భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది.
రాయ్‌పూర్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. భారత్ తరఫున తొలి క్వార్టర్‌లో డ్రాగ్ ఫ్లికర్ రఘునాథ్ ( 28, 43వ ని.) రెండు గోల్స్ చేయగా, డైలాన్ వతర్‌స్పూన్ (9వ ని.), క్రిస్ గెరిల్లో (58వ ని.) ఆసీస్‌కు గోల్స్ అందించారు. ఆరంభంలో కంగారుల దాడులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. మ్యాచ్ చివర్లో తడబడింది. మన్‌ప్రీత్ చేసిన తప్పిదానికి ఆసీస్ తొలి గోల్ చేసినా... రఘునాథ్ నిమిషాల వ్యవధిలో భారత్‌కు రెండు గోల్స్ అందించాడు. రెండో అర్ధభాగంలో బాగా అటాకింగ్ చేసిన ఆసీస్ మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా గోల్ చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. డిసెంబర్‌లో ఇదే వేదికపై జరగనున్న హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్‌కు సన్నాహాకాల్లో భాగంగా భారత్ ఈ సిరీస్ ఆడుతోంది.