Ind vs Nz : Harbhajan Singh Congratulates Ravi Ashwin - Sakshi
Sakshi News home page

Ind vs Nz Test- Ravichandran Ashwin: భజ్జీ రికార్డు అధిగమించిన అశూ.. కంగ్రాట్స్‌ సోదరా!

Published Mon, Nov 29 2021 4:55 PM | Last Updated on Mon, Nov 29 2021 5:23 PM

Ind vs Nz 1st Test: Ravi Ashwin Record Harbhajan Singh Congratulates Him - Sakshi

Ind vs Nz 1st Test: Ravi Ashwin Record Harbhajan Singh Congratulates Him: టీమిండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ వికెట్‌ పడగొట్టి ఈ రికార్డును అందుకున్నాడు. 417 వికెట్ల మైలురాయిని చేరుకుని టీమిండియా వెటరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ పేరు మీద ఉన్న రికార్డును అధిగమించాడు. 

కాగా హర్భజన్‌ సింగ్‌ 103 మ్యాచ్‌లలో ఈ ఫీట్‌ నమోదు చేయగా... అశ్విన్‌ తన 80వ టెస్టు మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఈ జాబితాలో అనిల్‌ కుంబ్లే(619), కపిల్‌ దేవ్‌(434) ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలో అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘అదీ మరి.. అశ్విన్‌ పవర్‌..’’ అంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక భజ్జీ సైతం అశ్విన్‌ను అభినందించాడు.

‘‘కంగ్రాట్స్‌ అశ్విన్‌.. ఇలాంటి ఘనతలు ఎన్నో సాధించాలి సోదరా... ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక.. ఇంకా మెరుగ్గా ఆడాలి’’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక కాన్పూర్‌ టెస్టులో విజయం ఖాయమనుకున్న దశలో టీమిండియా బౌలర్లు ఆఖరి వికెట్‌ తీయలేకపోవడంతో డ్రాగా ముగిసింది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలుపొంది వరల్డ్‌చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న టీమిండియా ఆశ నెరవేరలేదు. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement