ఆ రెండింటికీ వ్యత్యాసం ఏమీ లేదు: గంభీర్
కోల్కతా:దేశవాళీ ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో భాగంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి పింక్ బాల్తో నిర్వహిస్తున్న టెస్టు మ్యాచ్లో తాను ఎటువంటి ఇబ్బందులేమీ కనబడలేదని టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.ఇప్పటికే పింక్ బాల్ కు సంబంధించి పలు రకాల అభిప్రాయలు వెలువడిన నేపథ్యంలో గంభీర్ స్పందించాడు.
' పింక్ బాల్ మ్యాచ్కు ఎటువంటి అడ్డూలేదు. కేవలం బంతి కలర్ మాత్రమే ఇక్కడ మారింది. మిగతా అంతా సంప్రదాయ ఎర్రబంతి తరహాలోనే ఉంది. కోకోబుర్రా పింక్ బాల్ బంతి ఎరుపు, తెలుపు బంతులు మాదిరిగానే ఉంది. పింక్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుందని, ఏదో అద్భుతం జరిగిపోతుందనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. నేనైతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొలేదు'అని గంభీర్ తెలిపాడు. శనివారం నుంచి జరుగునున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో గంభీర్ నేతృత్వంలోని ఇండియా బ్లూతో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా రెడ్ తలపడనుంది.