India Green
-
భూగోళానికి పెనుముప్పు
గ్లాస్గో: వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, ప్రపంచ దేశాలు తక్షణమే మేలుకొని, దిద్దుబాటు చర్యలు ప్రారంభించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. స్కాట్లాండ్లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్‌లో ఆయన సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. బ్రిటన్ ఆతిథ్యం ఇస్తున్న కాప్–26 నవంబర్ 12 దాకా కొనసాగనుంది. సోమవారం భారత ప్రధాని మోదీ సహా దాదాపు 120 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రపంచం అంతం కాకుండా పోరాడే జేమ్స్‌బాండ్ ఆగమనం లాంటిదేనని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. అర్ధరాత్రి కావడానికి మరొక్క నిమిషం మాత్రమే ఉందని, మనం ఇప్పుడే ముందడుగు వేయాలని ఉద్బోధించారు. మాట తప్పితే ప్రజలు క్షమించరు 2015లో పారిస్‌లో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు కర్బన ఉద్గారాలకు కత్తెర వేసే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి గ్లాస్గోలో కాప్–26 నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను జాన్సన్ గుర్తుచేశారు. పాలకులు ఇస్తున్న హామీలన్నీ నీటి మూటలవుతున్నాయని థన్‌బర్గ్ ఆరోపించారని అన్నారు. మాట తప్పితే ప్రజలు మనల్ని క్షమించబోరని చెప్పారు. ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్‌కు ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది. క్లీన్ ఎనర్జీ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్ ప్రాజెక్టులకు ప్రైవేట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ గ్రూప్ నుంచి 210 మిలియన్ పౌండ్ల రుణ సాయం అందిస్తామని యూకే ప్రకటించింది. తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలి: బైడెన్ గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడానికి సమయం లేదని, తక్షణమే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఆయన కాప్–26లో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను నివారించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో ప్రపంచ దేశాలకు మరింత సాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికాను క్లీన్ ఎనర్జీ దేశంగా మారుస్తామంటూ జో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం తన ప్రణాళికను విడుదల చేసింది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పట్ల జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన కాప్ సదస్సుకు క్షమాపణ చెప్పారు. -
దులీప్ ట్రోఫీ విజేత ఇండియా రెడ్
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభ టోర్నీ దులీప్ ట్రోఫీని ఇండియా రెడ్ కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ ముగిసిన ఫైనల్లో ఆ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఇండియా గ్రీన్‌పై విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 345/6 తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రెడ్ 388 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నిం గ్స్‌కు దిగిన గ్రీన్‌ను ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే (5/13) హడలెత్తించాడు. పేసర్ అవేశ్ ఖాన్ (3/38) కూడా ఓ చేయి వేయడంతో గ్రీన్ 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. సిద్దేశ్ లాడ్ (80 బంతుల్లో 42; 6 ఫోర్లు), హైదరాబాదీ బ్యా ట్స్‌మన్, ఓపెనర్ అక్షత్ రెడ్డి (47 బంతుల్లో 33; 7 ఫోర్లు) మాత్రమే కాస్త ప్రతిఘటన కనబర్చారు. అక్షయ్, అవేశ్ ధాటికి వీరిద్దరు కాక కెప్టెన్ ఫైజ్ ఫజల్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. స్పిన్నర్ మయాంక్ మార్కండే గాయంతో బ్యాటింగ్‌కు దిగలేదు. రెడ్ తరఫున భారీ శతకంతో అదరగొట్టిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (153)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. సంక్షిప్త స్కోర్లు ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 231; ఇండియా రెడ్ తొలి ఇన్నింగ్స్: 388 (ఈశ్వరన్ 153; అంకిత్ రాజ్‌పుత్ 3/101, ధర్మేంద్ర జడేజా 3/93), ఇండియా గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 119 (అక్షత్ రెడ్డి 33; అక్షయ్ వాఖరే 5/13). -
‘డ్రా’ దిశగా...
బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా గ్రీన్, ఇండియా రెడ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ‘డ్రా’ దిశగా సాగుతోంది. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ‘రెడ్’ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 404 పరుగులు చేసింది. మహీపాల్ లోమ్రోర్ (126; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా... కరుణ్ నాయర్ (90; 16 ఫోర్లు) శతకం కోల్పోయాడు. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (38), అవేశ్ (34 బ్యాటింగ్), ఉనాద్కట్ (30) ఫర్వాలేదని పించారు. ధర్మేంద్ర సింగ్ జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మూడు రోజుల తర్వాత కూడా రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కాకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమైంది. ఆదివారం మ్యాచ్‌కు చివరి రోజు. ‘గ్రీన్’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 440 పరుగులకు ‘రెడ్’ మరో 36 పరుగుల దూరంలో ఉంది. అయితే చేతిలో ఒకే వికెట్ ఉండటంతో గ్రీన్ ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే గ్రీన్ జట్టుకు 3, రెడ్ జట్టుకు 1 పాయింట్ దక్కుతాయి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఈ రెండు జట్లు బ్లూ (2)ను వెనక్కి నెట్టి ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
మూడో రోజూ వర్షార్పణం
కాన్పూర్: ఇండియా ‘గ్రీన్’... ఇండియా ‘బ్లూ’ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ను వర్షం వదలడం లేదు. మ్యాచ్ మూడో రోజూ గురువారం వాన కారణంగా ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. వర్షంవల్ల రెండో రోజు ఆట కూడా పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఇండియా ‘బ్లూ’ జట్టు 177 పరుగులకే ఆలౌట్ కాగా... ఇండియా ‘గ్రీన్’ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ మ్యాచ్ ‘డ్రా’ కావడం లాంఛనమే. -
రెండో రోజు వర్షార్పణం
కాన్పూర్: ఇండియా ‘బ్లూ’, ఇండియా ‘గ్రీన్’ జట్ల దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిచింది. వాన కారణంగా బుధవారం ఒక్క బంతి కూడా పడలేదు. ‘బ్లూ’ జట్టు స్కోరు 177కు జవాబుగా తొలి రోజు 3 వికెట్లకు 100 పరుగులు చేసిన గ్రీన్... మరో 77 పరుగులు వెనుకబడి ఉంది. -
పింక్ బాల్‌పై పూజారా అభ్యంతరం!
గ్రేటర్ నోయిడా: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీలో భాగంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్న పింక్ బంతులపై చటేశ్వర పూజారా పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా మూడో సెషన్లో లైట్ల వెలుతురులో కొత్త బంతిని ఆడటం తనకు అత్యంత ఇబ్బందిగా అనిపించిందని పూజారా తెలిపాడు. అటు పేస్ బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కోవడంతో పాటు, ఇటు స్పిన్నర్లు వేసే గూగ్లీలను ఆడేటప్పుడు కూడా సమస్య తలెత్తినట్లు తెలిపాడు. 'ఇది పింక్ బాల్‌తో నా తొలి గేమ్. ఈ వికెట్ పై బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించా. అయితే దీనివల్ల ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరకపోవచ్చు. రెండో కొత్త బంతితో వేసే మూడో సెషన్ ఇబ్బందిగా ఉంది. మరోవైపు లైట్ల వెలుతురులో స్పిన్నర్లు వేసే గూగ్లీని ఆడటం కష్టంగానే ఉంది. నా అభిప్రాయం ప్రకారం మూడో సెషన్ అనేది ఓవరాల్‌గా అత్యంత కష్టంగా అనిపించింది'అని పూజారా తెలిపాడు. ఇండియా బ్లూ-ఇండియా గ్రీన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో లీగ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ అనంతరం పూజారా పింక్ బాల్ పై స్పందించాడు. ఈ మ్యాచ్ లో పూజారా(166;280 బంతుల్లో 24 ఫోర్లు) భారీ శతకం సాధించాడు.