రోహిత్‌కు గాయం
ముంబై: గాయంతో నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ దేవధర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు ముందే గాయపడ్డాడు. మోకాలి గాయంతో అతను టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఇతని స్థానంలో మహారాష్ట్ర ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్‌ను ఇండియా ‘బ్లూ’ జట్టులోకి తీసుకున్నారు.
రోహిత్ గైర్హాజరీతో ఇండియా బ్లూ జట్టుకు స్పిన్నర్ హర్భజన్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. ఇండియా ‘రెడ్’ ఆటగాడు కేదార్ జాదవ్ అనారోగ్యంతో టోర్నీకి దూరమయ్యాడు. ఇతని స్థానంలో హైదరాబాద్ లెఫ్టార్మ్ సీమర్ సీవీ మిలింద్‌ను ఎంపిక చేశారు.