జాగ్రెబ్: డేవిస్ కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భాగంగా క్రొయేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు ఓటమి చవిచూశారు. తొలి సింగిల్స్‌లో 132వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–3, 4–6, 2–6తో ప్రపంచ 277వ ర్యాంకర్ బోర్నా గోజో చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో 182వ ర్యాంకర్ రామ్ కుమార్ 6–7 (8/10), 6–7 (8/10)తో 37వ ర్యాంకర్ మారిన్ సిలిచ్ చేతిలో పోరాడి ఓడాడు. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన క్రొయేషియా... నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లేదా రెండు రివర్స్ సింగిల్స్‌లో ఒక దాంట్లో విజయం సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే డేవిస్‌కప్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment