చెలరేగిన మయాంక్, గంభీర్ | Mayank Agarwal, Gautam Gambhir Enjoy Run Feast | Sakshi
Sakshi News home page

చెలరేగిన మయాంక్, గంభీర్

Published Mon, Sep 5 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

Mayank Agarwal, Gautam Gambhir Enjoy Run Feast

ఇండియా బ్లూ 336/3 
‘గ్రీన్’ తో దులీప్ ట్రోఫీ మ్యాచ్ 


గ్రేటర్ నోరుుడా: ఇండియా ‘గ్రీన్’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఇండియా ‘బ్లూ’ జట్టు బ్యాటింగ్‌లో చెలరేగింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి బ్లూ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (218 బంతుల్లో 161; 21 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ సాధించగా, కెప్టెన్ గౌతం గంభీర్ (193 బంతుల్లో 90; 10 ఫోర్లు) రనౌటై త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు.

వీరిద్దరు తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా (63 బ్యాటింగ్; 13 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో ఇన్నింగ్‌‌సను నడిపించాడు. గ్రీన్ బౌలర్లలో దిండా, బుమ్రా చెరో వికెట్ తీశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement