ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం గ్రూప్-ఎఫ్‌లో భాగంగా మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ పేలవ డ్రాగా ముగిసింది. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా జట్టు ఈ మ్యాచ్‌లో పెద్దగా మెరవలేదు. క్రొయేషియా పలుసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసినప్పటికి మొరాకో డిఫెన్స్ పటిష్టంగా ఉండడంతో గోల్స్ కొట్టలేకపోయింది.
తొలి హాఫ్ టైమ్‌లో ఇరుజట్లు గోల్స్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. ఇక రెండో హాఫ్ టైంలోనూ అదే పరిస్థితి. అదనపు సమయంలోనే ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో చెరొక పాయింట్ కేటాయించారు. ఇక తమ తర్వాతి మ్యాచ్‌లో క్రొయేషియా..కెనడాతో ఆడనుండగా; మొరాకో బెల్జియంతో అమితుమీ తేల్చుకోనుంది.
చదవండి: మరొక మ్యాచ్ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చాన్స్ ఎంత?
Morocco and Croatia share the points. 🤝@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) November 23, 2022
Comments
Please login to add a commentAdd a comment