Match drawn
-
బెల్జియం, జర్మనీ మ్యాచ్ డ్రా
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం,మాజీ విజేత జర్మనీ జట్ల మధ్య మంగళవారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పూల్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం ఓటమి అంచున నిలిచింది. అయితే ఆఖరి క్వార్టర్లో వెగ్నేజ్ (54వ ని.లో) చేసిన గోల్‌తో ‘డ్రా’తో బయటపడింది. అంతకుముందు జర్మనీ జట్టులో వెలెన్ నిక్లస్ (22వ ని.లో), టామ్ గ్రామ్‌బుష్ (52వ ని.లో) చెరో గోల్ చేయగా, సెడ్రిక్ చార్లియర్ 9వ నిమిషంలోనే బెల్జియంకు తొలి గోల్ అందించాడు. ఈ నెల 20న జరిగే ఆఖరి లీగ్‌తో క్వార్టర్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో బెల్జియం, దక్షిణ కొరియాతో జర్మనీ తలపడతాయి. ఈ పూల్ లో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో జపాన్‌పై గెలిచింది. కొరియా తరఫున లీ జంగ్ జన్ (8వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. జపాన్ జట్టులో నగయొషి (1వ ని.లో) గోల్ సాధించాడు. అయితే జపాన్ 11 మందితో కాకుండా 12 మందితో ఆడటం వివాదం రేపింది. -
ఇదేనా ఆటతీరు.. మెరుపుల్లేవ్!
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం గ్రూప్-ఎఫ్‌లో భాగంగా మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ పేలవ డ్రాగా ముగిసింది. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా జట్టు ఈ మ్యాచ్‌లో పెద్దగా మెరవలేదు. క్రొయేషియా పలుసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసినప్పటికి మొరాకో డిఫెన్స్ పటిష్టంగా ఉండడంతో గోల్స్ కొట్టలేకపోయింది. తొలి హాఫ్ టైమ్‌లో ఇరుజట్లు గోల్స్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. ఇక రెండో హాఫ్ టైంలోనూ అదే పరిస్థితి. అదనపు సమయంలోనే ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో చెరొక పాయింట్ కేటాయించారు. ఇక తమ తర్వాతి మ్యాచ్‌లో క్రొయేషియా..కెనడాతో ఆడనుండగా; మొరాకో బెల్జియంతో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: మరొక మ్యాచ్ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చాన్స్ ఎంత? Morocco and Croatia share the points. 🤝@adidasfootball | #FIFAWorldCup — FIFA World Cup (@FIFAWorldCup) November 23, 2022 -
ఆసియా కప్ ఫైనల్ రేసులో భారత్...
జకార్తా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. సూపర్–4 సెమీఫైనల్ లీగ్‌లో భాగంగా మలేసియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను భారత్ 3–3 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. ఒకదశలో భారత్ 0–2తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా టీమిండియా గోల్ సమర్పించుకొని విజయం సాధించాల్సిన చోట ‘డ్రా’తో సంతృప్తి పడింది. మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ (12వ, 21వ, 56వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో తమ జట్టుకు ఓటమి తప్పించాడు. టీమిండియా తరఫున విష్ణుకాంత్ సింగ్ (32వ ని.లో), సునీల్ (53వ ని.లో), జెస్ నీలమ్ సంజీప్ (55వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 3–1తో జపాన్ను ఓడించింది. ప్రస్తుతం పట్టికలో కొరియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండింటిలో ఓడిన జపాన్ ఫైనల్ రేసుకు దూరమైంది. మంగళవారం జరిగే చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో మలేసియా; కొరియాతో భారత్ తలపడతాయి. ఆఖరి మ్యాచ్‌లో జపాన్‌పై మలేసియా గెలిస్తే... భారత్–కొరియా మ్యాచ్‌లో నెగ్గిన జట్టు మలేసియాతో కలిసి ఫైనల్ చేరుతుంది. ఒకవేళ భారత్–కొరియా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే... భారత్, కొరియా, మలేసియా జట్లలో మెరుగైన గోల్స్ సగటు ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి. -
Indian Super League: హైదరాబాద్, జంషెడ్పూర్ మ్యాచ్ ‘డ్రా’
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా గురువారం హైదరాబాద్, జంషెడ్పూర్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. జంషెడ్పూర్ తరఫున స్టీవర్ట్ (41వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అయితే ఆట 56వ నిమిషంలో జావో విక్టర్ ఇచ్చిన పాస్‌ను ఎటువంటి పొరపాటు చేయకుండా గోల్ పోస్ట్‌లోకి పంపిన హైదరాబాద్ స్ట్రయికర్ ఒగ్బెచె స్కోరును 1–1తో సమం చేశాడు. ఆ తర్వాత గోల్ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్‌లో ఓడగా...ఇప్పుడు ‘డ్రా’ చేసుకుంది. -
ఇది ఆటంటే.. టెస్టు మజా ఏంటో చూపించింది
Cricketers Praise Test Cricket Entertainment.. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ముగిసిన తొలి టెస్టు ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈరోజుల్లో మూడు.. నాలుగు రోజుల్లో ముగిసిపోతున్న టెస్టు మ్యాచ్‌లకు విరుద్దంగా ఆట ఐదోరోజు ఆఖరివరకు సాగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా సాగినప్పటికీ కివీస్ టెయిలెండర్ల అసాధారణ పోరాటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 52 బంతులపాటు ఓపికగా ఆడిన రచిన్ రవీంద్ర, ఎజాజ్ పటేల్‌లు కివీస్‌ను ఓటమి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్లో ఉండే మజాను మరోసారి రుచి చూశామని పలువురు క్రికెటర్లు ట్విటర్లో స్పందించారు. డేవిడ్ వార్నర్..'' టెస్టు క్రికెట్ అంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఐదు రోజుల పాటు రెండు జట్లు ఎంతో కష్టపడి ఆడాయి. టీమిండియా విజయం కోసం శ్రమించినప్పటికి డ్రాతో ముగిసింది. అందుకే నాకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇక ముంబై టెస్టుకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.. యాషెస్ సిరీస్కోసం అంతకు మించి ఎదురుచూస్తున్నా'' వీరేంద్ర సెహ్వాగ్.. '' టెస్టు క్రికెట్ అంటే మజా వేరుగా ఉంటుంది. టి20, వన్డేలు సంప్రదాయ క్రికెట్ ముందు పనికిరావు. ఓటమి నుంచి తప్పించుకోవడానికి న్యూజిలాండ్ చాలా కష్టపడింది. టీమిండియా తృటిలో విజయం నుంచి దూరమవడం నిరాశ కలిగించింది. ఇక ముంబై టెస్టులోనే ఫలితం కోసం ఎదురుచూడాలి.'' వీవీఎస్ లక్ష్మణ్.. '' ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. న్యూజిలాండ్ ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. రచిన్ .. ఎజాజ్‌లు టీమిండియా గెలుపుకు అడ్డుగోడగా నిలబడ్డారు. టీమిండియాకు గెలుపు దూరం కావడం నిరాశ కలిగించింది.'' -
Ind vs Nz 1st Test: అశ్విన్ అరుదైన రికార్డు.. కంగ్రాట్స్ సోదరా!
Ind vs Nz 1st Test: Ravi Ashwin Record Harbhajan Singh Congratulates Him: టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్ పడగొట్టి ఈ రికార్డును అందుకున్నాడు. 417 వికెట్ల మైలురాయిని చేరుకుని టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ పేరు మీద ఉన్న రికార్డును అధిగమించాడు. కాగా హర్భజన్ సింగ్ 103 మ్యాచ్‌లలో ఈ ఫీట్ నమోదు చేయగా... అశ్విన్ తన 80వ టెస్టు మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఈ జాబితాలో అనిల్ కుంబ్లే(619), కపిల్ దేవ్(434) ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలో అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘అదీ మరి.. అశ్విన్ పవర్..’’ అంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక భజ్జీ సైతం అశ్విన్‌ను అభినందించాడు. ‘‘కంగ్రాట్స్ అశ్విన్.. ఇలాంటి ఘనతలు ఎన్నో సాధించాలి సోదరా... ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక.. ఇంకా మెరుగ్గా ఆడాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక కాన్పూర్ టెస్టులో విజయం ఖాయమనుకున్న దశలో టీమిండియా బౌలర్లు ఆఖరి వికెట్ తీయలేకపోవడంతో డ్రాగా ముగిసింది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలుపొంది వరల్డ్చాంపియన్షిప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న టీమిండియా ఆశ నెరవేరలేదు. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. Congratulations @ashwinravi99 wish you many more brother.. God bless.. keep shining 👏👏 — Harbhajan Turbanator (@harbhajan_singh) November 29, 2021 -
పేలవ డ్రాగా ముగిసిన పింక్ బాల్ టెస్ట్
గోల్డ్‌కోస్ట్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ‘పింక్ బాల్’ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 143/4తో చివరి రోజు(ఆదివారం) ఆటను కొనసాగించిన ఆసీస్ మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిథాలీ సేన.. 36 ఓవర్లు ఆడి 3 వికెట్లు కోల్పోయి 135 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి 272 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది. అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. మ్యాచ్ ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. సూపర్ శతకంతో అలరించిన మంధాన(127)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: 'లైగర్'తో యువ్‌రాజ్ సింగ్ పోటీ.. గెలుపెవరిది..? -
England Vs Newzealand: తొలి టెస్ట్ డ్రా
లండన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు డ్రాగా ముగించుకోగలిగింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచి అంతగా ప్రభావం చూపించని ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. రోరి బర్న్స్ (25), జాక్ క్రాలీ (2) ఆకట్టుకోలేకపోయినా.. చివర్లో సిబ్లేకు ఓలీ పోప్ (20) తోడుగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో వాగ్నర్‌కు రెండు, సౌథీకి ఓ వికెట్ దక్కింది. అంతకుముందు 62/2 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(36), రాస్ టేలర్(33) ఓ మోస్తరుగా రాణించగా, ఓలీ రాబిన్సన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. కాగా, అరంగేట్రం ఆటగాడు డెవాన్ కాన్వే ద్విశతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేయగా, రోరీ బర్న్స్(132) శతకొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో రాణించిన డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న ప్రముఖ పాక్ క్రికెటర్ భార్య.. -
రాణించిన సాహా.. మ్యాచ్ డ్రా
సిడ్నీ : భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. భారత బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా (100 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ప్రాక్టీస్ చేసుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 286/8తో మంగళవారం ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 306/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆసీస్ ‘ఎ’ జట్టుకు 59 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ ‘ఎ’ 61 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు పృథీ్వషా (19), శుబ్‌మన్ గిల్ (29) కాసేపే క్రీజులో నిలిచారు. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (0) డకౌటయ్యాడు. హనుమ విహారి (28), కెప్టెన్ రహానే (28) ప్రాక్టీస్‌లో అదరగొట్టలేకపోయారు. పేసర్ మార్క్ స్టెకెటీ (5/37) భారత బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోకుండా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టాడు. తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్ ‘ఎ’ మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. హారిస్ (25 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఉమేశ్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ నెల 11 నుంచి 13 వరకు పింక్‌బాల్‌తో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లంతా పాల్గొంటారు. సిడ్నీలోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. -
‘డ్రా’తో ముగించారు
ముర్సియా (స్పెయిన్): తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న స్పెయిన్ జట్టుపై వారి దేశంలోనే సిరీస్ గెలిచే అవకాశాన్ని భారత మహిళల జట్టు చేజార్చుకుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ భారత్ 1–1తో ముగించింది. సిరీస్‌లోని చివరిదైన నాలుగో మ్యాచ్ 2–2తో ‘డ్రా’ అయ్యింది. ఆట 8వ నిమిషంలో దీప్ ఎక్కా గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 26వ నిమిషంలో నవనీత్ కౌర్ గోల్‌తో భారత ఆధిక్యం 2–0కు చేరింది. అయితే మూడో క్వార్టర్లో భారత్ నాలుగు నిమిషాల తేడాలో రెండు గోల్స్ సమర్పించుకుంది. ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్ జట్టు తరఫున 35వ నిమిషంలో లూసియా జెమినెజ్... 39వ నిమిషంలో క్లారా వైకార్ట్ ఒక్కో గోల్ చేసి స్కోరును 2–2తో సమం చేశారు. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయాయి. తొలి మ్యాచ్‌లో భారత్ 2–3తో ఓడిపోగా... రెండో మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయ్యింది. మూడో మ్యాచ్‌లో భారత్ 5–2తో గెలిచిన విషయం తెలిసిందే. -
దుబాయ్‌లో హై‘డ్రా’మా
దుబాయ్: మైదానంలో ఒక్కరంటే ఒక్క ప్రేక్షకుడూ లేరు. సీట్లన్నీ ఖాళీగా ఉండటంతో ఏ మాత్రం పనిలేక సెక్యూరిటీ సిబ్బంది దిక్కులు చూసే పరిస్థితి! చూసేవారెవరూ లేకున్నా, చేసేదేమీ లేక ఆటను ప్రారంభించాల్సి వచ్చింది.! ... దుబాయ్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా టెస్టు తొలి రోజు ఆదివారం ఇదీ పరిస్థితి! ఇలాంటి మ్యాచ్‌కు ఐదో రోజు అనూహ్య, ఆసక్తికర, ఉత్కంఠభరిత ముగింపు! గెలుపుపై ధీమాతో బరిలో దిగిన పాక్‌కు డ్రాతో ఆసీస్ చెక్! ఈ క్రమంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ ఖాజా (302 బంతుల్లో 141; 11 ఫోర్లు) అద్భుత శతకం, ట్రావిస్ హెడ్ (175 బంతుల్లో 72; 5 ఫోర్లు); కెప్టెన్ టిమ్ పైన్ (194 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు)ల అసమాన పోరాటం. యాసిర్ షా (4/106) మెరుపు స్పెల్! ఇంతకూ ఏం జరిగిందంటే 462 పరుగుల లక్ష్య ఛేదనలో 136/3తో గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ విజయానికి మరో 326 పరుగులు చేయాలి. ‘డ్రా’ కావాలంటే రోజంతా ఆడాలి. ఈ పరిస్థితుల్లో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఖాజా, హెడ్ లంచ్ వరకు వికెట్ కాపాడుకున్నారు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న హెడ్‌ను విరామం అనంతరం రెండో ఓవర్లోనే హఫీజ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. లబ్‌షేన్ (13)ను యాషిర్ షా వెనక్కుపంపాడు. పైన్ అండగా ఖాజా శతకం అందుకోవడంతో ఆసీస్ 289/5తో టీకి వెళ్లింది. ఆ తర్వాతా వీరు స్థిరంగా ఆడుతూ మ్యాచ్‌ను ‘డ్రా’ దిశగా తీసుకెళ్తున్న దశలో యాసిర్ షా విజృంభించాడు. ఖాజా, స్టార్క్ (1), సిడిల్ (0)లను వరుస ఓవర్లలో వెనక్కుపంపాడు. దీంతో కంగారూలు 333/8కు పడిపోయారు. ఇంకా 12 ఓవర్ల పైగా ఆట మిగిలుంది. యాసిర్ షా జోరు చూస్తే పాక్ విజయం ఖాయమనిపించింది. కానీ, పలుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న పైన్, నాథన్ లయన్ (34 బంతుల్లో 5 నాటౌట్) తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ అడ్డుగోడగా నిలిచారు. 362/8తో ఆసీస్ రోజును ముగించి పరాజయం కోరల నుంచి బయటపడింది. మ్యాచ్‌లో ఖాజా 524 నిమిషాలు, పైన్ 219 నిమిషాలు, హెడ్ 197 నిమిషాలు క్రీజులో నిలవడం గమనార్హం. -
ఫైనల్లో ఇండియా బ్లూ
దులీప్ ట్రోఫీ గ్రేటర్ నోరుుడా: దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో ఇండియా బ్లూ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండియా గ్రీన్‌తో ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగియగా... తొలి ఇన్నింగ్స ఆధిక్యం కారణంగా బ్లూ ముందంజ వేసింది. మ్యాచ్ చివరి రోజు బుధవారం 769 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్రీన్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. మురళీ విజయ్ (73), ఉతప్ప (66) అర్ధ సెంచరీలు చేశారు. అంతకు ముందు 85/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన బ్లూ రెండో ఇన్నింగ్సలో 298 పరుగులకు ఆలౌటైంది. జాక్సన్ (79 నాటౌట్), గంభీర్ (59), మయాంక్ అగర్వాల్ (58), దినేశ్ కార్తీక్ (57) రాణించారు. శ్రేయస్ గోపాల్‌కు 4 వికెట్లు దక్కారుు. మయాంక్ అగర్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇండియా రెడ్, ఇండియా బ్లూ జట్ల మధ్య శనివారంనుంచి ఇదే మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
భారత్, ఆసీస్ మ్యాచ్ డ్రా
రాయ్‌పూర్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. భారత్ తరఫున తొలి క్వార్టర్లో డ్రాగ్ ఫ్లికర్ రఘునాథ్ ( 28, 43వ ని.) రెండు గోల్స్ చేయగా, డైలాన్ వతర్‌స్పూన్ (9వ ని.), క్రిస్ గెరిల్లో (58వ ని.) ఆసీస్‌కు గోల్స్ అందించారు. ఆరంభంలో కంగారుల దాడులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. మ్యాచ్ చివర్లో తడబడింది. మన్‌ప్రీత్ చేసిన తప్పిదానికి ఆసీస్ తొలి గోల్ చేసినా... రఘునాథ్ నిమిషాల వ్యవధిలో భారత్‌కు రెండు గోల్స్ అందించాడు. రెండో అర్ధభాగంలో బాగా అటాకింగ్ చేసిన ఆసీస్ మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా గోల్ చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. డిసెంబర్లో ఇదే వేదికపై జరగనున్న హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్‌కు సన్నాహాకాల్లో భాగంగా భారత్ ఈ సిరీస్ ఆడుతోంది. -
చరిత్ర సృష్టించిన ఆంధ్ర
తొలిసారి ముంబైపై ఆధిక్యం రంజీ మాజీ చాంపియన్‌తో మ్యాచ్ ‘డ్రా’ ఆరు వికెట్లతో రాణించిన అయ్యప్ప విజయనగరం: మొహమ్మద్ కైఫ్ నేతృత్వంలోని ఆంధ్ర క్రికెట్ జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తమ రంజీ చరిత్రలో తొలిసారిగా పటిష్ట ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఆంధ్రకు మూడు పాయింట్లు, మాజీ చాంపియన్ ముంబైకి ఓ పాయింట్ దక్కింది. చివరి రోజు ఆదివారం ఆంధ్ర పేసర్ బండారు అయ్యప్ప ఆరు వికెట్లతో హడలెత్తించడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. సిద్ధేశ్ లాడ్ (163 బంతుల్లో 86; 12 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. 37 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను అయ్యప్ప పడగొట్టడంతో ఆంధ్రకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (106 బంతుల్లో 59; 10 ఫోర్లు; 1 సిక్స్), కైఫ్ (135 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. గోవాకు మూడు పాయింట్లు గోవా: హైదరాబాద్, గోవా జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌కు చివరి రోజు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయితే 100 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా గోవా జట్టుకు మూడు పాయింట్లు లభించగా, హైదరాబాద్‌కు ఓ పాయింట్ దక్కింది. ఆదివారం చివరి రోజు 349/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన గోవా వర్షం కురిసే సమయానికి 140.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 425 పరుగులు చేసింది. షగున్ కామత్ (286 బంతుల్లో 109; 11 ఫోర్లు; 1 సిక్స్) శతకం సాధించాడు. అంతకుముందు హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. -
కేరళ బ్లాస్టర్స్‌కు ఓ పాయింట్
కోల్‌కతాతో మ్యాచ్ డ్రా కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టు ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ఈ జట్టు ఆదివారం పటిష్ట అట్లెడికో డి కోల్‌కతాతో మాత్రం 1-1తో డ్రా చేసుకోగలిగింది. దీంతో ఒక పాయింట్ దక్కించుకుంది. మరోవైపు దూకుడు మీదున్న కోల్‌కతా ఒక్క ఓటమి కూడా లేకుండా 11 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే స్టార్ ఫార్వర్డ్ ఫిక్రూ టెఫెరాపై సస్పెన్షన్ వేటు జట్టు ఆటతీరుపై బాగానే ప్రభావం చూపించింది. ఆరంభంలో మాత్రం కోల్‌కతా జోరుగానే ఆడింది. 22వ నిమిషంలోనే బల్జీత్ సహానీ కుడి కాలుతో గోల్ కీపర్‌ను ఏమార్చుతూ చేసిన గోల్‌తో కోల్‌కతా 1-0 ఆధిక్యం సాధించింది. కొద్ది నిమిషాల్లోనే మరో అవకాశం వచ్చినా కేరళ డిఫెండర్ హెంగ్బార్ట్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 41వ నిమిషంలో మిలగ్రెస్ ఇచ్చిన పాస్‌ను ఇయాన్ హుమే గోల్‌గా మలచడంతో కేరళ స్కోరును 1-1తో సమం చేయగలిగింది. ద్వితీయార్ధంలో గోల్స్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డా సఫలం కాలేకపోయాయి. పుణేకు తొలి విజయం: మరోవైపు ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో పుణే 2-0తో నెగ్గింది. అటు గోవా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడి, మరో పోటీని డ్రా చేసుకుంది. 42వ నిమిషంలో కొస్టాస్ కట్సౌరనీస్ చేసిన గోల్‌తో పుణే 1-0 ఆధిక్యం సాధించింది. 81వ నిమిషంలో 37 ఏళ్ల డేవిడ్ ట్రెజెగ్వెట్ పుణే జట్టుకు రెండో గోల్‌ను అందించాడు.