Indian Super League: హైదరాబాద్, జంషెడ్‌పూర్‌ మ్యాచ్‌ ‘డ్రా’  | Indian Super League: Hyderabad Vs Jamshedpur Match Draw | Sakshi
Sakshi News home page

Indian Super League: హైదరాబాద్, జంషెడ్‌పూర్‌ మ్యాచ్‌ ‘డ్రా’ 

Dec 3 2021 8:05 AM | Updated on Dec 3 2021 8:09 AM

Indian Super League: Hyderabad Vs Jamshedpur Match Draw - Sakshi

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా గురువారం హైదరాబాద్, జంషెడ్‌పూర్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. జంషెడ్‌పూర్‌ తరఫున స్టీవర్ట్‌ (41వ నిమిషంలో) గోల్‌ చేసి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అయితే ఆట 56వ నిమిషంలో జావో విక్టర్‌ ఇచ్చిన పాస్‌ను ఎటువంటి పొరపాటు చేయకుండా గోల్‌ పోస్ట్‌లోకి పంపిన హైదరాబాద్‌ స్ట్రయికర్‌ ఒగ్బెచె స్కోరును 1–1తో సమం చేశాడు. ఆ తర్వాత గోల్‌ కోసం హైదరాబాద్‌ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక మ్యాచ్‌ గెలిచి మరో మ్యాచ్‌లో ఓడగా...ఇప్పుడు ‘డ్రా’ చేసుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement