సిడ్నీ : భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. భారత బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా (100 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ప్రాక్టీస్ చేసుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 286/8తో మంగళవారం ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 306/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆసీస్ ‘ఎ’ జట్టుకు 59 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ ‘ఎ’ 61 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు పృథీ్వషా (19), శుబ్‌మన్ గిల్ (29) కాసేపే క్రీజులో నిలిచారు.
టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (0) డకౌటయ్యాడు. హనుమ విహారి (28), కెప్టెన్ రహానే (28) ప్రాక్టీస్‌లో అదరగొట్టలేకపోయారు. పేసర్ మార్క్ స్టెకెటీ (5/37) భారత బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోకుండా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టాడు. తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్ ‘ఎ’ మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. హారిస్ (25 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఉమేశ్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ నెల 11 నుంచి 13 వరకు పింక్‌బాల్‌తో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లంతా పాల్గొంటారు. సిడ్నీలోనే ఈ మ్యాచ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment