‘గ్రీన్’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్
లక్నో: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’ బౌలర్ పర్వేజ్ రసూల్ (5/70) ఐదు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా మ్యాచ్ మొదటి రోజు మంగళవారం ఇండియా ‘బ్లూ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. మనోజ్ తివారి (138 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా, కెప్టెన్ సురేశ్ రైనా (40) ఫర్వాలేదనిపించాడు. బ్లూ జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో తివారి, రైనా మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఓపెనర్‌గా వచ్చిన ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (10) విఫలమయ్యాడు. గ్రీన్ బౌలర్లలో అనికేత్ చౌదరి 3, మయాంగ్ డగర్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం గ్రీన్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. కౌశిక్ గాంధీ (39), ప్రశాంత్ చోప్రా (26), నితిన్ సైని (25) అవుటయ్యారు. బీసీసీఐ సూచనతో హ డావిడిగా బ్లూ తరఫున ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగి న సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ 7 ఓవర్లలో 15పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. పంకజ్ సింగ్, వాఖరే చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం గ్రీన్ మరో 77 పరుగులు వెనుకబడి ఉంది.
ఇండియా ‘బ్లూ’ 177 ఆలౌట్
Published Wed, Sep 20 2017 1:29 AM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM
Advertisement
Advertisement