కరోనా టైంలో జన సమూహారం ప్రమాదకరమనే వైద్య నిపుణులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. అయినా కూడా జనాలు గుమిగూడడం ఆపట్లేదు. ఈ తరుణంలో యూరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు.. స్కాట్లాండ్‌లో భారీగా కరోనా కేసులకు కారణమయ్యాయి. వెర్రి అభిమానంతో వందల మైళ్ల దూరం ప్రయాణించి మరీ.. వైరస్‌ను అంటించుకున్నారు స్కాట్లాండ్ సాకర్ అభిమానులు.
ఎడిన్‌బర్గ్: ఫుట్‌బాల్ మీద అభిమానం స్కాట్లాండ్‌లో భారీగా కరోనా కేసులు పెరగడానికి కారణమయ్యింది. యూరప్ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. యూరో ఛాంపియన్‌షిప్ నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ సాకర్ అభిమానులు వెనక్కి తగ్గట్లేదు. ఇక తమ టీం మ్యాచ్ కోసమని స్కాట్లాండ్ అభిమానులు లండన్‌కు పెద్ద ఎత్తున్న క్యూ కట్టారు. వందల మైళ్లు రైళ్లలో, విమానాల్లో ప్రయాణించి.. మరీ ఇంగ్లండ్ మ్యాచ్‌ను చూసి వచ్చారు. ఈ తరుణంలో సుమారు 2 వేల మంది సాకర్ అభిమానులు కరోనా బారిన పడ్డట్లు.. స్కాట్లాండ్ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం 1,991 మంది కరోనా బారిన పడగా.. అందులో 1,294 మంది కేవలం ఇంగ్లండ్-స్కాట్లాండ్ ఒక్కమ్యాచ్ కోసం వెంబ్లేకి వెళ్లి వచ్చిన వాళ్లుగా అధికారులు ధృవీకరించారు. ఇక మ్యాచ్‌ల టైంలో స్కాట్లాండ్ గ్లాస్గోలోని హంప్‌డెన్ స్టేడియం వద్ద జనాలు భారీగా గుమిగూడారు. ఇదే కాదు.. మ్యాచ్ కోసం బార్‌లు, పబ్‌ల దగ్గర కూడా జనాలు గుంపులుగా కలియతిరిగారు. పైగా మాస్క్‌లు లేకుండా తప్పతాగి సంబురాలు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా భారీగా విజృంభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ సందర్భంగా స్కాట్‌లాండ్ మిడ్‌ఫీల్డర్ బిల్లీ గిల్‌మౌర్ సైతం వైరస్ బారిన పడగా.. అతనితో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న మరో ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్‌లు సైతం సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లిపోయారు.
చదవండి: చుక్క మత్తులో పోలీసులకు చుక్కలు
Comments
Please login to add a commentAdd a comment