పారిస్: ఫ్రాన్స్‌లో తొలిసారి కొత్తరకం కరోనా వైరస్ బయటపడినట్లు ఫ్రెంచ్ వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. ఇంగ్లండులో నివసించే ఫ్రాన్స్‌కి చెందిన వ్యక్తి 19న ఫ్రాన్స్‌కి తిరిగి వచ్చారు. ఈయనకు పరీక్షలు జరపగా కొత్తరకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇతర యూరోపియన్ దేశాల్లో సైతం ఈ కొత్తరకం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఈ వైరస్‌కి అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉన్నట్టు బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ కొత్త కరోనా వైరస్ బయటపడినట్టు 19న, ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఫ్రాన్స్ సైతం బ్రిటన్‌నుంచి వచ్చే ప్రయాణీకులపై, కార్గోలపై రెండు రోజులు నిషేధం విధించింది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ఫ్రాన్స్ రాకపోకలకు అనుమతిచ్చింది. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది.
మోడెర్నా టీకాతో వైద్యుడికి తీవ్ర అలర్జీ
వాషింగ్టన్: మోడెర్నా కరోనా టీకా తీసుకున్న ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బోస్టన్‌కు చెందిన వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్‌కు అంతకు ముందే షెల్‌ఫిష్ అలర్జీ ఉంది. టీకా వేయించుకున్న వెంటనే మైకం కమ్మేసినట్లు, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని వైద్యుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment