ఫైనల్లో ఇండియా బ్లూ | In the final, India Blue | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఇండియా బ్లూ

Published Thu, Sep 8 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

In the final, India Blue

దులీప్ ట్రోఫీ  


గ్రేటర్ నోరుుడా: దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఇండియా బ్లూ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండియా గ్రీన్‌తో ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగియగా... తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం కారణంగా బ్లూ ముందంజ వేసింది. మ్యాచ్ చివరి రోజు బుధవారం 769 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్రీన్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్‌‌సలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. మురళీ విజయ్ (73), ఉతప్ప (66) అర్ధ సెంచరీలు చేశారు.

అంతకు ముందు 85/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన బ్లూ రెండో ఇన్నింగ్‌‌సలో 298 పరుగులకు ఆలౌటైంది. జాక్సన్ (79 నాటౌట్), గంభీర్ (59), మయాంక్ అగర్వాల్ (58), దినేశ్ కార్తీక్ (57) రాణించారు. శ్రేయస్ గోపాల్‌కు 4 వికెట్లు దక్కారుు. మయాంక్ అగర్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇండియా రెడ్, ఇండియా బ్లూ జట్ల మధ్య శనివారంనుంచి ఇదే మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement