india blue
-
ఇండియా ‘బ్లూ’ 260/5
దిండిగల్: ఇండియా ‘రెడ్’తో మంగళవారం మొదలైన దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ తొలి రోజు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి ఇండియా ‘బ్లూ’ ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అన్మోల్ప్రీత్ సింగ్ (147 బంతుల్లో 96; 14 ఫోర్లు, 1 సిక్స్), ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ (136 బంతుల్లో 53 బ్యాటింగ్, 5 ఫోర్లు) ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించి ‘బ్లూ’ జట్టును ఆదుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ‘బ్లూ’ జట్టుకు ఓపెనర్లు ఫైజ్ ఫజల్ (32), స్మిత్ పటేల్ (22) అర్ధ శతక భాగస్వామ్యం అందించారు. అయితే వీరిద్దరితో పాటు ధ్రువ్ షోరే (18), దీపక్ హుడా (26) వెంటవెంటనే ఔటవ్వడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో అన్మోల్ప్రీత్, రికీ భుయ్ బాధ్యతాయుత ఆటతో జట్టును ఆదుకున్నారు. శతకానికి కొద్ది దూరంలో అన్మోల్ను ప్రసిధ్ కృష్ణ (2/49) ఔట్ చేశాడు. మరో బౌలర్ పర్వేజ్ రసూల్ (2/65) రెండు వికెట్లు పడగొట్టాడు. -
మూడో రోజూ వర్షార్పణం
కాన్పూర్: ఇండియా ‘గ్రీన్’... ఇండియా ‘బ్లూ’ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ను వర్షం వదలడం లేదు. మ్యాచ్ మూడో రోజూ గురువారం వాన కారణంగా ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. వర్షంవల్ల రెండో రోజు ఆట కూడా పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఇండియా ‘బ్లూ’ జట్టు 177 పరుగులకే ఆలౌట్ కాగా... ఇండియా ‘గ్రీన్’ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ మ్యాచ్ ‘డ్రా’ కావడం లాంఛనమే. -
రెండో రోజు వర్షార్పణం
కాన్పూర్: ఇండియా ‘బ్లూ’, ఇండియా ‘గ్రీన్’ జట్ల దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిచింది. వాన కారణంగా బుధవారం ఒక్క బంతి కూడా పడలేదు. ‘బ్లూ’ జట్టు స్కోరు 177కు జవాబుగా తొలి రోజు 3 వికెట్లకు 100 పరుగులు చేసిన గ్రీన్... మరో 77 పరుగులు వెనుకబడి ఉంది. -
ఇండియా ‘బ్లూ’ 177 ఆలౌట్
‘గ్రీన్’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్ లక్నో: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’ బౌలర్ పర్వేజ్ రసూల్ (5/70) ఐదు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా మ్యాచ్ మొదటి రోజు మంగళవారం ఇండియా ‘బ్లూ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. మనోజ్ తివారి (138 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా, కెప్టెన్ సురేశ్ రైనా (40) ఫర్వాలేదనిపించాడు. బ్లూ జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో తివారి, రైనా మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఓపెనర్‌గా వచ్చిన ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (10) విఫలమయ్యాడు. గ్రీన్ బౌలర్లలో అనికేత్ చౌదరి 3, మయాంగ్ డగర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గ్రీన్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. కౌశిక్ గాంధీ (39), ప్రశాంత్ చోప్రా (26), నితిన్ సైని (25) అవుటయ్యారు. బీసీసీఐ సూచనతో హ డావిడిగా బ్లూ తరఫున ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగి న సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ 7 ఓవర్లలో 15పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. పంకజ్ సింగ్, వాఖరే చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం గ్రీన్ మరో 77 పరుగులు వెనుకబడి ఉంది. -
‘దులీప్’ మ్యాచ్ మూడో రోజు వర్షార్పణం
కాన్పూర్: ఇండియా ‘రెడ్, ఇండియా ‘బ్లూ’ జట్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ డే అండ్ నైట్ మ్యాచ్‌కు వాన అడ్డంకిగా నిలిచింది. భారీ వర్షం కారణంగా మూడో రోజు శుక్రవారం కేవలం 4.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మైదానం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో మిగతా ఆటను రద్దు చేశారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 232 పరుగులు చేసిన బ్లూ మరో 151 పరుగులు వెనుకబడి ఉంది. శనివారం మ్యాచ్‌కు చివరి రోజు. -
రోహిత్‌కు గాయం
ముంబై: గాయంతో నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ దేవధర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు ముందే గాయపడ్డాడు. మోకాలి గాయంతో అతను టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఇతని స్థానంలో మహారాష్ట్ర ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్‌ను ఇండియా ‘బ్లూ’ జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ గైర్హాజరీతో ఇండియా బ్లూ జట్టుకు స్పిన్నర్ హర్భజన్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. ఇండియా ‘రెడ్’ ఆటగాడు కేదార్ జాదవ్ అనారోగ్యంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇతని స్థానంలో హైదరాబాద్ లెఫ్టార్మ్ సీమర్ సీవీ మిలింద్‌ను ఎంపిక చేశారు. -
దులీప్ ట్రోఫీ చాంప్ ఇండియా బ్లూ
ఫైనల్లో రెడ్‌పై355 పరుగుల విజయం మ్యాచ్‌లో జడేజాకు పది వికెట్లు గ్రేటర్ నోయిడా: రవీంద్ర జడేజా (5/95, 5/76) స్పిన్ మాయాజాలంతో దులీప్ ట్రోఫీ తొలి డేనైట్ టోర్నీలో ఇండియా బ్లూ విజేతగా నిలిచింది. ఇక్కడి స్పోర్ట్స కాంప్లెక్స్ స్టేడియంలో బుధవారం ముగిసిన ఐదు రోజుల మ్యాచ్‌లో బ్లూ జట్టు 355 పరుగుల భారీ తేడాతో ఇండియా రెడ్‌పై ఘనవిజయం సాధించింది. జడేజా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 10 వికెట్లు తీయడం ఇది ఆరోసారి. చివరి రోజు ఇండియా బ్లూ 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్‌సను డిక్లేర్ చేసింది. కుల్దీప్కు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స ఆధిక్యం 337 పరుగులు కలుపుకొని ప్రత్యర్థి ముందు 517 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇండియా రెడ్ రెండో ఇన్నింగ్సలో 161 పరుగులకే ఆలౌటైంది. ధావన్ 29, యువరాజ్ సింగ్ 21 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్సలో ఇండియా బ్లూ ఆరు వికెట్లకు 693 పరుగులకు డిక్లేర్ చేయగా... రెడ్ జట్టు 356 పరుగులకు ఆలౌయింది. -
ఆ రెండింటికీ వ్యత్యాసం ఏమీ లేదు: గంభీర్
కోల్‌కతా:దేశవాళీ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో భాగంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి పింక్ బాల్‌తో నిర్వహిస్తున్న టెస్టు మ్యాచ్‌లో తాను ఎటువంటి ఇబ్బందులేమీ కనబడలేదని టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.ఇప్పటికే పింక్ బాల్ కు సంబంధించి పలు రకాల అభిప్రాయలు వెలువడిన నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. ' పింక్ బాల్ మ్యాచ్‌కు ఎటువంటి అడ్డూలేదు. కేవలం బంతి కలర్ మాత్రమే ఇక్కడ మారింది. మిగతా అంతా సంప్రదాయ ఎర్రబంతి తరహాలోనే ఉంది. కోకోబుర్రా పింక్ బాల్ బంతి ఎరుపు, తెలుపు బంతులు మాదిరిగానే ఉంది. పింక్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుందని, ఏదో అద్భుతం జరిగిపోతుందనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. నేనైతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొలేదు'అని గంభీర్ తెలిపాడు. శనివారం నుంచి జరుగునున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో గంభీర్ నేతృత్వంలోని ఇండియా బ్లూతో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా రెడ్ తలపడనుంది. -
ఫైనల్లో ఇండియా బ్లూ
దులీప్ ట్రోఫీ గ్రేటర్ నోరుుడా: దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో ఇండియా బ్లూ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండియా గ్రీన్‌తో ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగియగా... తొలి ఇన్నింగ్స ఆధిక్యం కారణంగా బ్లూ ముందంజ వేసింది. మ్యాచ్ చివరి రోజు బుధవారం 769 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్రీన్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. మురళీ విజయ్ (73), ఉతప్ప (66) అర్ధ సెంచరీలు చేశారు. అంతకు ముందు 85/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన బ్లూ రెండో ఇన్నింగ్సలో 298 పరుగులకు ఆలౌటైంది. జాక్సన్ (79 నాటౌట్), గంభీర్ (59), మయాంక్ అగర్వాల్ (58), దినేశ్ కార్తీక్ (57) రాణించారు. శ్రేయస్ గోపాల్‌కు 4 వికెట్లు దక్కారుు. మయాంక్ అగర్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇండియా రెడ్, ఇండియా బ్లూ జట్ల మధ్య శనివారంనుంచి ఇదే మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
పింక్ బాల్‌పై పూజారా అభ్యంతరం!
గ్రేటర్ నోయిడా: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీలో భాగంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్న పింక్ బంతులపై చటేశ్వర పూజారా పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా మూడో సెషన్లో లైట్ల వెలుతురులో కొత్త బంతిని ఆడటం తనకు అత్యంత ఇబ్బందిగా అనిపించిందని పూజారా తెలిపాడు. అటు పేస్ బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కోవడంతో పాటు, ఇటు స్పిన్నర్లు వేసే గూగ్లీలను ఆడేటప్పుడు కూడా సమస్య తలెత్తినట్లు తెలిపాడు. 'ఇది పింక్ బాల్‌తో నా తొలి గేమ్. ఈ వికెట్ పై బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించా. అయితే దీనివల్ల ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరకపోవచ్చు. రెండో కొత్త బంతితో వేసే మూడో సెషన్ ఇబ్బందిగా ఉంది. మరోవైపు లైట్ల వెలుతురులో స్పిన్నర్లు వేసే గూగ్లీని ఆడటం కష్టంగానే ఉంది. నా అభిప్రాయం ప్రకారం మూడో సెషన్ అనేది ఓవరాల్‌గా అత్యంత కష్టంగా అనిపించింది'అని పూజారా తెలిపాడు. ఇండియా బ్లూ-ఇండియా గ్రీన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో లీగ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ అనంతరం పూజారా పింక్ బాల్ పై స్పందించాడు. ఈ మ్యాచ్ లో పూజారా(166;280 బంతుల్లో 24 ఫోర్లు) భారీ శతకం సాధించాడు. -
చెలరేగిన మయాంక్, గంభీర్
ఇండియా బ్లూ 336/3 ‘గ్రీన్’ తో దులీప్ ట్రోఫీ మ్యాచ్ గ్రేటర్ నోరుుడా: ఇండియా ‘గ్రీన్’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఇండియా ‘బ్లూ’ జట్టు బ్యాటింగ్‌లో చెలరేగింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి బ్లూ తమ తొలి ఇన్నింగ్సలో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (218 బంతుల్లో 161; 21 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ సాధించగా, కెప్టెన్ గౌతం గంభీర్ (193 బంతుల్లో 90; 10 ఫోర్లు) రనౌటై త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా (63 బ్యాటింగ్; 13 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో ఇన్నింగ్‌సను నడిపించాడు. గ్రీన్ బౌలర్లలో దిండా, బుమ్రా చెరో వికెట్ తీశారు. -
మూడో రోజూ వరుణుడు...
