అండర్సన్‌కు సింగిల్స్‌ టైటిల్‌ ...  | Kevin Anderson beats Ivo Karlovic to win Maharashtra Open title | Sakshi
Sakshi News home page

అండర్సన్‌కు సింగిల్స్‌ టైటిల్‌ ... 

Published Sun, Jan 6 2019 2:34 AM | Last Updated on Sun, Jan 6 2019 2:34 AM

Kevin Anderson beats Ivo Karlovic to win Maharashtra Open title - Sakshi

టాటా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను ప్రపంచ ఆరో ర్యాంకర్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) సాధించాడు. 100వ ర్యాంకర్‌ ఇవో కార్లోవిచ్‌ (క్రొయేషియా)తో 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అండర్సన్‌ 7–6 (7/4), 6–7 (2/7), 7–6 (7/5)తో గెలుపొందాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 95 కేజీల బరువున్న అండర్సన్‌ మ్యాచ్‌లో 21 ఏస్‌లు... 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 105 కేజీల బరువున్న కార్లోవిచ్‌ 36 ఏస్‌లు సంధించడం విశేషం. మ్యాచ్‌ మొత్తంలో ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా నమోదు కాకపోవడం విశేషం. చివరి సెట్‌ టైబ్రేక్‌లో 39 ఏళ్ల కార్లోవిచ్‌ 5–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి ఓటమి చవిచూశాడు. విజేత అండర్సన్‌కు 90,990 డాలర్ల (రూ. 63 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement