సుందర్‌ను సిద్ధం చేసుకోవాలి
హర్భజన్ సింగ్ వ్యాఖ్య
ముంబై: సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత స్పిన్నరే అయినా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్ సుందర్‌ను సిద్ధం చేయాలని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌లో 536 వికెట్లు పడగొట్టిన అశ్విన్... భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్‌మెంట్ సుందర్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది.
ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ... ‘అశ్విన్ జాతీయ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇప్పుడతడి వయసు 38. అతడు ఆటకు వీడ్కోలు పలికే సమయానికి జట్టు సుందర్‌ను సిద్ధం చేసుకోవాలనుకుంటుండోచ్చు. అందుకే విదేశీ పిచ్‌లపై అనుభవజు్ఞడైన అశ్విన్ కంటే సుందర్‌కు అవకాశం ఇచ్చారు. పెర్త్‌లో ఆ్రస్టేలియాపై టీమిండియా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఆసీస్ అజేయమైన జట్టుగా కనిపించేది.
అలాంటి చోట చక్కటి ఆటతీరుతో భారత జట్టు కంగారూలను కట్టడి చేసింది. ఇదే జోరు కొనసాగిస్తూ టీమిండియా 4–1తో సిరీస్ కైవసం చేసుకుంటుందనుకుంటున్నా’అని అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడం భారత్‌కు కొత్త కాదని... అయితే ఈసారి గెలవడం ముఖ్యమని భజ్జీ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకున్నా... జస్‌ప్రీత్ బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడని హర్భజన్ కొనియాడాడు.
కోహ్లిని చూసి లబుషేన్ నేర్చుకోవాలి: పాంటింగ్
ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఆ్రస్టేలియా ఆటగాళ్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌కు... మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సూచనలు చేశాడు. ఈ ఇద్దరూ భారత స్టార్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్నాడు. ‘పెర్త్ టెస్టులో లబుõÙన్ తీవ్రంగా తడబడ్డాడు. విభిన్నమైన వికెట్‌పై నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే. కానీ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం.
పెర్త్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఇదే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన విరాట్ రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులపై పైచేయి సాధించాడు. కోహ్లి తన బలాలపై దృష్టి పెడతాడు. లబుషేన్, స్మిత్ అదే చేయాలి. వారి సామర్థ్యాన్ని నమ్మాలి’అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. బుమ్రా వంటి బౌలర్‌ను ఎదుర్కొనేందుకు మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని... లేకుంటే ఫలితాలు అనుకూలంగా రావని పాంటింగ్ అన్నాడు.
మరోవైపు ఆసీస్ మాజీ పేసర్ జాన్సన్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు నుంచి లబుషేన్‌ను తప్పించాలని అన్నాడు. గత కొన్నాళ్లుగా ఫామ్‌లోలేక ఇబ్బంది పడుతున్న లబుషేన్ దేశవాళీల్లో ఆడితే తిరిగి లయ అందిపుచ్చుకోవచ్చని సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment