![Model Ivana Knoll CONTROVERSIAL Low-Cut Top ARG Vs Croatia Match Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/14/ivana.jpg.webp?itok=fbNFw_QE)
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫాలో అవుతున్న వారికి క్రొయేషియా మోడల్ ఇవానా నోల్ గురించి పరిచయం అక్కర్లేదు. అసభ్య దుస్తులకు అనుమతి లేని చోట పొట్టి పొట్టి డ్రెస్సులు ధరిస్తూ హాట్ లుక్స్‌తో ఫిఫా అభిమానులను అలరిస్తుంది. తనకు తాను హాటెస్ట్ ఫ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రకటించుకున్న ఇవానా నోల్ తాజాగా తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచింది.
తాజాగా అర్జెంటీనా, క్రొయేషియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు హాజరైన ఇవానా నోల్ మరింత రెచ్చిపోయింది. క్రొయేషియా జెండా కలర్ లో కట్ టాప్ డ్రెస్.. బ్లూ జీన్స్‌తో మ్యాచ్‌కు హాజరైంది. కట్టిపడేసే అందంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన కుర్రకారు గుండెల్లో ఆమె రైళ్లు పరిగెత్తించింది. క్లీవేజ్ షో చేస్తూనే హాట్ హాట్ లుక్స్‌తో అందరి కళ్లు తనవైపుకు తిప్పుకుంది.
అయితే క్రొయేషియా కథ సెమీస్‌లో ముగియడంతో అమ్మడు అందాలు కూడా ఇక్కడికే పరిమితమవుతాయేమోనని కొంతమంది తెగ ఫీలవుతున్నారు. క్రొయేషియా వెళ్లిపోయింది కాబట్టి తాను వెళ్లిపోతుందని.. ప్చ్ అందాల ప్రదర్శన మిస్ అవుతామోనని మరికొంత మంది కామెంట్స్ చేశారు. అయితే ఇవానా నోల్ ఖతర్‌ను వీడి వెళుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదని.. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ ముగిసాకే ఆమె తన దేశం వెళుతుందంటూ కొంతమంది పేర్కొన్నారు.
ఏది ఏమైనా తన అందంతో ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్లతో సమానంగా పేరు పొందిన ఇవానా నోల్‌కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. అరబ్ లాంటి కఠినమైన దేశాల్లో వారి ఆంక్షలను బేఖాతరు చేసి పొట్టి పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చి అందాలు ఆరబోసిన ఇవానా నోల్ దైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ కొందరు అభిమానులు ట్విటర్ వేదికగా తెలిపారు.
చదవండి: FIFA WC 2022: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి
Comments
Please login to add a commentAdd a comment