పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. ఐదు దశాబ్ధాల తర్వాత గెలుపు అంచుదాకా చేరిన సొంత జట్టును ప్రోత్సహించేందుకు రాజకుటుంబం సైతం వెంబ్లేకి కదిలింది. సెలబ్రిటీలు, సగటు సాకర్ అభిమానులంతా స్టేడియం బయట, లండన్ వీధుల్లో గుంపులుగా చేరారు. భారీ అంచనాల నడుమ జరిగిన మ్యాచ్ డ్రా కావడం, పెనాల్టీ షూట్అవుట్ వీరుడిగా పేరున్న బుకాయ సకా అతితెలివి ప్రదర్శించి చేయాలనుకున్న గోల్ సైతం మిస్ కావడం, వెరసి.. ఇంగ్లండ్ ఓటమి పాలవ్వడాన్ని ఇంగ్లీష్ సాకర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ 1996 వరల్డ్ కప్ తర్వాత ఒక మేజర్ టైటిల్ ఇంత చేరువలో రావడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అయితే అతి ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సాకర్ నిపుణులు. 2018 ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఫర్ఫార్మెన్స్ మెరుగైందనే అంచనాకి వచ్చేశారు. ఇక ఈ ఏడాది సొంతగడ్డ మీద వరుస విజయాలు.. యూరో 2020 ఫైనల్ దాకా చేరుకోవడంతో అభిమానుల్లోనే కాదు.. ఆటగాళ్లలోనూ ఆత్మ విశ్వాసం నింపింది. ఈ క్రమంలో ఇటలీని చాలా చిన్నచూపు చూసింది ఇంగ్లండ్. రాబర్టో మన్సినీ ఆధ్వర్యంలో వరుసగా 33 మ్యాచ్‌లు గెలిచి యూరప్‌లోనే బెస్ట్ టీంగా ఉన్న ఇటలీ బలాబలాలను తక్కువ అంచనా వేసి ఘోర తప్పిదం చేసింది. వెరసి బెస్ట్ ప్లేయర్లు ఉండి కూడా కప్ కొట్టలేకపోయింది ఇంగ్లండ్. అచ్చీరాని షూట్అవుట్లు ఇంగ్లండ్‌కు ఇలా షూట్అవుట్లతో ఝలక్‌లు తగలడం కొత్తేంకాదు. 1990, 1996, 1998, 2004, 2006, 2012లలో మెగా టోర్నీలలో ఇంగ్లండ్ షూట్అవుట్ పెనాల్టీల ద్వారానే నిష్క్రమించాల్సి వచ్చింది. అభిమానుల అతి.. వ్యతిరేకత ఇంగ్లండ్ ఓటమికి ఇది ఒక కారణం కాకపోవచ్చు. కానీ, ఇటలీని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఇవే కారణాలు అయ్యాయి. ఇంగ్లండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, మద్దతు ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ నింపింది. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసుకునే అవకాశం ఇవ్వలేకపోయింది. పైగా సెమీ ఫైనల్లో డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ కళ్లలో అభిమానులు లేజర్ లైట్లు కొట్టడం, అభిమానులపై దాడులు చేయడం ఘటనలు విపరీతమైన చర్చకు దారితీసింది. ఇక ఫైనల్‌కు ముందు ఇటలీ పట్ల ప్రదర్శించిన వివక్ష కూడా ఓ కారణంగా మారింది. అంతెందుకు ఫైనల్లో షూట్అవుట్ పెనాల్టీ మిస్ చేసినందుకు బుకాయో సకాపై సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు, మిగతా ఇద్దరిపై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారంటే.. అక్కడి అభిమానుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రియల్ విన్నర్ జార్జియో చియెల్లిని సారథ్యంలోని ఇటలీ ఫుట్‌బాల్ టీం 2020 యూరో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. సుమారు మూడువందల కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ గెల్చుకుంది. ఇటలీకి ఇది రెండో యూరోపియన్ ఛాంపియన్షిప్ టైటిల్. 2006 ఫిఫా వరల్డ్ కప్ విజయం తర్వాత గెలిచిన మేజర్ టోర్నీ. కానీ, 2018లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్(ఫిఫా)కు కనీసం అర్హత సాధించలేకపోయింది. దీంతో అరవై ఏళ్ల ఇటలీ ఫుట్‌బాల్ చరిత్ర ఒక్కసారిగా మసకబారింది. అయితే ఆ అవమానం నుంచి కోలుకోవడానికి ఇటలీకి ఎంతో టైం పట్టలేదు. ఆరు నెలల తర్వాత రాబర్టో మన్సినీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి మొదలైన వరుస క్లీన్ విక్టరీలు, హుందాగా వ్యవహరించే జట్టు, వాళ్ల ఫ్యాన్స్.. ఇదీ ఇటలీ టీం పట్ల ఫాలోయింగ్ పెరగడానికి కారణం అయ్యాయి. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల రెండు పెనాల్టీ షూట్ అవుట్లను అడ్డుకోవడంతో(మూడోది గోల్ రాడ్‌కి తగిలి మిస్ అయ్యింది) రియల్‌హీరోగా మారిపోయాడు గియాన్లుయిగి డొన్నారుమ్మ. Euro 2020 Final లో ఇంగ్లండ్ ఓటమిపై స్పందిస్తూ.. ‘ఇటలీ మిమ్మల్ని ఓడించలేదు. కానీ, మీరే వాళ్లకు తలొగ్గారు’ అంటూ డచ్ సాకర్ దిగ్గజం జోహన్ క్రుయఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటలీది భయంకరమైన డిఫెన్స్ ఆట, ఆ మంత్రం సింపుల్ది. అది అందరికీ తెలుసు. అయినా ఇంగ్లండ్ ఓడిందంటే అది వాళ్ల నిర్లక్క్ష్యమేనని పేర్కొన్నాడు ఆయన. ఇక యూరో 2020 రన్నర్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు 267 కోట్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యూరో కప్ 2020: సెమీస్ పోరులో తలపడేది వీళ్లే!
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మూడు సార్లు చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్విట్జర్లాండ్‌పై గెలుపొందింది. ఆట 8వ నిమిషంలో డేనిస్ జకారియా సెల్ఫ్ గోల్‌తో స్పెయిన్‌కు గోల్ అందించాడు. 68వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ షాకిరి గోల్ చేయడంతో స్కోర్ 1–1తో సమమైంది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఇరు జట్లు కూడా ఒక్కో గోల్ సాధించడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్ (అదనపు సమయం)కు దారి తీసింది. 30 నిమిషాల అదనపు సమయంలో ఇరు జట్లు మరో గోల్ సాధించడంలో విఫలమవ్వడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక పెనాల్టీ షూటౌట్లో ఎటువంటి తడబాటుకు గురవని స్పెయిన్ విజేతగా నిలిచింది. మరో పోరులో బెల్జియం, ఇటలీ మధ్య జరిగిన క్వార్టర్ఫైనల్లో ఇటలీ పైచేయి సాధించింది. బెల్జియంను 2-1 తేడాతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్ సాధించారు. ఇక సెమీస్ పోరులో ఇటలీ స్పెయిన్లు వెంబ్లే స్టేడియం(లండన్)లో తలపడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు చెక్ రిపబ్లిక్ డెన్మార్క్‌లు తలపడనున్నాయి. చదవండి: ఆడకుంటే జీతం లేదు.. మెస్సీకి షాకిచ్చిన ఆ క్లబ్ -
చెత్త టీం-చెత్త ఆఫర్లు.. ఏం తమాషాగా ఉందా?
ప్రపంచంలోనే ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ(34)కి ఘనత ఉంది. అయితే తాజాగా బార్సిలోనాతో అతని కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో మెస్సీ పయనమెటు? గందరగోళంలో మెస్సీ? అనే శీర్షికలతో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చిన్న టీంల నుంచి చెత్త టీంల దాకా ప్రతీ ఒక్క క్లబ్‌లు మెస్సీకి బంపరాఫర్లు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు. లియోనెల్ మెస్సీ.. ఇప్పుడు ఫ్రీ ఏజెంట్. బార్సిలోనాతో నాలుగేళ్ల ఒప్పందం జూన్ 30 అర్థరాత్రితో ముగిసింది. దాదాపు 500 మిలియన్ల డాలర్ల ఒప్పందంగా.. ప్రపంచంలోనే కాస్ట్లీ ప్లేయర్ కాంట్రాక్ట్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఎన్బీఎ, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్, బేస్‌బాల్ లీగ్‌లోనూ ఏ ఆటగాడితో ఇంతటి కాస్ట్లీ కాంట్రాక్ట్‌లు జరగలేదు. ఇదిలా ఉంటే బ్రెజిల్ ఐబిస్ స్పోర్ట్ క్లబ్ నుంచి వచ్చిన మెస్సీకి ఆఫర్ గురించి పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. É OFICIAL! 🚨 Hoje é o último dia do contrato de Messi com o Barcelona. A partir de amanhã ele já terá um novo clube. Assina, MESSI ✒️📄🤝@betsson_brasil #MessiNoÍbis pic.twitter.com/tJKMOrqnLD — Íbis Sport Club (@ibismania) June 30, 2021 ప్రపంచంలోనే చెత్త ఫుట్‌బాల్ టీంగా ఐబిస్ స్పోర్ట్ క్లబ్ పేరుంది. అంతేకాదు. డెబ్భై నుంచి ఎనభై దశకాల మధ్య దాదాపు నాలుగేళ్లపాటు ఒక్క గేమ్ కూడా గెల్వని రికార్డ్ ఈ క్లబ్ సొంతం. ఇక అలాంటి క్లబ్ మెస్సీకి కొన్ని షరతుల మీద ఒప్పంద పత్రాన్ని ప్రకటించింది. పదిహేనేళ్ల కాంటాక్ట్, అదీ మెరిట్ బేస్ మీద జీతం, గోల్స్ చేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేసి క్లబ్ నుంచి తొలగించడం, కాంటాక్ట్ రద్దైతే తర్వాత ఛాంపియన్ అనే ట్యాగ్‌ను తీసేయడం, పదో నెంబర్ జెర్సీ వేసుకోవద్దని.. అది తమ లెజెండ్ మారో షాంపూకి మాత్రమే సొంతమని , ఇక క్లబ్లో చేరే ముందు మారడోనా కంటే పీలే గొప్పోడని అద్దం ముందు మూడుసార్లు ప్రతిజ్క్ష చేయాలనే కండిషన్.. ఇలా చిత్రమైన ఒప్పందాలతో మెస్సీకి ఆహ్వానం ఆఫర్ ప్రకటించింది ఆ క్లబ్. దీంతో మండిపడుతున్నారు అతని ఫ్యాన్స్. ఇక మెస్సీ పీఆర్ టీం కూడా ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకునేంత తీరిక మెస్సీకి లేదని ప్రకటించింది. ఇక ఈ ఫ్రీ ఏజెంట్ కోసం.. చిన్నచితకా క్లబ్‌లు సైతం పోటీ పడుతున్నాయి. మెస్సీ స్వస్థలం రోసారియో నుంచి నెవెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ ఆసక్తి చూపిస్తోంది. సొంత జట్టుకు వచ్చేయమంటూ ట్విటర్ ద్వారా అతనికి ఆహ్వానం కూడా పలికింది. ఎస్టాడియో మార్సెలో బైస్లా స్టేడియం వద్ద మెస్సీ.. పేరుతో పెద్ద కట్ అవుట్లు(మ్యూరాల్స్) ఏర్పాటు చేయించింది కూడా. ఇక తన కెరీర్ చివర్లో తాను సొంత గూటికే వెళ్తానని చాలాసార్లు మెస్సీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో ఆశలు పెట్టుకుంది ఓల్డ్ బాయ్స్. ఇక నెదర్లాండ్స్‌కు చెందిన వోలెన్డామ్ క్లబ్, రియల్ సాల్ట్ లేక్(అమెరికా) కూడా మెస్సీకి ఆహ్వానం పలకడం విశేషం. మరి మెస్సీ మనసులో.. సాధారణంగా బార్సిలోనా ఈ సాకర్ మాంత్రికుడి కాంట్రాక్ట్ రెన్యువల్కోసమే ప్రయత్నిస్తుంది. కానీ, 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే క్లబ్ ప్రెసిడెంట్ జోవాన్ లపోర్టా స్పందించాడు. అతను మాతో ఉండాలనే మేం అనుకుంటున్నాం. అతనూ కోరుకుంటున్నాడు. అంతా సవ్యంగానే ఉందని వ్యాఖ్యానించాడాయన. మరి మెస్సీ మనసులో ఏముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ⚽EL MURAL DEL 🔟 EN LA CIUDAD😍 👏Así va quedando el mural en homenaje a Lionel #Messi que se pinta en Buenos Aires y Azara, una de las esquinas del barrio natal de La Pulga en Rosario. La obra de arte será presentada este jueves 1 de julio. 📸Increíbles imágenes de @rosdrone pic.twitter.com/iY1VSy866X — Rosario3.com (@Rosariotres) June 30, 2021 చదవండి: యూరో 2020.. కరోనా అంటించుకున్న ఆ దేశ అభిమానులు -
కొంపముంచిన అభిమానం.. 2 వేల మందికి కరోనా!
కరోనా టైంలో జన సమూహారం ప్రమాదకరమనే వైద్య నిపుణులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. అయినా కూడా జనాలు గుమిగూడడం ఆపట్లేదు. ఈ తరుణంలో యూరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు.. స్కాట్లాండ్లో భారీగా కరోనా కేసులకు కారణమయ్యాయి. వెర్రి అభిమానంతో వందల మైళ్ల దూరం ప్రయాణించి మరీ.. వైరస్‌ను అంటించుకున్నారు స్కాట్లాండ్ సాకర్ అభిమానులు. ఎడిన్బర్గ్: ఫుట్‌బాల్ మీద అభిమానం స్కాట్లాండ్లో భారీగా కరోనా కేసులు పెరగడానికి కారణమయ్యింది. యూరప్ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. యూరో ఛాంపియన్షిప్ నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ సాకర్ అభిమానులు వెనక్కి తగ్గట్లేదు. ఇక తమ టీం మ్యాచ్ కోసమని స్కాట్లాండ్ అభిమానులు లండన్‌కు పెద్ద ఎత్తున్న క్యూ కట్టారు. వందల మైళ్లు రైళ్లలో, విమానాల్లో ప్రయాణించి.. మరీ ఇంగ్లండ్ మ్యాచ్‌ను చూసి వచ్చారు. ఈ తరుణంలో సుమారు 2 వేల మంది సాకర్ అభిమానులు కరోనా బారిన పడ్డట్లు.. స్కాట్లాండ్ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 1,991 మంది కరోనా బారిన పడగా.. అందులో 1,294 మంది కేవలం ఇంగ్లండ్-స్కాట్లాండ్ ఒక్కమ్యాచ్ కోసం వెంబ్లేకి వెళ్లి వచ్చిన వాళ్లుగా అధికారులు ధృవీకరించారు. ఇక మ్యాచ్‌ల టైంలో స్కాట్లాండ్ గ్లాస్గోలోని హంప్డెన్ స్టేడియం వద్ద జనాలు భారీగా గుమిగూడారు. ఇదే కాదు.. మ్యాచ్ కోసం బార్లు, పబ్‌ల దగ్గర కూడా జనాలు గుంపులుగా కలియతిరిగారు. పైగా మాస్క్‌లు లేకుండా తప్పతాగి సంబురాలు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా భారీగా విజృంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ సందర్భంగా స్కాట్లాండ్ మిడ్‌ఫీల్డర్ బిల్లీ గిల్మౌర్ సైతం వైరస్ బారిన పడగా.. అతనితో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న మరో ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్లు సైతం సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లిపోయారు. చదవండి: చుక్క మత్తులో పోలీసులకు చుక్కలు -
UEFA EURO 2020: ఫ్రాన్స్ చేజేతులా...
బుకారెస్ట్ (రొమేనియా): జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు... అంతర్జాతీయ టోర్నీలలో ఎన్నో గొప్ప విజయాలు... అయితేనేం తప్పిదాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, యూరో కప్ రన్నరప్ ఫ్రాన్స్ జట్టు విషయంలో ఇలాగే జరిగింది. యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టు కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో ఫ్రాన్స్ జట్టును ఓడించి యూరో టోర్నీలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. స్విట్జర్లాండ్ తరఫున సెఫరోవిచ్ (15వ, 81వ ని.లో) రెండు గోల్స్... గావ్రనోవిచ్ (90వ ని.లో) ఒక గోల్ చేశారు. ఫ్రాన్స్ జట్టుకు కరీమ్ బెంజెమా (57వ, 59వ ని.లో) రెండు గోల్స్... పోగ్బా (75వ ని.లో) ఒక గోల్ అందించారు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘పెనాల్టీ షూటౌట్’ను నిర్వహించారు. ఇందులో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు ఐదు షాట్లను లక్ష్యానికి చేర్చారు. ఫ్రాన్స్ తరఫున తొలి నలుగురు ఆటగాళ్లు సఫలమవ్వగా...చివరి షాట్ తీసుకున్న కిలియన్ ఎంబాపె మాత్రం విఫలమయ్యాడు. ఎంబాపె సంధించిన షాట్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ యాన్ సమర్ కుడివైపునకు డైవ్ చేస్తూ ఎడమ చేత్తో అద్భుతంగా నిలువరించి ఫ్రాన్స్ విజయాన్ని అడ్డుకున్నాడు. 1992 తర్వాత ఫ్రాన్స్ జట్టుపై స్విట్జర్లాండ్ నెగ్గడం ఇదే తొలిసారి. యూరో టోర్నీలో ఏనాడూ స్విట్జర్లాండ్ చేతిలో ఓడిపోని ఫ్రాన్స్‌కు ఈసారీ విజయం దక్కేది. కానీ చివరి 10 నిమిషాల్లో అలసత్వం ఫ్రాన్స్ కొంపముంచింది. ఫ్రాన్స్ రక్షణశ్రేణిలోని లోపాలను సది్వనియోగం చేసుకొని స్విట్జర్లాండ్ చివరి పది నిమిషాల్లో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అదనపు సమయంలో ఫ్రాన్స్‌ను నిలువరించి... షూటౌట్లో ఆ జట్టును నాకౌట్ చేసింది. జర్మనీకి ఇంగ్లండ్ షాక్... లండన్‌లో మంగళవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–0 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ జర్మనీ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ తరఫున స్టెర్లింగ్ (75వ ని.లో), హ్యారీ కేన్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
Viral Video: గోల్ కీపర్ తడబాటు.. పాపం!
ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విజయం దక్కినప్పటికీ.. ఆ గోల్కీపర్కి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోల్ కీపర్ కంగారుతో .. ప్రత్యర్థి ఖాతాలో పాయింట్ జమ అయ్యింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్ ఆడియెన్స్‌లో టెన్షన్ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్పెయిన్, క్రోయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(స్పెయిన్ క్లబ్) మిడ్ ఫీల్డర్ పెడ్రి బంతిని పాస్ చేయగా.. అది గోల్‌కీపర్ ఉనయ్ సైమన్ ముందుకొచ్చింది. అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్ నెట్ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని .. అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు. ఇక ఆ తర్వాత మ్యాచ్ జరుగుతున్నంత సేపు సైమన్ ముఖంలో ఆందోళనతో నిండిపోయింది. చివరికి ఎక్స్ట్రా టైం కలిసి రావడంతో 5-3 తేడాతో స్పెయిన్.. క్రొయేషియాపై విజయం సాధించింది. ఇక ఆ సెల్ఫ్ గోల్ తర్వాత సైమన్ చాలాసేపు స్థిమితంగా ఉండలేకపోయాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇదే వెరైటీ గోల్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో.. అందుకు సంబంధించిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. Kepa watching from the bench as Unai Simon concedes from a 30 yard backpass#CROSPA #EURO2020 pic.twitter.com/XBDZq2DtRC — Kiran T-ierney (@mopeygooner) June 28, 2021 “Dubravka scored the most bizarre own goal you’ll see at #EURO2020” Unai Simon: #ESP pic.twitter.com/eYxQWAHMzB — SportPesa Kenya (@SportPesa) June 28, 2021 చదవండి: విజేత నుంచి అబద్ధాలకోరు.. తప్పక చదవాల్సిన కథ -
తప్పతాగి ఫ్యాన్స్ రచ్చ.. రాత్రంతా పోలీసుల జాగారం
యూరో ఛాంపియన్షిప్ టోర్నీ 2020లో ఇరు జట్ల ఫ్యాన్స్ సంబురాలు.. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇంగ్లండ్, స్కాట్లాండ్ ఫ్యాన్స్ స్టేడియం బయట ఒకరిపై ఒకరు దురుసుగా ప్రవర్తించుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రంతా వాళ్లకు అడ్డుగా నిలబడి జాగారం చేశారు. లండన్: యూఈఎఫ్ఏ యూరో 2020 టోర్నీలో భాగంగా ఉత్కంఠంగా జరిగిన ఇంగ్లండ్ స్కాట్లాండ్ ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వెంబ్లే స్టేడియంలో ఇరు జట్లు తలపడి గోల్ కొట్టకపోవడంతో స్కోర్ బోర్డు 0-0 దగ్గరే ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియం బయట జరిగిన పరిణామాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇంగ్లండ్, టార్టన్ ఆర్మీ(స్కాట్లాండ్ మద్దతుదారులు) మధ్య మొదలైన చిన్న గొడవ.. స్కాట్లాండ్ సాకర్ ఫ్యాన్స్ చేరికతో ఘర్షణలకు దారితీయబోయింది. దీంతో రాత్రంతా పోలీసులు ఇరువర్గాల మధ్య అడ్డుగొడలా నిల్చుని ఉద్రికత్తలను తగ్గించే ప్రయత్నం చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో వేలాది మంది సాకర్ అభిమానులు లెయిసెస్టర్ స్క్వేర్ వద్ద గుమిగూడి పార్టీ చేసుకోవడం ప్రారంభించారు. ఆ టైంలో స్కాట్లాండ్కు మద్దతు తెలపడానికి వచ్చిన టార్టన్ ఆర్మీ(స్కాట్లాండ్ టీంకు సపోర్ట్‌గా పార్టీలు చేయడం, ఆ తర్వాత చెత్త ఏరడం వీళ్ల పని) సభ్యుడికి.. ఇంగ్లండ్ అభిమానులకు గొడవ జరిగింది. ఇది తెలిసి స్కాట్లాండ్ సాకర్ ఫ్యాన్స్ విలియం షేక్స్పియర్ విగ్రహం వద్ద టార్టన్తో కలిశారు. దీంతో గొడవ ముదిరే టైంకి పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం 2 వేల టికెట్లు జారీ చేయగా.. అక్కడ 20వేలకు పైగా జనం గుమిగూడినట్లు పోలీసులు వెల్లడించారు. వాళ్లంతా మద్యం, డ్రగ్స్ మత్తులో దూకుడుగా వ్యవహరించారని, ఈ ఉద్రిక్తతలకు సంబంధించి ఇప్పటివరకు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వెల్లడించారు. అయితే అందులో ఇంగ్లండ్ అభిమానులు లేరని పోలీసులు చెప్పడం కొసమెరుపు. ఇక సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు ఆ వేలమందిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ గొడవకు ఆజ్యం పోసిందని చెబుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. A Fight breaks out between England and Scotland Fans pic.twitter.com/INv0wVeCaL — Subject Access (@SubjectAccesss) June 18, 2021 చదవండి: తేడాగా చూస్తున్నారు.. నేను ఆడలేను -
రొనాల్డో ఎఫెక్ట్: ఇకపై బాటిల్స్ ముట్టుకుంటే..