న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ని వరుణుడు వరుసగా మూడో రోజూ వెంటాడాడు. భారత్ బ్లూ, రెడ్ల మధ్య జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇప్పటివరకూ ఒక్క ఇన్నింగ్స కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే. మూడో రోజు బుధవారం వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా బ్లూ తొలి ఇన్నింగ్సలో 78.2 ఓవర్లలో 5 వికెట్లకు 285 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ 35 పరుగులతో, జాక్సన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు కేవలం 16.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. -
ఇండియా బ్లూ 200/5
గ్రేటర్ నోయిడా: ఇండియా రెడ్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇండియా బ్లూ తమ తొలి ఇన్నింగ్సలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (92) సెంచరీ చేజార్చుకోగా, గౌతం గంభీర్ (77) రాణించాడు. రెడ్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 49 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. -
దులీప్ ట్రోఫీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
ఇండియా బ్లూ 105/0 గ్రేటర్ నోయిడా: ఇండియా బ్లూ, రెడ్ జట్ల మధ్య ప్రారంభమైన దులీప్ ట్రోఫీ రెండో లీగ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా తొలి రోజు సోమవారం 34.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ‘బ్లూ’ మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (102 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు), కెప్టెన్ గౌతం గంభీర్ (105 బంతుల్లో 51 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. రెడ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వికెట్ పడగొట్టడంలో విఫలమయ్యారు. తొలి లీగ్ మ్యాచ్‌లో రెడ్ జట్టు గ్రీన్‌పై గెలిచింది. -
చెలరేగిన యువరాజ్: ఫైనల్లో ఇండియా-బ్లూ
ఇండోర్: భారత సీనియర్ జట్టులో పునరాగమనానికి యువరాజ్ సింగ్ తన వైపునుంచి ఎలాంటి అవకాశాన్ని వృథా చేయడానికి ఇష్ట పడటం లేదు. ఇటీవలే వెస్టిండీస్ ‘ఎ’పై మూడు వన్డేల్లో చెలరేగిన యువీ, ఇప్పుడు చాలెంజర్ టోర్నీలోనూ సత్తా చాటాడు. వెన్ను నొప్పితో ఈ టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరమైన అతను శుక్రవారం ఇండియా ‘రెడ్’తో జరిగిన వన్డేలో చెలరేగాడు. యువరాజ్ సింగ్ (53 బంతుల్లో 84; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), అభిషేక్ నాయర్ (39 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుతో ఇండియా ‘బ్లూ’ 11 పరుగుల తేడాతో రెడ్‌పై విజయం సాధించింది. టోర్నీలో వరుసగా రెండు వన్డేలు నెగ్గిన ‘బ్లూ’ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే ఢిల్లీ, ఇండియా ‘రెడ్’ జట్ల మ్యాచ్ విజేతతో ‘బ్లూ’ ఫైనల్లో (ఆదివారం) తలపడుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ‘బ్లూ’ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ అక్షత్ రెడ్డి (96 బంతుల్లో 84; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో సారి ఆకట్టుకోగా, మనీశ్ పాండే (86 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించాడు. అనంతరం విజయం కోసం చివరి వరకు పోరాడిన ‘రెడ్’ 49.5 ఓవర్లలో 334 పరుగులకు ఆలౌటైంది. ముకుంద్ (86 బంతుల్లో 83; 9 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ పటేల్ (84 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, జాదవ్ (40 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. బ్లూ బౌలర్లలో వినయ్‌కుమార్‌కు 4 వికెట్లు దక్కాయి. -
ఇండియా ‘బ్లూ’లో అక్షత్
సాక్షి, విశాఖపట్నం: గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డికి మరో చక్కటి అవకాశం లభించింది. ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’ జట్టులో అక్షత్‌కు చోటు లభించింది. మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో సెలక్టర్లు చాలెంజర్ వన్డే టోర్నీ కోసం ఇండియా ‘బ్లూ’, ఇండియా రెడ్ జట్లను ఎంపిక చేశారు. బ్లూ జట్టుకు యువరాజ్, రెడ్ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. జాతీయ వన్డే చాంపియన్ ఢిల్లీ టోర్నీలో మూడో జట్టుగా బరిలోకి దిగుతుంది. ఈ నెల 26నుంచి 29 వరకు ఇండోర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.