World Cup’s hottest fan Ivana Knoll trolls Japan as she reposts cheeky sushi video after Croatia win R-16 - Sakshi
Sakshi News home page

Ivana Knoll FIFA WC: జపాన్‌ను అవమానించిన క్రొయేషియా సుందరి

Published Tue, Dec 6 2022 11:12 AM | Last Updated on Tue, Dec 6 2022 12:11 PM

FIFA WC Hottest Fan Ivana Knoll Troll-Japan Lost Match-To-Croatia-R-16 - Sakshi

ఇటీవలే క్రొయేషియాకు చెందిన మోడల్‌ ఇవానా నోల్‌ ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పొట్టి బట్టలతో దర్శనమిచ్చి వరల్డ్‌ హాటెస్ట్‌ ఫ్యాన్‌గా నిలిచింది. కఠిన నిబంధనలు ఉన్న అరబ్‌ గడ్డపై అందాల ప్రదర్శన చేసిన ఆమె వార్తల్లో నిలిచింది. పైగా తన అందాలను చూపించడానికి ఖతర్‌ దేశం అనుమతి ఇచ్చిందంటూ పేర్కొంది. 

తాజాగా ఇవానా నోల్‌ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈసారి అందాల ప్రదర్శన కాకుండా జపాన్‌ను అవమానిస్తూ వార్తల్లోకి ఎక్కింది. విషయంలోకి వెళితే.. ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రీక్వార్టర్స్‌లో భాగంగా సోమవారం రాత్రి క్రొయోషియా, జపాన్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. నిర్ణీత సమయంలోగా ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో జపాన్‌ను  3-1 తేడాతో క్రొయేషియా ఓడించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.  కాగా మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇవానా నోల్‌ జపాన్‌ను ట్రోల్‌ చేసింది.

జపనీయులకు సుషీ అనేది ఫెవరెట్‌ డిష్‌. వెంజర్డ్‌ రైస్‌, కూరగాయలు, ఇతర పదార్థాలను కలిపి ఈ డిష్‌ను తయారు చేస్తుంటారు. మ్యాచ్‌కు ముందు ఇవానా నోల్‌ తన ప్లేట్‌లో సుషీ డిష్‌ను ఉంచి.. ''జపాన్‌ మీకోసం మేము రెడీగా ఉన్నాం'' అంటూ పోస్ట్‌ చేసింది. దీనర్థం జపాన్‌తో కలిసి సుషీ తినడానికి మేం రెడీ అని. అయితే జపాన్‌ మ్యాచ్‌ ఓడిపోయాకా ఇవానా నోల్‌ మరో ఫోటో షేర్‌ చేసింది. ''ఈరోజు సుషీ మాత్రమే మా ఫుడ్‌మెనులో కనిపిస్తుంది.. పాపం జపాన్‌ తినే అర్హత కోల్పోయింది'' అంటూ అవమానించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇవానా షేర్‌ చేయగా.. అవి వైరల్‌ అయ్యాయి. 

చదవండి: 'దేశానికి గోల్డ్‌ మెడల్‌ తీసుకురా అన్నప్పుడు నవ్వుకున్నా'

FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement