న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ని వరుణుడు వరుసగా మూడో రోజూ వెంటాడాడు. భారత్ బ్లూ, రెడ్‌ల మధ్య జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇప్పటివరకూ ఒక్క ఇన్నింగ్‌స కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే.
మూడో రోజు బుధవారం వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా బ్లూ తొలి ఇన్నింగ్‌సలో 78.2 ఓవర్లలో 5 వికెట్లకు 285 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ 35 పరుగులతో, జాక్సన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు కేవలం 16.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.