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కోకా కోలా బాటిల్ వ్యవహారం ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ రొనాల్డ్ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే రొనాల్డో చర్య తర్వాత మరికొందరు ఆటగాళ్లు.. అతన్నే అనుకరిస్తూ, అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఫుట్‌బాల్ అసోషియేషన్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ఆటగాళ్లు బాటిళ్లను జరపడం, పక్కనపెట్టడం చాలా చేష్టలకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కేవలం బాటిళ్లలోనే కాదు.. స్పానర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీల ప్రొడక్టుల విషయంలోనూ ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘టోర్నమెంట్ నిర్వాహణ కోసం ఆయా బ్రాండ్లతో ఒప్పందాలు జరిగాయని ఆటగాళ్లు గమనించాలి. వాళ్ల భాగస్వామ్యంతోనే యూరప్ దేశాల్లో ఫుట్‌బాల్ పురోగతికి కృషి జరుగుతోందని గుర్తించాలి’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యూఈఎఫ్ఏ. ఇక పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చర్యను పరోక్షంగా తప్పుబట్టిన టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కల్లెన్.. ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా చేసిన పనిని కూడా పరోక్షంగానే సమర్థించాడు. మత విశ్వాసానికి ముడిపడిన అంశం కావడంతో ఆ విషయంలో అతన్ని(పోగ్బా) తప్పుబట్టలేమని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు జరిమానా విధించే విషయంలో యూఈఎఫ్ఏ నేరుగా జోక్యం చేసుకోదని, ఆయా ఆటగాళ్ల ఫుట్‌బాల్ ఫెడరేషన్లే చూసుకుంటాయని మార్టిన్ స్పష్టం చేశాడు. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు-రొనాల్డో -
29వేల కోట్లు ఢమాల్! కోకా కోలా యాడ్ గుర్తుందా?
మంచి నీళ్లే తాగాలని.. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ వద్దంటూ ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో చేసిన కామెంట్ కీలక పరిణామానికి దారితీసింది. రోనాల్డో వీడియో తర్వాత కోకా కోలా కంపెనీకి ఊహించని రీతిలో డ్యామేజ్ జరిగింది. యూరో ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. వాటర్ బాటిల్ పైకెత్తి ‘అగ్వా’(పోర్చుగ్రీసు భాషలో మంచినీళ్లు అని అర్థం) అని కామెంట్ చేశాడు. తర్వాత ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే 36 ఏళ్ల రొనాల్డో కామెంట్ ఎఫెక్ట్ మార్కెట్‌పై దారుణంగా చూపెట్టింది. కోకా కోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకా కోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. కోకాకోలా రియాక్షన్ ఇక క్రిస్టియానో రొనాల్డో వ్యవహరించిన తీరుపై యూరో ఛాంపియన్షిప్ స్పానర్‌షిప్‌గా వ్యవహరిస్తున్న కోకాకోలా స్పందించింది. ‘ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు’ అని బదులిచ్చింది. ఎవరి టేస్ట్లు వాళ్లకు ఉంటాయి. అవసరాలను బట్టి ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు. అందులో తప్పేముంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నీళ్లతో పాటు కోకా కోలా డ్రింక్‌లు కూడా సర్వ్ చేస్తున్నాం. అతని కంటే ముందు ఎంతో మంది ప్లేయర్లు కోక్ తాగం చూసే ఉంటారు అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రొనాల్డో.. యాడ్ గుర్తుందా? ఇక ఇప్పుడు ఏ డ్రింక్‌ల పట్ల అయితే క్రిస్టియానో రొనాల్డో అయిష్టత, అసహ్యం కనబరిచాడో.. కొన్నేళ్ల క్రితం అదే కార్బొనేట్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీకి ఒక యాడ్ చేశాడు. 2006లో 22 ఏళ్ల రొనాల్డో కోకా కోలా బ్రాండ్‌కు యాడ్ చేశాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ యాడ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కొందరు రొనాల్డ్ తీరును తప్పుబడుతుండగా.. అభిమానులు మాత్రం ఆ వయసుకి రొనాల్డోకి అంత పరిణితి లేదని, అతని డైట్లో చాలా ఏళ్లుగా మార్పు వచ్చిందని గుర్తుచేస్తున్నారు. చదవండి: రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు -
'ప్లీజ్ ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి'
అమ్‌స్టర్‌డామ్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. డైట్‌ను కచ్చితంగా ఫాలో అయ్యే రొనాల్డో తన ఆహారంలో కేలరీస్ ఎక్కువగా లభించే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త పడతాడు. తాజాగా ఒక మీడియా సమవేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్‌ను పక్కన పెట్టేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దంటూ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూఈఎఫ్ఏ యూరోకప్ 2020లో భాగంగా రొనాల్డో జట్టు కెప్టెన్ హోదాలో కోచ్ ఫెర్నాండో సాంటోస్‌తో కలిసి మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్‌పై కోకకోలా బాటిల్స్ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసి.. '' ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి'' అంటూ వాటర్‌బాటిల్‌ను తన చేతిలో తీసుకొని చెప్పాడు. కోచ్ ఫెర్నాండోస్ రొనాల్డో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు.. కానీ తర్వాత తన మాటలతో అర్థం చేసుకున్న అతను రొనాల్డొను అభినందించాడు. యూరోకప్ 2020లో భాగంగా పోర్చుగల్ గ్రూఫ్ ఎఫ్‌లో ఉంది. పోర్చుగల్‌తో పాటు జర్మనీ, ప్రాన్స్, హంగేరీ కూడా ఉండడంతో అంతా ఈ గ్రూఫ్‌ను ''గ్రూఫ్ ఆఫ్ డెత్''గా అభివర్ణిస్తున్నారు. కాగా 2016లో జరిగిన యూరోకప్‌లో రొనాల్డో ఆధ్వర్యంలోనే పోర్చుగల్ ఫ్రాన్స్‌ను ఫైనల్లో ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న పోర్చుగల్ మరోసారి చాంపియన్‌గా నిలవాలని చూస్తుంది. 36 ఏళ్ల రొనాల్డోకిది వరుసగా ఆరో ‘యూరో’ చాంపియన్‌షిప్ కావడం విశేషం. కాగా రొనాల్డో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పోర్చుగల్ తరపున ఇప్పటివరకు 104 గోల్స్ చేశాడు. మరో ఏడు గోల్స్ చేస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్ మాజీ ప్లేయర్ అలీ దాయి (109 గోల్స్) పేరిట ఉంది. చదవండి: UEFA EURO 2020: నెదర్లాండ్స్ బోణీ 7 సెకన్లు.. 60 మీటర్ల దూరం.. ఏమా వేగం Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂 He moved them and said "Drink water" 😆pic.twitter.com/U1aJg9PcXq — FutbolBible (@FutbolBible) June 14, 2021 -
గుండెపోటే.. చనిపోయాడనుకున్నాం!
యూరో ఛాంపియన్షిప్ 2021 టోర్నీ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ మైదానంలోనే కుప్పకూలిన డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సెన్ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైదానం నుంచి అతని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటి నుంచి ‘ఔట్ ఆఫ్ డేంజర్’ అని డాక్టర్లు చెప్పేదాకా.. అసలు అతనికి ఏం జరిగిందన్న విషయం చెప్పకుండా ఆసక్తిని రేకెత్తించారు. అయితే చివరికి 29 ఏళ్ల ఈ డెన్మార్క్ ఆటగాడికి గుండెపోటు వచ్చిందని డాక్టర్లు ధృవీకరించారు. ‘‘అతనికి గుండెపోటు వచ్చింది. అవును.. బతకడం అతని అదృష్టం అని టీం డాక్టర్ మోర్టెన్ బోయిసెన్ మీడియాకు వెల్లడించాడు. ఎరిక్సెన్ కుప్పకూలిపోయినాక.. దగ్గరికి వెళ్లి చూశాం. అతనికి గుండెపోటు వచ్చిందని అప్పుడే అర్థమైంది. చనిపోయాడనుకున్నాం. కానీ, అదృష్టం బతికాడు.. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం. ఇంతకంటే విషయాలేమీ ఇప్పుడు వివరించలేను’’ అని మోర్టెన్ హడావిడిగా వెళ్లిపోయాడు. వేటు తప్పదా? తని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ఆడతానని ముందుకొచ్చినా.. తీసుకునే ప్రసక్తే లేదని ఇటలీ ప్రకటించింది. క్రిస్టియన్ డెన్మార్క్ జాతీయ జట్టులోనే కాకుండా.. ఇంటర్ మిలన్(సిరీ ఎ క్లబ్) తరపున ఆడుతున్నాడు కూడా. ఈ క్రమంలో అక్కడి చట్టాల ప్రకారం అతనిపై నిషేధం విధించే అవకాశం ఉందని క్లబ్ మెంబర్ ఒకరు తెలిపారు. ఇక డెన్మార్క్ జట్టు కూడా అతని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తిరిగి జట్టులోకి చేర్చుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక క్రిస్టియన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టే ప్రసక్తే ఉండబోదని అతని ప్రేయసి/భార్య విస్ట్ జెన్సన్ నిన్న మీడియా ముందు భావోద్వేగంగా వెల్లడించింది. కాగా, ఎరిక్సెన్ 2010 మార్చ్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా.. 2010 ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడిన యంగెస్ట్ ప్లేయర్ ఘనత దక్కించుకున్నాడు. ఐదేళ్లపాటు డెన్మార్క్ ‘ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ దక్కించుకున్నాడు కూడా. చదవండి: కుప్పకూలిన ఫుట్‌బాల్ ప్లేయర్ -
4 నిమిషాలు... 2 గోల్స్
► మలుపు తిప్పిన గ్రిజ్మన్ ► ఐర్లాండ్‌పై ఫ్రాన్స్ గెలుపు ► క్వార్టర్స్‌లోకి ప్రవేశం ► జర్మనీ, పోర్చుగల్ కూడా ► యూరో కప్ లైన్: ఆరంభంలో కాస్త తడబడినా... కీలక సమయంలో తనదైన శైలిలో చెలరేగిన ఫ్రాన్స్... యూరో చాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంది. కేవలం నాలుగు నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో ఫ్రాన్స్ 2-1తో ఐర్లాండ్‌పై గెలిచి క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఫ్రాన్స్ తరఫున గ్రిజ్మన్ (58వ, 61వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా, బ్రాడీ (2వ నిమిషంలో) ఐర్లాండ్‌కు ఏకైక గోల్ అందించాడు. బంతిని అందుకునే క్రమంలో ఫ్రాన్స్ ఆటగాడు పోగ్బా... షెన్లాంగ్ (ఐర్లాండ్)ను మొరటుగా అడ్డుకోవడంతో రెండో నిమిషంలోనే ఐర్లాండ్‌కు పెనాల్టీ లభించింది. దీన్ని బ్రాడీ గోల్‌గా మల్చడంతో ఆతిథ్య జట్టు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇక అక్కడి నుంచి ఎన్ని దాడులు చేసినా... ఫ్రాన్స్ గోల్ మాత్రం చేయలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలో 13 నిమిషాల తర్వాత సాగ్నా ఇచ్చిన క్రాస్ పాస్‌ను గ్రిజ్మన్ అద్భుతమైన హెడర్‌గా మల్చడంతో స్కోరు సమమైంది. మూడు నిమిషాల తర్వాత ఒలివర్ గిరౌడ్ (ఫ్రాన్స్) ఇచ్చిన పాస్‌ను మళ్లీ గ్రిజ్మన్ తక్కువ ఎత్తులో బలమైన షాట్‌గా మలిచాడు. దీంతో ఫ్రాన్స్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. జర్మనీ హవా లిల్లీ: కచ్చితమైన పాస్‌లు... చూడచక్కని సమన్వయం.. గురి తప్పని షాట్లతో ఆకట్టుకున్న జర్మనీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో చెలరేగిపోయింది. దీంతో 3-0తో స్లొవేకియాను చిత్తు చేసి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీ తరఫున బొటెంగ్ (8వ ని.), గోమెజ్ (43వ ని.), డ్రాక్సలర్ (63వ ని.) గోల్స్ చేశారు. మ్యాచ్ ఆద్యంతం బంతిపై పూర్తి ఆధిపత్యం చూపెడుతూ జర్మనీ చేసిన దాడులకు ఏ దశలోనూ స్లొవేకియా అడ్డుకట్ట వేయలేకపోయింది. ఫలితంగా అవకాశాలనూ సృష్టించుకోలేక గోల్స్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. క్వార్టర్స్‌లో పోర్చుగల్ నైస్: స్టార్ మిడ్‌ఫీల్డర్ రికార్డో క్వారెస్మా (117వ నిమిషంలో) ఎక్స్ట్రా టైమ్‌లో గోల్ చేయడంతో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో పోర్చుగల్ 1-0తో క్రొయేషియాపై నెగ్గింది. దీంతో క్వార్టర్స్ పోరులో పోలాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇరుజట్ల రక్షణశ్రేణి పటిష్టంగా ఉండటంతో పరస్పరం దాడులు చేసుకున్నా నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు కాలేదు. ఫలితంగా మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు దారితీసింది. ఓవరాల్‌గా క్రొయేషియా 15 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా.. ఒక్కసారి కూడా లక్ష్యాన్ని చేరలేదు. ఇదే సమయంలో పోర్చుగల్ ఐదు పర్యాయాలు ప్రయత్నించి విఫలమైంది. 25వ నిమిషంలో రొనాల్డో కొట్టిన ఫ్రీ కిక్ బార్‌ను తాకి బయటకు వెళ్లడంతో క్రొయేషియా ఊపిరి పీల్చుకుంది. 87వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టిన క్వారెస్మా మంచి సమన్వయంతో కదిలాడు. దీంతో ఎక్స్ట్రా టైమ్‌లో రొనాల్డో ఇచ్చిన దగ్గరి పాస్‌ను అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా మలిచి పోర్చుగల్‌ను గెలిపించాడు. -
ఇబ్రమోవిచ్ గుడ్‌బై!
నైస్ (ఫ్రాన్స్): స్వీడన్ స్టార్ స్ట్రయికర్ ఇబ్రమోవిచ్.. యూరో చాంపియన్‌షిప్ తర్వాత ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మేరకు స్వీడన్ తరఫున యూరోలో ఆడనున్నదే తన చివరి మ్యాచ్ అని మంగళవారం ప్రకటించాడు.