
ఇండియా బ్లూ 200/5
గ్రేటర్ నోయిడా: ఇండియా రెడ్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇండియా బ్లూ తమ తొలి ఇన్నింగ్‌సలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (92) సెంచరీ చేజార్చుకోగా, గౌతం గంభీర్ (77) రాణించాడు. రెడ్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 49 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.