
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ చూడడానికి వచ్చే అభిమానులకు కఠినమైన కండీషన్స్ పెట్టారు నిర్వాహకులు. మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగితే యువతుల గ్లామర్ షో ఎక్కువగా ఉండడం సహజం. మందు, విందు, చిందు కూడా కామన్‌గా కనిపిస్తాయి. ఫిఫా లాంటి మెగా టోర్నీలో అయితే ఇక చెప్పనవసరం లేదు. పొట్టి దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ తమ అంద చందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.
కానీ అరబ్ దేశమైన ఖతర్‌లో ఇలాంటివి నిషేధం. ఇస్లాం మతం ఎక్కువగా ఆచరించే దేశంలో మహిళలు అసభ్యకర దుస్తులు ధరించడానికి వీల్లేదు. అందుకే ఫిఫా వరల్డ్‌కప్‌కు వచ్చే యువతులు, మహిళలలు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. అనవసరంగా క్లీవేజ్ షో చేసి జైలుపాలు కావొద్దని ముందే హెచ్చరించింది. అంతేకాదు మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులు ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలని.. తప్పనిసరిగా మెడచుట్టు స్కార్ఫ్ వాడాల్సిందేనని పేర్కొన్నారు.
అయితే క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ మాత్రం తనకు ఈ నిబంధనలు ఏ మాత్రం వర్తించవని ధైర్యంగా పేర్కొంది. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో హాటెస్ట్ ఫ్యాన్‌గా ముద్రపడిన ఇవానా నోల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అందాల ప్రదర్శన చేయడం సంచలనం కలిగించింది. క్రొయేషియా, బెల్జియం మ్యాచ్‌కు హాజరైన ఇవానా నోల్.. స్టేడియంలోకి సాధారణంగానే ఎంట్రీ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతుండగానే ఇవానా నోల్ తాను వేసుకున్న డ్రెస్ పైపార్ట్ తొలగించి క్లీవేజ్ షో చేసింది. ఫిఫా నిర్వాహకుల సంగతి ఏమో తెలియదు కానీ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులు మాత్రం ఆమె అందాల ప్రదర్శనను బాగా ఎంజాయ్ చేశారు.
అయితే తన అందాల ప్రదర్శనే ఇప్పుడు ఇవానా నోల్‌కు సమస్యను తెచ్చిపెట్టింది. ఖతర్ వీధుల్లో ఇవానా నోల్ ఫోటోలను దగ్దం చేసిన స్థానిక యువకులు వెంటనే ఆమెను దేశం నుంచి బహిష్కరించాలని లేదా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఇవానా నోల్ మాత్రం తన అంద చందాలతో ఖతర్‌లో సెగలు పుట్టించింది.
చదవండి: నాలుగుసార్లు ఛాంపియన్.. ఇదంతా గతం; మాకు జరగాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment