ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా.. బ్రెజిల్‌ను పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో క్రొయేషియా గోల్ కీపర్ డొమినిక్ లివాకోవిచ్ హీరోగా నిలిచాడు. పెనాల్టీ షూటౌట్‌లో పటిష్టమైన బ్రెజిల్ ఆటగాళ్లు నాలుగుసార్లు గోల్ చేయడానికి ప్రయత్నించగా సమర్థంగా అడ్డుకున్నాడు.
ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే నాలుగు పెనాల్టీ షూటౌట్ అడ్డుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదివరకు ఏ గోల్ కీపర్ ఈ ఘనత సాధించలేదు. ఇక పెనాల్టీ షూటౌట్‌లో వినిసియస్‌జూనియర్, నెయ్‌మర్, లుకాస్ పెక్వెటా కొట్టడానికి యత్నించిన గోల్స్‌ను సమర్థంగా అడ్డుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. దీంతో డొమినిక్ లివాకొవిచ్ ఇప్పుడు క్రొయేషియాలో హీరోగా మారిపోయాడు. ఇక నవంబర్ 14న జరగనున్న తొలి సెమీఫైనల్లో అర్జెంటీనాతో క్రొయేషియా అమితుమీ తేల్చుకోనుంది.
Livakovic the hero again as Croatia oust Brazil on penalties 🤯
— JioCinema (@JioCinema) December 10, 2022
Watch how Zlatko Dalic's side beat the 5-time #FIFAWorldCup champions 🙌
Presented by @Mahindra_Auto
Stay tuned to #JioCinema & #Sports18 for more 📺📲#CROBRA #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/gRydVtRRsC
Croatia's hero... again! 🇭🇷🧤#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/w8QroYs2aJ
— FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022
చదవండి: Lionel Messi: 'ఏంటి చూస్తున్నావ్.. నీ పని చూసుకో స్టుపిడ్'
Comments
Please login to add a commentAdd a comment