ఇండియా ‘బ్లూ’, ఇండియా ‘గ్రీన్’ జట్ల దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిచింది.
కాన్పూర్: ఇండియా ‘బ్లూ’, ఇండియా ‘గ్రీన్’ జట్ల దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిచింది. వాన కారణంగా బుధవారం ఒక్క బంతి కూడా పడలేదు. ‘బ్లూ’ జట్టు స్కోరు 177కు జవాబుగా తొలి రోజు 3 వికెట్లకు 100 పరుగులు చేసిన గ్రీన్... మరో 77 పరుగులు వెనుకబడి ఉంది.